DMK candidates
-
విజయకాంత్, ప్రేమలతపై సెటైర్లు..
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతే కాదు, ఓటింగ్ శాతాన్ని డీఎండీకే పూర్తిగా కోల్పోయింది. వరుస పతనాల నేపథ్యంలో ఆ పార్టీ మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ పార్టీకి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు అయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం దూరం కావడం దాదాపుగా ఖాయమైంది. విజయకాంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగలడం ఓ వైపు ఉంటే, ఆయన సతీమణి ప్రేమలత తీరుపై డీఎండీకే వర్గాలు విమర్శలు గుప్పించే పనిలో పడడం గమనార్హం. సినీ నటుడిగా అశేషాభిమాన లోకం మదిలో ముద్ర వేసుకున్న విజయకాంత్ 2005లో మదురై వేదికగా డీఎండీకేను ప్రకటించారు. దేశీయ ముర్పోగు ద్రావిడ కళగంతో 2006లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో విజయకాంత్ ఒక్కడే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అయితే, ఆ ఎన్నికల్లో విజయకాంత్ సొంతం చేసుకున్న ఓటు బ్యాంక్ ఆ పార్టీ బలాన్ని మరింతగా పెంచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయకాంత్ 10.3 శాతం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తదుపరి పరిణామాలతో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇందుకు కారణం అన్నాడీఎంకేతో పొత్తుతో ఆ ఎన్నికల్ని ఎదుర్కొనడమే. ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్నత స్థితికి ఎదిగిన వేళ అన్నాడీఎంకేతో వైరం విజయకాంత్‌ను కష్టాల సుడిగుండంలో పడేసింది. పార్టీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే జై కొట్టడం వంటి పరిణామాలు విజయకాంత్‌ను ఇరకాటంలో పెట్టాయి. అయినా, ఏ మాత్రం తగ్గని విజయకాంత్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ నేతృత్వంలో కూటమి ఏర్పాటులో సఫలీకృతుడయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో పాటు ఓటు బ్యాంక్ పతనం మొదలైంది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వెళ్లడంతో అభ్యర్థుల కోసం తీవ్ర కుస్తీలు పట్టక తప్పలేదు. చివరకు ఆ ఎన్నికల ఫలితాలు విజయకాంత్‌ను పాతాళంలోకి నెట్టే పరిస్థితిని కల్పించాయి. విజయకాంత్ సైతం ఓటమి పాలు కాగా, ఓటు బ్యాంక్ ఐదు శాతం పైగా దక్కించుకుని పార్టీ గుర్తింపు రద్దు కాకుండా గట్టెక్కారు. గుర్తింపు రద్దయినట్లే.... 2016 ఎన్నికల అనంతరం అనారోగ్య కారణాలతో విదేశాలకు వెళ్తూ వచ్చిన విజయకాంత్‌కు 2019 లోక్‌సభ ఎన్నికల్లో డిమాండ్ పెరిగింది. ఆయన్ను తమ వైపు అంటే, తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రయత్నించాయి. చివరకు అన్నాడీఎంకే – బీజేపీతో జతకట్టిన విజయకాంత్ నాలుగు చోట్ల పోటీ చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు డీఎండీకేను కష్టాల కడలిలో పడేసింది. డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్ పూర్తిగా పతనమైంది. విజయకాంత్ బావ మరిది సుదీష్ కళ్లకురిచ్చి నుంచి పోటీ చేయగా, 3 లక్ష 21 వేల 794 ఓట్లు దక్కించుకున్నారు. విరుదునగర్‌లో ఆ పార్టీ నేత అళగర్ స్వామి 3 లక్షల 16 వేల 329 ఓట్లు రాబట్టుకోగలిగారు. ఇక, ఉత్తర చెన్నైలో మోహన్ రాజు లక్షా 29 వేల 468, తిరుచ్చిలో ఇలంగోవన్ లక్షా 61 వేల 999 ఓట్లతో సరిపెట్టుకున్నారు. పార్టీ ఓటు బ్యాంక్ అన్నది 2.19 శాతానికి దిగ జారింది. దీంతో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు అయినట్టే అన్న పరిస్థితి. డిపాజిట్లతో పాటు ఓటు బ్యాంక్ తగ్గిన దృష్ట్యా, ఆ పార్టీ ఎన్నికల చిహ్నం ఢంకా కూడా దూరమైనట్టే. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఓ పార్టీకి తప్పనిసరిగా ఉండాలంటే, కనీసం ఆరు శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను కల్గి ఉండాల్సి ఉంది. అలాగే, ఒక ఎంపీ లేదా, కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలైనా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, డీఎండీకేకు వరసుగా మూడు ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ పార్టీ గుర్తింపు ఇక రద్దయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం కూడా ఆ పార్టీకి శాశ్వతంగా దూరం ఖావడం తథ్యం. కాగా, పార్టీ ఓటమికి కోశాధికారి ప్రేమలత విజయకాంత్ కారణం అంటూ ఆ పార్టీ వర్గాలే విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా, సామాజిక మాధ్యమాల్లో ప్రేమలత విజయకాంత్‌పై సెటైర్లు జోరందుకోవడం గమనార్హం. డీఎంకే తలుపులు తెరచి ఉన్నప్పుడే లోనికి వెళ్లకుండా, అన్నాడీఎంకే వైపుగా వెళ్లి వదినమ్మ పెద్ద తప్పే చేశారని, ఇప్పడు అన్నయ్యకు మరింత కష్టాలు తెచ్చి పెట్టారన్నట్టుగా వ్యాఖ్యల తూటాలు సామాజిక మాధ్యమాల్లో పేలుతున్నాయి. -
కట్టలు కట్టలుగా నోట్లు
సాక్షి, చెన్నై: ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లకు తాయిలాల పంపిణీకి వినూత్న మార్గాల్ని అన్వేషించే పనిలో రాజకీయ పక్షాలు ఉన్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో కారుడోర్లకు ఉన్న అద్దాల కింది భాగంలో నోట్ల కట్టల్ని ఉంచి మరీ తరలించడం బుధవారం వెలుగు చూసింది. వీసీకే పార్టీకి చెందిన వ్యక్తి కారుగా తేలడం, అందులో రూ. 2.10 కోట్లు పట్టుబడడంతో ఆ నాయకుడిపై ఈసీ గురి పడింది. అలాగే, మదురైలో 47 కేజీల బంగారు, కడలూరులో రూ. ఐదు కోట్లు విలువగల బంగారాన్ని ఎన్నికల వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో హోరెత్తుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లకు తాయిలాల పంపిణికీ తగ్గ సరంజామాల్ని సిద్ధం చేసుకునే పనిలో రాజకీయ పక్షాలు ఉన్నాయని చెప్పవచ్చు. వేలూరులో డీఎంకేకు చెందినదిగా భావిస్తున్న కోట్లాది రూపాయలు పట్టుబడిన నేపథ్యంలో ఇతర పార్టీలు జాగ్రత్తల్లో పడ్డట్టున్నాయి. ఆయా అభ్యర్థులు తమ వద్ద ఉన్న నగదు జాగ్రత్త పరుచుకునేందుకు వినూత్న మార్గాల్ని అన్వేషించే పనిలో పడ్డట్టున్నారు. ఐటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ల నుంచి తప్పించుకునేందుకు ఎన్ని వ్యూహాలు చేసినా, వినూత్న మార్గాలు అన్వేషించినా, పట్టుబడాలని రాసి పెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. బుధవారం అరియలూరు మార్గంలో ఓ కారు పయనిస్తుండడంతో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అనుమానం నెలకొంది. దీంతో ఆ కారును చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ కారు ముందు భాగంలో వీసీకే పార్టీ జెండా ఉండడంతో అనుమానాలకు మరింత బలం చేకూరినట్టు అయింది. ఆకారును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎక్కడ ఒక్క పైసా కూడా చిక్క లేదు. చివరకు కారు డోర్లకు ఉన్న అద్దాల్ని దించేందుకు ప్రయత్నించగా, అవి కిందికి వెళ్ల లేదు. అద్దాలు జాం అయినట్టుగా అందులో ఉన్న వాళ్లు పేర్కొన్నా, ఫ్లయింగ్ స్క్వాడ్ మాత్రం వదలి పెట్ట లేదు. కావాల్సిన పనిముట్లు తెప్పించి తెరచి చూడగా, అద్దాల కింది భాగంలోకట్టలు కట్టలుగా నోట్లు బయట పడ్డాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం రూ.2.10 కోట్లు పట్టుబడ్టట్టు అధికారులు తేల్చారు. ఈ నగదు తిరుచ్చిలోని వీసీకే పార్టీకి చెందిన ప్రముఖుడిదిగా తేలడంతో ఆ వ్యక్తిని గురి పెట్టారు. ఐటీ వర్గాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. అరియలూరు వైపుగా ఈ నగదు వెళ్తుండడంతో చిదంబరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వీసీకే నేత తిరుమావళవన్ కోసమేనా అన్న చర్చ జోరందుకుంది. మదురైలో బంగారం: తమకు అందే సమాచారాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ దూసుకెళ్తోన్నది. బన్రూటిలో జరిపిన తనిఖీల్లో ఓ పంచ లోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఓ ఆలయం నుంచి చోరీ చేసి తరలిస్తున్నట్టుగా విచారణలో తేలింది. అలాగే, మదురైలో ఓ వ్యాన్‌లో తనిఖీ చేయగా 47 కేజీల బంగారం బయట పడింది. దీని విలువను లెక్కిస్తున్నారు. కడలూరు సమీపంలోని వేప్పూరులో ఓ వాహనం నుంచి రూ. 5.90 కోట్లు విలువగల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై పెరంబూరు నియోజకవర్గం పరిధిలోని కొడుంగయూర్ వద్ద ఓ కారులో రూ.4.25 లక్షలు బయట పడింది. అలాగే, పొల్లాచ్చిలో అన్నాడీఎంకే వర్గాలు మహిళలకు నోట్లు పంచేందుకు సిద్ధం చేసిన టోకెన్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు తగ్గ ఫిర్యాదుతో కేసు కూడా నమోదు చేశారు. అరంతాంగిలోని డీఎంకే ప్రముఖుడి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉన్న సమాచారంతో ఆ ఇంట్లో పోలీసులు , ఫ్లయింగ్ స్క్వాడ్ వర్గాలు తనిఖీలు చేపట్టాయి. చెన్నై థౌజండ్ లైట్స్, అన్నా సాలైలలో జరిపిన తనిఖీల్లో రూ. 75 లక్షలు గల నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే,రూ. 50 వేలు విలువగల కుంకుమ భరిణలను సైతం స్వాధీనం చేసుకున్న అధికారులు, శ్రీలంకకు చెందిన ఓ యువకుడి వద్ద విచారణ జరుపుతున్నారు. చెన్నైలో మాత్రం ఇప్పటి వరకు రూ. ఏడు కోట్ల నగదు, 40 కేజీల బంగారం చిక్కినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, కోయంబత్తూరులో పారిశ్రామిక వేత్తగా ఉన్న జి రమేష్ నేతృత్వంలోని యూనివర్సల్ ట్రేడింగ్ సొల్యూషన్ పేరిట ఉన్న ఓ సంస్థలో ఐటీ వర్గాలు సోదాలు జరిపాయి. ఇక్కడ లెక్కలోకి రాని రూ. 9.83 కోట్లు నగదు బయట పడడం గమనార్హం. పెద్ద ఎత్తున నోట్లు, నగలు బయట పడుతుండడంతో పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, ఐటీ వర్గాలు మూకుమ్మడిగా దాడుల్లో దిగడం అభ్యర్థుల్ని బెంబేళెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. -
'డీఎంకే అభ్యర్థులదే అన్నిచోట్లా విజయం'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులు అన్నిచోట్ల విజయం సాధిస్తారని డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం.. స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలిత తిరిగి అధికారంలోకి రావాలని ఎవ్వరూ కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాగా, చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. నేడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. -
హెచ్చరిక
సాక్షి, చెన్నై: కోట్లు కుమ్మరించి సీట్లు దక్కించుకున్న డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం చెబుతామని ఎంకే అళగిరి హెచ్చరించారు. డీఎంకే నుంచి శాశ్వతంగా తనను బహిష్కరించడంతో అళగిరి స్వరాన్ని పెంచారు. ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పార్టీ అధినేత కరుణానిధి మినహా తక్కిన వారిపైఆరోపణ అస్త్రాలను సంధిస్తూ వస్తున్న అళగిరి ఆదివారం తన మద్దతుదారులకు విరుదునగర్ వేదికగా ఓ పిలుపునిచ్చారు. డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం చెబుదామని, ఇందుకు ప్రతి మద్దతుదారుడు సిద్ధం కావాలని ఆయన ఇచ్చిన పిలుపు డీఎంకే అభ్యర్థుల్లో గుబులురేపుతోంది. విరుదునగర్ కాస్యపట్టిలోని తన మద్దతుదారులను అళగిరి ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. విరుదునగర్‌లో బీజేపీ కూటమి తరపున ఎండీఎంకే అభ్యర్థి వైగో బరిలో ఉన్న విషయం తెలిసింది. ఆయనకు అనుకూలంగా వ్యవహరించే విధంగా మద్దతుదారులకు అళగిరి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అద్దంపట్టే విధంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కోట్లు కుమ్మరించి సీట్లు దగ్గించుకున్న డీఎంకే అభ్యర్థులకు గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. మద్దతుదారులందరూ వారికి గుణపాఠం నేర్పడమే లక్ష్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, నిజమైన కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరగడం లేదని శివాలెత్తారు. ఆర్థిక బలం ఉన్నంత మాత్రాన గెలుస్తామని జబ్బలు చరచడం కాదని, ప్రజా మద్దతు, మద్దతుదారుల సహకారం అవసరం అన్న విషయాన్ని డీఎంకేకు గుర్తుచేస్తామని హెచ్చరించారు. తాను దక్షిణాది జిల్లాల కార్యదర్శిగా ఉన్న సమయంలో అభ్యర్థులను నిలబెట్టేందుకు భయపడే అన్నాడీఎంకే ఇప్పుడు కొత్త వారిని తెరపైకి తెచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. డీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతుకావడం తథ్యమని అళగిరి పేర్కొన్నారు.