వన్‌ప్లస్ దివాలీ డాష్ సేల్ ... మరో బంపర్ ఆఫర్
చైనీస్ హ్యాండ్ సెట్ మేకర్ వన్ ప్లస్ కూడా పండుగ సీజన్ అమ్మకాల్లోకి ప్రవేశించింది. ఒక రూపాయికే స్మార్ట్ ఫోన్ అందించడానికి రడీ అయ్యింది. అక్టోబర్ 24 నుండి 26వరకు కంపెనీ ఈ కామర్స్ స్టోర్ లో జరుగనున్న దీపావళి డాష్ అమ్మకాల్లో ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మూడు రోజులు, మధ్యాహ్నం12, సాయంత్రం 4గంటలకు, రాత్రి 8గంటలకు ఫ్లాష్ సేల్ వుంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది. రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారుడు కేవలం ఒక రూపాయికే వన్ ప్లస్ 3 ఇతర యాక్ససరీస్‌ను గెల్చుకోవచ్చని వెబ్ సైట్ లో ప్రకటించింది. ఈ పోటీలో భాగంగా మిస్టరీ బాక్సులను లక్కీ డ్రా ద్వారా ఎంపకి చేస్తామని, అలాగే ఇలా విక్రయించిన ఫోన్లకు రిటన్ పాలసీ వర్తించదని స్పష్టం చేసింది.
అయితే ఈ పోటీలో పాల్గొన దలచినవారు వన్ ప్లస్ స్టోర్ లో అకౌంట్ తెరిచి, డాష్ సేల్ లో రిజిస్టర్ కావాలి. మొబైల్ నెం, పూర్తి చిరునామా స్పష్టంగా పేర్కొనాలి. ఆగండాగండి.. అంతటితో అయిపోలేదు.. అకౌంట్ ఓపెన్ చేసిన అనంతరం దీన్ని కనీసం ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ పాంలో షేర్ చేయాలి...అపుడు మాత్రమే డాష్ సేల్ లో ఎంట్రీ లభిస్తుంది. ఆ తరువాత ఆ రోజుకు సంబంధించి కొన్ని మిస్టరీ బాక్సలను కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఒక్కొక్క ఖాతాదారుడు ఒక్కో బాక్స్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఈ లక్కీ బాక్స్ లో ఏముందో తెలుసుకోవాలంటే..ఒక రూపాయి ఖచ్చితంగా చెల్లించాలి. మూడు గంటలలోపు చెల్లించడంలో ఫెయిల్ అయితే.. బాక్స్ డ్రా చేసే అవకాశం మిస్ అయినట్టే.
మరోవైపు మీరు మళ్లీ డ్రా బాక్స్ డ్రా చేయడం అనేది మీ డాష్ లెవల్ ను బట్టి ఉంటుంది. వన్ ప్లస్ సైట్ రిజిస్టర్ కోసం స్నేహితులకు పంపే రిక్వెస్టులు, వన్ ప్లస్ సోర్ల ద్వారా ఇతర మొబైళ్ల కొనుగోలు తదితర అంశాలను బట్టి ఈ లెవల్ నిర్ణయించబడుతుందని కంపెనీ వెబ్ సైట్ లో ప్రకటించింది. అయితే మొత్తం ఎన్ని ఫోన్లను అందించనున్నదీ, ఎన్ని మిస్టరీ బాక్సులను పొందుపరిచిందీ స్పష్టంగా ప్రకటించలేదు. మరిన్ని వివరాలకోసం వన్ ప్లస్ వెబ్ సైట్ లో చెక్ చేయండి.