docter venkaiah
-
ఇద్దరూ వైద్యులే..!
సాక్షి, కొండపి (ప్రకాశం): ఎన్నికల్లో ముఖ్యమైన ప్రచార పర్వం ముగిసింది. ఓటరు తమకు నచ్చిన నేతను ఎన్నుకునే సమయం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల గుణగణాలపై ఓటర్లు చర్చించుకుంటున్నారు. కొండపిలో ప్రధాన ప్రత్యర్థులుగా ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇద్దరూ వృత్తిపరంగా వైదుల్యుగా మొదలై ప్రజాప్రతినిధులుగా ముందుకు వచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మాదాసి వెంకయ్యకు పేదల వైద్యునిగా పేరుంది. ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలందిస్తూ మంచి పేరు సంపాదించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాల వీరాంజనేయస్వామి వైద్యునిగా పనిచేస్తూ రాజీనామా చేసి దామచర్ల కుటుంబం అండదండలతో రాజకీయాల్లోకి వచ్చారు. పేదలకు వైద్య సేవల్లో ప్రత్యేక గుర్తింపు ♦ డాక్టర్ వెంకయ్యకు పేదల వైద్యునిగా ప్రజలకు సుపరిచితుడు ♦ కేవలం రూ.20 ఓపీతో వైద్య సేవలందిస్తున్నారు. ♦ జిల్లాలో వేల ఆపరేషన్లు చేసి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు ♦ సాయం కోసం ఎప్పుడూ తలుపు తట్టినా సాయం చేసే మనస్తత్వం ♦ మృధు స్వభావి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్తత్వం వెంకయ్యది ♦ సాదాసీదాగా ఉంటూ అందరినీ కలుపుకూ పోతారు. ♦ స్థానిక సమస్యలపై మంచి అవగాహన ♦ ప్రజలకు మరింత సేవ చేయాలనే రాజకీయాల్లోకి.. బాల వీరాంజనేయస్వామి.. పర్సంటేజీల వసూళ్లలో గుర్తింపు ♦ ప్రజల కోసం కన్నా తన సొంత మనుషులకే అధిక ప్రాధాన్యం ♦ పర్సంటేజీలు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇస్తారన్న అపవాదు ♦ సొంత రాజకీయ నేపథ్యం లేకపోవడం.. దామచర్ల కుటుంబంపై ఆధారపడటం ♦ పార్టీ నాయకులను విస్మరించడంతో తీవ్రమైన అసంతృప్తి ♦ ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా స్థానిక సమస్యలపై అవగాహన లేకపోవడం ♦ సమస్యలపై వేగంగా స్పందించకపోవడం.. ♦ వర్గపోరును ప్రోత్సహించే నైజం -
తాగు, సాగునీటిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, కొండపి (ప్రకాశం): నియోజకవర్గంలో సాగు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు లేకపోవడంతో రైతుల ఇక్కట్లు చెప్పేవీ కావు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీటి ఇక్కట్లును తీరుస్తానని వైఎస్సార్సీపీ కొండపి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ వెంకయ్య అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత చేసే అభివృద్ధి పనులను సాక్షిలో ముచ్చటించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ జరిగిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని తెలిపారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో కరువు కాటాలతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వైద్యునిగా ప్రజలకు సుపరిచతం.. పేదల వైద్యునిగా నియోజకవర్గంలో నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. లాభపేక్షలేకుండా సేవా భావంతో వైద్య వృత్తిలో ముందుకు పోతున్నా. అదే తరహ రాజకీయాల్లో సైతం పాటిస్తా. అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవే పరామర్ధంగా ప్రజలకు సేవ చేస్తా. కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తా. వంద పడకల వైద్యశాల మంజూరుకు కృషి కొండపిలోని 30 పడకల వైద్యశాలలో రోగులకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదు. వైద్యాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత 30 పడకల వైద్యశాలను 100 పడకలుగా పదోన్నతి కల్పించి పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందేలా చూస్తా. అంతర్గత డ్రైనేజీ ఏర్పాటు చేస్తా.. నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో డ్రైనేజీ వ్యవస్థ లేదు. సైడు కాలువల నిర్మాణం సక్రమంగా లేదు. దీంతో వర్షం నీరు పారే వీల్లేక చిరు జల్లులకే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. బురద రోడ్లపై నడవాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో రోడ్లు తటాకాల్లా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తా. కొండపిలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణం చేయిచి ప్రజలకు మురుగు సమస్య పరిష్కారం చేయిస్తాం. ఓవీ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి.. ఓవీ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఎమ్మెల్యే స్వామి ఐదేళ్లలో రోడ్డు విస్తరణను పట్టించుకోలేదు. రోడ్డు విస్తరణ పనులు జరగ్గా తరుచూ వాహన ప్రమాదాలు జరిగి ఐదేళ్లలో 20 మందికి పైగా మృతి చెందారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. పొన్నలూరు మండలంలో ముత్తరాసుపాలెం నుంచి పరుచూరివారిపాలెం వరకు సుమారు 16 కిలోమీటర్ల ఓవీ రోడ్డు విస్తరణ పనులు చేయించి కొండపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని 50గ్రామాల పైగా ప్రజల ఇబ్బందులు తీరుస్తాం. చెక్‌డ్యాంల నిర్మాణంతో రైతులకు చేదోడు నియోజకవర్గ పరిధిలో అవసరమైన చోట మూసి, పాలేరుపై చెక్‌డ్యాంలు నిర్మిస్తా. వర్షాకాలంలో సముద్రం పాలయ్యే నీటిని ఆపి రైతుల వ్యవసాయ అవసరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. కొండపిలో అట్లేరు మీద ఆగిపోయిన చెక్‌డ్యాం పనులు సైతం పూర్తి చేసి 200 ఎకరాల భూములకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తాం.. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీటి తాగి వందల మంది మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మంది కిడ్నీ వ్యాధితో ప్రమాదపుటంచున ఉన్నారు. ప్రధానంగా మర్రిపూడి మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రజలకు మంచినీరు అందించటం ద్వారా కిడ్నీ వ్యాధులను దూరం చేయవచ్చు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయితే మంచినీటి సమస్య తీరుతుంది. గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయించి తాగునీరు అందిస్తాం. టీడీపీ పాలన మొత్తం దోపిడీమయం టీడీపీ హయాంలో పాలకులు ప్రకృతి వనరులను దోచుకున్నారు. ఇసుక, మట్టి ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. ముఖ్య నాయకులకు పర్సంటేజీలు కుదరక సంగమేశ్వరం పనులు నిలిచిపోయాయి. మండలానికి ఒకరిద్దరు చొప్పున కోటరి ఏర్పాటు చేసుకుని ప్రజల సొమ్మును స్వాహా చేశారు. సంగమేశ్వరం పూర్తితో రైతుకు ఊతం నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. ఐదేళ్లుగా చంద్రబాబు పాలనలో తీవ్ర వర్షాభావంతో కరువు విలయతాండవం చేస్తోంది. నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్ట్ లేకపోవడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ హయంలో పొన్నలూరు మండలంలో చెన్నిపాడు వద్ద పాలేరుపై సంగమేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించారు. అయితే టీడీపీ పాలనలో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఎమ్మెల్యే స్వామి ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తొలి ప్రాధన్యతగా సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేయించి రైతన్నలకు కానుకగా అందిస్తా. ప్రాజెక్టు పూర్తితే 9,500 ఎకరాలకు సాగునీరు, పొన్నలూరు, జరుగుమల్లి, మర్రిపూడి మండలాల్లోని సుమారు 15 గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుంది. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా. నియోజకవర్గంలో సాగు, తాగునీరు ప్రధాన సమస్యలు. కనీసం మూసికి సాగర్‌నీరు అందిస్తే మూసి ఒడ్డున ఉన్న గ్రామాల్లో సమస్యలు తీరుతాయి. అత్యంత ప్రధానమైన ఓవీ రోడ్డు ఇప్పటి వరకు వేయలేదు. అధికారంలోకి వస్తే రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాను. నియోజకవర్గానికి సాగునీటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – కాకి వీరచంద్ర ఖర ప్రసాద్, బీఎస్పీ అభ్యర్థి -
ఆపన్నులకు సాయంచేస్తూ...
పల్లెల్లో వైద్యం చేయాలంటే ఉత్సాహంగా ముందుకు ఉరికేవారెవరుంటారు చెప్పండి. ఒకవేళ పల్లెకి వెళ్లినా మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే డాక్టర్లు ఎంతమంది ఉంటారు? ఈ రెండు పనులూ చేయడం డాక్టర్ వెంకయ్య గొప్పతనం. ఇక పదేళ్లపాటు కళాకారిణిగా రాణించి ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ అందరి మన్ననలు అందుకున్న వ్యక్తి రాధా కె. ప్రశాంతి. ఒకరు మహిళల ఆరోగ్యానికి రక్షణగా నిలిచిన పురుషుడైతే, మరొకరు ఆపన్నులకు అండగా మారిన స్త్రీమూర్తి. గత 23 ఏళ్లనుంచి కేంద్ర మహిళా సంక్షేమశాఖవారు ఇస్తున్న ‘స్త్రీ శక్తి పురస్కార్’కు ఈ ఏడాది మన రాష్ర్టం నుంచి వీరిద్దరూ ఎంపికయ్యారు. డాక్టర్ వెంకయ్యకి ‘రాణిరుద్రమదేవి’ కేటగిరిలో, రాధా కె ప్రశాంతికి ‘కణ్ణగి’ కేటగిరిలో అవార్డులిచ్చి సత్కరించారు. మొన్నీమధ్యే కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లారు రాధా కె ప్రశాంతి. బాబా దర్శనం అయిపోయాక పిల్లలు సరదాగా అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తామంటే ఒంటెలున్న ప్రాంతానికి వెళ్లారు. పిల్లలు ఒంటెలు ఎక్కి ఆడుకుంటున్నారు. ప్రశాంతి మాత్రం ఆ ఒంటెలు నడిపేవారి గుడిసెల దగ్గరికి వెళ్లి వారి జీవనవిధానాలను గమనిస్తున్నారు. ఇంతలో ఒక గుడిసెలోనుంచి ఓ వృద్ధురాలి ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే మంచంపై పడుకుని ఏడుస్తున్న తల్లిని చూస్తూ ఓ నలభై ఏళ్ల వ్యక్తి నవ్వుతున్నాడు. ఆ వ్యక్తి మానసిక వికలాంగుడని చూడగానే ప్రశాంతికి అర్థమైంది. ఆ వృద్ధురాలు ప్రశాంతిని చూసి బయటికి వచ్చి భోరున విలపిస్తూ...ఒక్క వందరూపాయలుంటే ఇమ్మని అడిగింది. ఎందుకని అడక్కుండానే ‘ఇంత విషం కొనుక్కుని నేను తాగి, నా బిడ్డకు కూడా పోస్తానమ్మా...’అంటూ వేడుకుంది. ప్రశాంతి పది రూపాయలిచ్చి తప్పుకోలేదు. షిరిడిలో తనకు తెలిసిన పెద్దాయన్ని కలిసి ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించే ఏర్పాటు చేశారు. ఆ వృద్ధురాలి చేతిలో పదివేల రూపాయలు పెట్టి ప్రతి నెలా ఎంతోకొంత డబ్బు పంపిస్తానని చెప్పి చిరునామా వివరాలు తీసుకుని వచ్చారు. ‘గుడిలో కాదు...నాకు ఆ గుడిసెలో బాబా కనిపించాడని’ చెబుతున్న రాధా కె ప్రశాంతి ఇప్పటివరకూ ఇలాంటి సేవాకార్యక్రమాలు చాలా చేశారు. ఒక పక్క కళాకారిణిగా, మరో పక్క స్వచ్ఛంద సేవకురాలిగా అందరి మన్ననలూ అందుకుంటున్న ఆమె జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో. ఆంధ్రప్రదేశ్- ఒరిస్సా సరిహద్దులో గజపతి జిల్లా దగ్గర కాశీనగర్ ప్రశాంతి స్వస్థలం. తండ్రి వెంకయ్యనాయుడు వ్యాపారాలు చేసి బోలెడంత సంపాదించినా ఆయనకొచ్చిన బ్లడ్ క్యాన్సర్ ఆస్తినంతా మింగేసింది. అక్కడి నుంచి ప్రశాంతి కష్టాలు మొదలయ్యాయి. పొద్దుమొహం ఎరుగని తల్లి, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. అన్ని బాధ్యతల్ని తన భుజాన వేసుకుంది. తండ్రి మరణంతో తొమ్మిదో తరగతితోనే చదువాపేసిన ప్రశాంతి అప్పటికే పరిచయమున్న నాటకపరిషత్లను నమ్ముకుని ముందుకు సాగింది. ఒకసారి విశాఖపట్నంలో ప్రశాంతి భరతనాట్య ప్రదర్శనను చూసిన సినిమావాళ్లు ‘చూడ్డానికి అచ్చం రాధలా ఉంది’ అంటూ సినిమారంగంలోకి ఆహ్వానం పలికారు. ‘పరువు-ప్రతిష్ఠ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రశాంతి 1992 నుంచి 2000 వరకూ దాదాపు 100 సినిమాల్లో నటించారు. 500 నాటకాల్లో నటించి కళాకారిణిగా 200 బెస్ట్ పర్ఫార్మర్ అవార్డులు అందుకున్నారు. ‘స్టెప్’ పేరుతో... కష్టార్జితంతో కుటుంబాన్ని ఒడ్డుకి చేర్చిన ప్రశాంతి మనసు వెన్న. కష్టపడుతున్నవారు కంటపడగానే ఆమె కరిగిపోతుంది. ‘‘సినిమాల్లోకి వచ్చాక కాస్త చేయి తిరగడం మొదలైంది. ఖర్చులు పోను...మిగతా డబ్బుతో కనిపించిన పేదలకు కడుపునింపే పనిని మొదలుపెట్టాను. పేరు కోసం కాదు...నా తృప్తి కోసం. మా ఊళ్లో ‘పోతన్న’ దేవాలయం కట్టించాను. తర్వాత అక్కడి దళితులకు ఆర్థిక సాయం చేయడం, ఇక్కడ హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛందసంస్థలకు వెళుతూ వారికేదైనా ఆర్థిక సాయం చేయడం వంటి పనులు చేస్తుండేదాన్ని. నా పెళ్లయ్యాక 2000 సంవత్సరంలో పూర్తిగా సినిమాలకు దూరమైపోయాను. అప్పుడు ‘స్టెప్’(సొసైటీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎకనామికల్లీ పూర్)ని నెలకొల్పాను. ఈ సంస్థ పేరుతో కొన్ని స్వచ్ఛందసంస్థల్లో ఉన్న వృద్ధులకు కంటి ఆపరేషన్లు చేయించడం, అనాథపిల్లలకు భోజనం, దుస్తులకు డబ్బులు ఇవ్వడం వంటివి చేస్తున్నాను. గత ఏడాది ముగ్గురు పేదలకు గుండె ఆపరేషన్లు కూడా చేయించాను’’ అని చెప్పారు ప్రశాంతి. ఎల్లలు లేవు... ప్రశాంతి చేస్తున్న సేవలు ఫలానా ప్రాంతానికే అని పరిమితం కాలేదు. ఆ మధ్యన శ్రీకాకుళం జిల్లా బామిని దగ్గర ఒక పల్లెటూళ్లో పేదలు ఇల్లులేక ఇబ్బందిపడుతున్నారని తెలిసి ప్రశాంతి దానిపై దృష్టి పెట్టారు. ‘‘ నేను కొంత డబ్బు ఇచ్చి తెలిసినవారి దగ్గర కూడా కొంత విరాళాలు తీసుకుని వారికి ఇల్లు కట్టించి ఇచ్చాం. హైదరాబాద్‌లో ‘వేగేశ్న ఫౌండేషన్’ వాళ్లకి ఆర్థికసాయం చేయడంలో మా సంస్థ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఒకమాటలో చెప్పాలంటే స్పందించడం, సాయం చేయడం నాకు బాగా అలవాటైపోయిన విషయాలు’’ అని చెప్పే ప్రశాంతి తనకు స్త్రీశక్తి అవార్డు రావడాన్ని ప్రశంసకంటే బాధ్యతగా భావిస్తున్నారు. ‘స్టెప్’ సంస్థను మరింత విస్తరించి పేదపిల్లలకు, వృద్ధులకు మరిన్ని సేవల్ని అందించాలనుకుంటున్న ప్రశాంతి ఆలోచన, ఆశయం ఆదర్శప్రాయమే!