DJSI
-
డీజేఎస్ఐలో లిస్టయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండిసెస్ (డీజేఎస్ఐ)లో చోటు దక్కించుకుంది. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సెన్సైస్ పరిశ్రమల గ్రూప్‌లో తమ సంస్థ లిస్టయినట్లు డీఆర్ఎల్ వెల్లడించింది. 22 అంశాల ప్రాతిపదికన సంస్థ ఎంపిక జరిగింది. ఉత్పత్తుల నాణ్యత, రీకాల్ నిర్వహణ, కార్పొరేట్ సామాజిక బాధ్యత తదితర అంశాల్లో తమకు అత్యుత్తమ స్కోరు దక్కినట్లు డీఆర్ఎల్ తెలిపింది. వర్ధమాన దేశాల నుంచి ఈ సూచీలో చోటు దక్కించుకున్న ఏకైక ఫార్మా కంపెనీ తమదేన ని సంస్థ కో-చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. -
‘డోజోన్స్’ సూచీలో విప్రో
బెంగళూరు: అంతర్జాతీయంగా డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండెక్స్‌లో (డీజేఎస్ఐ) వరుసగా ఆరో ఏడాదీ చోటు దక్కించుకున్నట్లు ఐటీ దిగ్గజం విప్రో తెలిపింది. అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ సూచీలో కూడా స్థానం దక్కినట్లు వివరించింది. 2015-16కు గాను ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి మొత్తం 1,845 కంపెనీలను మదింపు చేయగా .. డీజేఎస్ఐ వరల్డ్‌లో 317 సంస్థలకు స్థానం లభించినట్లు పేర్కొంది. కార్పొరేట్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, కార్మిక విధానాలు, సామాజిక కార్యకలాపాలు తదితర అంశాల్లో నిలకడగా రాణిస్తున్న సంస్థలకు ఈ సూచీలో చోటు దక్కుతుంది.