DJ Beat
-
మురారి మోపెడ్ సంబరం, రూ. 60వేలతో డీజే పార్టీ...కట్ చేస్తే!
గోరంత విషయాన్ని కొండంత చేసి చూపించడం లేటెస్ట్ ట్రెండ్. దీన్నే బడాయి అని కూడా అంటారు. ఇదే ఫాలో అయ్యాడు ఓ బడాయి బసవయ్య. బ్యాంకు లోన్‌తో బైక్ కొనుగోలు చేసి, నానా హంగామా చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అసలు స్టోరీ ఏంటీ అంటే.. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన మురారి లాల్ కుష్వాహ టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అలా వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో ఒక మోపెడ్ కొనుక్కోవాలనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత చేసిన హడావిడే సోషల్ మీడియాలో విడ్డూరంగా నిలిచింది. బైక్ కొనుక్కోవాలనే ఆలోచనరాగానే అందరిలాగానే బ్యాంకును ఆశ్రయించాడు మురారి లాల్. రూ. 90వేల విలువైన టూవీలర్ ( టీవీఎస్ మోపెడ్) కోసం లోన్ తీసుకొని, 20వేల రూపాయల డౌన్‌పేమెంట్ కట్టాడు. ఇక్కడే మొదలైంది అసలు కథ. బైక్‌ను తీసుకోవడానికి షోరూమ్‌కు ఏకంగా గుర్రపు బండి, డీజే గ్యాంగ్‌తో తరలి వచ్చాడు. ఆచారం ప్రకారం, కొత్త బండికి పూలమాలవేసి, పూజలు నిర్వహించాడు. అనంతరం బైక్ ఊరేగింపు షురూ అయింది. దోస్తులతో కలిసి డీజే పాటలకు స్టెప్పులేస్తూ దాదాపు 115 కిలోమీటర్లు ఊరేగింపు తీశారు. అంతేకాదు బండి అందరికీ కనిపించేలా జేసీబీతో కూడా పైకెత్తించాడు. దీని కోసం మురారి పెట్టిన మొత్తం ఖర్చు అక్షరాలా 60వేల రూపాయలు. పైగా తన పిల్లల సంతోషం కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో వేడుక చేసుకోవడం తనకిష్టమని చెప్పాడు.ట్విస్ట్ ఏంటంటేఈ తతంగం అంతా పోలీసులకు చేరింది. ముందస్తు అనుమతి లేకుండా రహదారిపై అనవసర హగామా చేయడమేకాకుండా, డీజేతో శబ్ద, వాయు కాలుష్యానికి కారణమై నారంటూ స్థానిక పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురారితో పాటు డీజే ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేశారు. డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మురారికి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రూ.12,500 పెట్టి ఫోన్ కొని, రూ.25 వేలతో సంబరాలు చేసుకున్నాడట మురారి. -
హైదరాబాద్‌లో నో డీజే.. నో క్రాకర్స్: సీపీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నేటి నుంచి డీజే, క్రాకర్స్ ఉపయోగించడంపై నిషేధం విధిస్తున్నట్టు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శబ్ధ కాలుష్యాన్ని కారణంగానే డీజేలకు అనుమతులను సవరిస్తున్నట్టు సీపీ చెప్పారు.సీవీ ఆనంద్ మంగళవారం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చలు జరిపాము. ఈ క్రమంలోనే డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధించడం జరిగింది. నేటి నుండి హైదరాబాద్‌లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధింపు ఉంటుంది. మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేలను ఉపయోగించకూడదు. మైకులు, సౌండ్ సిస్టంను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి తీసుకోవాల్సిందే. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబుల్స్‌ను నిర్దేశించాము.జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబుల్స్‌కి మించి సౌండ్ సిస్టంలో వాడరాదు. రాత్రి వేళలో 45 డెసిబుల్స్‌కు మించి సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగించరాదు. మతపరమైన ర్యాలీలలో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధం ఉంటుంది. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ పరికరాలపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిషేధం ఉంటుంది. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆసుపత్రులు, స్కూల్స్, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు 5000 రూపాయల జరిమానా విధింపు ఉంటుంది. అలాగే, బీఎన్ఎస్ చట్ట ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు జరిమానా పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
HYD: డీజే, క్రాకర్స్ కాల్చడంపై వ్యతిరేకత.. సీపీ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: నగరంలో డీజేల వాడకం, బాణాసంచా వినియోగంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. పండుగల ర్యాలీలో డీజేల వాడకంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో వివిధ మతాల పెద్దలతో సీపీ సమావేశం ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లో డీజేలు, బాణాసంచా కాల్చడంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో వీటి వాడకంపై సీపీ సీవీ ఆనంద్.. మత పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. మరోవైపు.. క్రాకర్, డీజే వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు అంటున్నారు. ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్ -
జస్ట్ మ్యూజిక్
డీజే బీట్... మ్యూజిక్ హోరు... ఆపై కుర్రకారు గ‘మ్మత్తు’ల హుషారు. రెండు రోజుల పాటు సిటీ యూత్‌ను ఊపేసిన కింగ్ ఫిషర్ ‘ది గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్’ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు నిర్వహించిన గ్రాండ్ గాలా ఈవెంట్... క్లాసికల్ మ్యూజిక్కు ఫ్యూజన్ సంగీతం మిక్సింగ్‌తో దుమ్ము రేగింది. హాస్యం, మెడ్లీ, సౌతిండియన్, బాలీవుడ్, మెటల్ మ్యూజిక్ మ్యాజిక్కు అమ్మాయిలు, అబ్బాయిలు ఆడి పాడి ఆసాంతం ఆస్వాదించారు.