
సాక్షి, హైదరాబాద్: నగరంలో డీజేల వాడకం, బాణాసంచా వినియోగంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. పండుగల ర్యాలీలో డీజేల వాడకంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో వివిధ మతాల పెద్దలతో సీపీ సమావేశం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో డీజేలు, బాణాసంచా కాల్చడంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో వీటి వాడకంపై సీపీ సీవీ ఆనంద్.. మత పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. మరోవైపు.. క్రాకర్, డీజే వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment