Divya Deshmukh
-
హంపి, దివ్య విజయం
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ మెరిశారు. హంపి వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా... దివ్య ఖాతాలో మూడో గెలుపు చేరింది. భారత్‌కే చెందిన ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబుల మధ్య జరిగిన ముఖాముఖి పోరు ‘డ్రా’గా ముగిసింది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలిచింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన మహారాష్ట్ర అమ్మాయి దివ్య 77 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. హారిక, వైశాలి మధ్య జరిగిన గేమ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్‌లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) 55 ఎత్తుల్లో... జు జినెర్ (చైనా) 39 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. 10 మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత జు జినెర్ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హంపి, దివ్య 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. హారిక, పొలీనా, మున్‌గున్‌తుల్ 2 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. -
నమస్తే దివ్య..!
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ యకుబొయెవ్(Nodirbek Yakubboev) తీరు మార్చుకున్నాడు. ప్రత్యర్థిని గౌరవించి సంస్కారం చూపాడు. ప్రాగ్ చెస్ ఫెస్టివల్లో భాగంగా చాలెంజర్ టోర్నమెంట్లో పాల్గొంటున్న నొదిర్బెక్ తనకు ఎదురైన భారత ప్రత్యర్థి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh)కి రెండు చేతులు జోడించి ‘నమస్తే’ అన్నాడు. దీనికి దివ్య కూడా ప్రతి నమస్కారం చేసింది.కాగా 23 ఏళ్ల యకుబొయెవ్ మూడో రౌండ్‌కు ముందు దివ్యకు నమస్కరించాడు. ఈ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... భారత అమ్మాయిపై విజయం సాధించాడు. మూడు రౌండ్లలో ఒక గేమ్ నెగ్గిన దివ్య రెండు గేముల్లో ఓడింది. ఉజ్బెక్ ప్లేయర్ తాజా వ్యవహారశైలి గతంలో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఉదంతాన్ని మరిచిపోయేలా చేసింది. That moment when Nodirbek Yakubboev greeted Divya Deshmukh with a traditional "Namaste" before the start of their 3rd round game at @PragueChess Festival Challengers 2025! #praguechessfestival pic.twitter.com/07zSR0ymh6— ChessBase India (@ChessbaseIndia) March 1, 2025 అప్పుడేం జరిగిందంటే... జనవరిలో టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నీలో (విక్‌ఆన్‌జీ, నెదర్లాండ్స్) నొదిర్బెక్... వైశాలి మధ్య మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆనవాయితీ ప్రకారం భారత అమ్మాయి కరచాలనం కోసం చేయి చాచగా... అదేం అక్కర్లేదన్నట్లుగా ఉజ్బెక్ ఆటగాడు షేక్‌హ్యాండ్‌కు నిరాకరించాడు. ఈ ‘నో షేక్‌హ్యాండ్’ ఉదంతం సోషల్ మీడియాలో వివాదం రేపింది. నెటిజన్లంతా నొదిర్బెక్ సంస్కారహీనుడంటూ కామెంట్లు పెట్టారు.ఇది కాస్తా వైరల్ కావడంతో వెంటనే ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... కావాలని నిరాకరించలేదని, మతపరమైన కట్టుబాట్లతోనే పరాయి అమ్మాయి చేతిని తాకలేదని... ప్రతిభావంతురాలైన వైశాలీ అన్నా... భారతీయులన్నా తనకెంతో గౌరవమని ‘ఎక్స్’లో వివరణ ఇచ్చాడు. కేవలం ట్వీట్‌తో ఆగకుండా టోర్నీ ఆడేందుకు వచ్చిన అక్కాతమ్ముళ్లు వైశాలి, ప్రజ్ఞానందలతో పాటు తోడుగా వచ్చిన వారి తల్లి నాగలక్ష్మిని వ్యక్తిగతంగా కలిసి పూలు, చాక్లెట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. ఇదీ చదవండి:తెలంగాణ శుభారంభం పంచ్‌కుల: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ‘బి’ డివిజన్ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 3–1 గోల్స్ తేడాతో అస్సాంపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అస్సాం జట్టే ముందుగా బోణీ కొట్టింది. తొలి క్వార్టర్‌లోనే అస్సాం కెప్టెన్ మున్మునీ దాస్ 14వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్‌తో జట్టు 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అస్సాం జోరు ఆ క్వార్టర్‌కే పరిమితమైంది.రెండో క్వార్టర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ అమ్మాయిలు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో అస్సాం క్రీడాకారిణులు చేష్టలుడిగారు. 23 నిమిషంలో ప్రతివ కిండో, 26వ నిమిషంలో సుమి ముందరి, 28వ నిమిషంలో పూజ రాథోడ్ తలా ఒక గోల్ చేశారు. తర్వాతి క్వార్టర్లలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలంగాణ 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఇదే డివిజన్లో జరిగిన పూల్ ‘బి’ పోటీల్లో ఢిల్లీ 1–0తో హిమాచల్ ప్రదేశ్‌పై గెలుపొందగా... చత్తీస్‌గఢ్, చండీగఢ్‌ల మధ్య జరిగిన పోరు 1–1తో ‘డ్రా’గా ముగిసింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులో దివ్య దేశ్‌ముఖ్ (ఫోటోలు)
-
ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్ట.. అందంలోనూ తగ్గేదేలే (ఫొటోలు)
-
Divya Deshmukh: ప్రపంచ చాంపియన్.. ఈ విషయాలు తెలుసా?
గాంధీనగర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత యువ చెస్ తార దివ్య దేశ్‌ముఖ్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ జూనియర్ మహిళల అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.చివరిదైన 11వ రౌండ్లో దివ్య 57 ఎత్తుల్లో క్రస్తెవా బెలోస్లావా (బల్గేరియా)పై గెలిచింది. నాగపూర్‌కు చెందిన దివ్య ఈ టోర్నీలో తొమ్మిది గేముల్లో నెగ్గి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది.క్రచ్యాన్ మరియం (అర్మేనియా; 9.5 పాయింట్లు) రెండో స్థానాన్ని దక్కించుకోగా... అలవెర్దియెవా అయాన్ (అజర్బైజాన్; 8.5 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించింది. విజేతగా నిలిచిన దివ్యకు 2000 యూరోల (రూ. 1 లక్షా 79 వేలు) ప్రైజ్‌మనీతోపాటు స్వర్ణ పతకం, విన్నర్స్ ట్రోఫీ లభించాయి. విజయానంతరం దివ్య మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిని ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఆటను ఎలా ఆడాలో కూడా పూర్తిగా నేర్చుకున్న తర్వాతే నేను రంగంలోకి దిగాను’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.18 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య సాధించిన విజయాలు2020- ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్(టీమ్)- స్వర్ణం2022- వుమెన్స్ ఇండియన్ చెస్ చాంపియన్‌షిప్- విజేత2022- చెస్ ఒలింపియాడ్(వ్యక్తిగత విభాగం)- కాంస్యం2023- ఆసియా మహిళా చెస్ చాంపియన్‌షిప్- విజేత2023- టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నమెంట్(వుమెన్స్ రాపిడ్)- ప్రథమ స్థానం2024- ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్- చాంపియన్. -
భారత్‌కు 8 పతకాలు
న్యూఢిల్లీ: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మంగోలియాలో జరిగిన ఈ టోర్నీలో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్య పతకాలను సాధించారు. అండర్-12 బాలబాలికల విభాగంలో రెండు స్వర్ణాలను భారత క్రీడాకారులే గెలుచుకున్నారు. బాలుర ఈవెంట్లో ప్రజ్ఞానానంద, బాలికల విభాగంలో దివ్యా దేశ్‌ముఖ్ విజేతలుగా నిలిచారు. ఇదివరకే దివ్య బ్లిట్జ్‌లో స్వర్ణం, ర్యాపిడ్ ఈవెంట్లో రజతాన్ని నెగ్గింది.