‘డోజోన్స్’ సూచీలో విప్రో | Wipro selected member of Dow sustainability index | Sakshi
Sakshi News home page

‘డోజోన్స్’ సూచీలో విప్రో

Published Tue, Sep 29 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

‘డోజోన్స్’ సూచీలో విప్రో

‘డోజోన్స్’ సూచీలో విప్రో

బెంగళూరు: అంతర్జాతీయంగా డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండెక్స్‌లో (డీజేఎస్‌ఐ) వరుసగా ఆరో ఏడాదీ చోటు దక్కించుకున్నట్లు ఐటీ దిగ్గజం విప్రో తెలిపింది. అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ సూచీలో కూడా స్థానం దక్కినట్లు వివరించింది. 2015-16కు గాను ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి మొత్తం 1,845 కంపెనీలను మదింపు చేయగా .. డీజేఎస్‌ఐ వరల్డ్‌లో 317 సంస్థలకు స్థానం లభించినట్లు పేర్కొంది. కార్పొరేట్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, కార్మిక విధానాలు, సామాజిక కార్యకలాపాలు తదితర అంశాల్లో నిలకడగా రాణిస్తున్న సంస్థలకు ఈ సూచీలో చోటు దక్కుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement