బాల వీరాంజనేయస్వామి, మాదాసి వెంకయ్య
సాక్షి, కొండపి (ప్రకాశం): ఎన్నికల్లో ముఖ్యమైన ప్రచార పర్వం ముగిసింది. ఓటరు తమకు నచ్చిన నేతను ఎన్నుకునే సమయం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల గుణగణాలపై ఓటర్లు చర్చించుకుంటున్నారు. కొండపిలో ప్రధాన ప్రత్యర్థులుగా ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇద్దరూ వృత్తిపరంగా వైదుల్యుగా మొదలై ప్రజాప్రతినిధులుగా ముందుకు వచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ మాదాసి వెంకయ్యకు పేదల వైద్యునిగా పేరుంది. ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలందిస్తూ మంచి పేరు సంపాదించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాల వీరాంజనేయస్వామి వైద్యునిగా పనిచేస్తూ రాజీనామా చేసి దామచర్ల కుటుంబం అండదండలతో రాజకీయాల్లోకి వచ్చారు.
పేదలకు వైద్య సేవల్లో ప్రత్యేక గుర్తింపు
♦ డాక్టర్ వెంకయ్యకు పేదల వైద్యునిగా ప్రజలకు సుపరిచితుడు
♦ కేవలం రూ.20 ఓపీతో వైద్య సేవలందిస్తున్నారు.
♦ జిల్లాలో వేల ఆపరేషన్లు చేసి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు
♦ సాయం కోసం ఎప్పుడూ తలుపు తట్టినా సాయం చేసే మనస్తత్వం
♦ మృధు స్వభావి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్తత్వం వెంకయ్యది
♦ సాదాసీదాగా ఉంటూ అందరినీ కలుపుకూ పోతారు.
♦ స్థానిక సమస్యలపై మంచి అవగాహన
♦ ప్రజలకు మరింత సేవ చేయాలనే రాజకీయాల్లోకి..
బాల వీరాంజనేయస్వామి.. పర్సంటేజీల వసూళ్లలో గుర్తింపు
♦ ప్రజల కోసం కన్నా తన సొంత మనుషులకే అధిక ప్రాధాన్యం
♦ పర్సంటేజీలు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇస్తారన్న అపవాదు
♦ సొంత రాజకీయ నేపథ్యం లేకపోవడం.. దామచర్ల కుటుంబంపై ఆధారపడటం
♦ పార్టీ నాయకులను విస్మరించడంతో తీవ్రమైన అసంతృప్తి
♦ ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా స్థానిక సమస్యలపై అవగాహన లేకపోవడం
♦ సమస్యలపై వేగంగా స్పందించకపోవడం..
♦ వర్గపోరును ప్రోత్సహించే నైజం
Comments
Please login to add a commentAdd a comment