doctor checkup
-
213 ఔషధాలతో సైడ్ ఎఫెక్ట్స్.. జాబితా ఇదే! తెలిసీతెలియక ప్రాణాల మీదకు
సాక్షి, హైదరాబాద్: కాస్త ఒళ్లు వెచ్చబడితే వెంటనే ఇంట్లో తెచ్చిపెట్టుకున్న పారాసిటమాల్ మాత్ర వేసుకుంటాం.. గొంతునొప్పి రాగానే మెడికల్ షాపుకెళ్లి అజిత్రోమైసిన్ అడుగుతాం.. ఒళ్లు నొప్పులకు ఐబూప్రోఫిన్ మాత్ర మింగేస్తాం.. ఇలా సాధారణ రోగాలకు మనలో చాలామంది వైద్యుడిని సంప్రదించకుండానే సొంత చికిత్స తీసుకుంటుంటారు. అయితే ఇది ప్రమాదకరమని, ఎలాంటి మందులనైనా డాక్టర్ సలహాతోనే వాడాలని ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ సూచించింది. ఇష్టారాజ్యంగా మందులను వేసుకుంటే శరీరంలో తీవ్రమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించింది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చని తెలిపింది. ముఖ్యంగా 213 ఔషధాల వాడకం వల్ల కొందరిలో ఈ తరహా సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చంటూ ఆ జాబితాను విడుదల చేసింది. పరిశోధనల తర్వాత.. వివిధ కంపెనీలు పరిశోధనలు, అనుమతులు పొందాక తయారుచేసి విక్రయించే మందులను రోగులు వాడాక కొందరిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించొచ్చు. దీనిపై అందే ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఈ విషయాన్ని ఫార్మకాలజీ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేస్తాయి. ఆయా సైడ్ ఎఫెక్ట్స్‌పై ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ పరిశోధనలు చేసింది. గుర్తించిన అదనపు సైడ్ఎఫెక్ట్స్ సమాచారాన్ని ప్రజలకు, డాక్టర్లకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు సిఫార్సు చేసింది. ఆ ప్రకారం కంపెనీలకు సమాచారమివ్వాలని కోరింది. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చర్యలు తీసుకురావాలని కోరింది. 2014 నుంచి 2020 వరకు సైడ్ ఎఫెక్ట్స్ వెలుగుచూసిన 213 రకాల మందుల జాబితాను ఇండియన్ ఫార్మకోఫియా కమిషన్ విడుదల చేసింది. వాటిల్లో కొన్నింటి వివరాలు.. ►పైపరాసిలిన్ కజోబ్యాక్టిమ్ ఇంజెక్షన్: తీవ్రమైన ఇన్ఫెక్షన్ కోసం వాడే యాంటిబయాటిక్ ఇది. దీనివల్ల కొందరిలో శ్వాస సమస్య, ఎముకల బలహీనత, పోటాషియం లోపం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. ►మ్యానిటాల్ ఇంజెక్షన్: తలకు దెబ్బ తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చి మెదడులో నీరు చేరినపుడు దీన్ని వాడతారు. దీనివల్ల పొటాషియం లోపం వంటి సైడ్ఎఫెక్ట్స్ రావొచ్చు. ►రేబిస్ వ్యాక్సిన్: దీనివల్ల ఒక్కోసారి శరీరం మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ►ర్యాంటిడిన్: సాధారణంగా ఎసిడిటీకి వాడ తారు. దీనివల్ల కొందరిలో సడన్‌గా గుండె ఆగి పోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా వైద్యుడి సలహా మేరకు మరేదైనా మందు వాడాలి. ►సెఫ్ట్రాక్జోమ్: దీన్ని సాధారణ జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు, విరేచనాలకు, చిన్నచిన్న గడ్డలకు కూడా వాడతారు. దీనివల్ల కొందరిలో శరీరమంతా రి యాక్షన్ రావొచ్చు. అది ఒక్కోసారి ప్రాణాంత కం కావొచ్చు. కొందరిలో చర్మం ఊడిపోతుంది. ►అజిత్రోమైసిన్: యాంటీబయోటిక్. జలుబుకు ఎక్కువగా వాడతారు. దీనివల్ల కొందరిలో శరీర మంతా చిన్నచిన్న చీము కురుపులు వస్తాయి. ►బ్రూఫెన్: దీన్ని మధ్యస్థాయి నొప్పులు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో శరీరమంతా రియాక్షన్ రావొచ్చు. చర్మం లేచిపోతుంది. ►అమాక్సిలిన్ క్లలానిక్ యాసిడ్ ట్యాబ్లెట్: జలుబు వంటి వాటికి వాడే యాంటీబయోటిక్ ఇది. కొందరిలో శరీరమంతా రియాక్షన్ రావొచ్చు. ►సిప్రోఫ్లాక్సిన్: దీన్ని తేలికపాటి చర్మ ఇన్ఫెక్షన్లకు, చీముగడ్డల తగ్గుదలకు వాడతారు. కొందరిలో శరీరమంతా రియాక్షన్ వచ్చే అవకాశముంది. ►యామ్‌లో డెఫిన్: బీపీని తగ్గించే మందు ఇది. దీన్ని వాడటం వల్ల కొందరిలో వెంట్రుకలు ఊడిపోతాయి. చిగుళ్లు పెరుగుతాయి. ►సెఫిక్జిమ్: యాంటీబయోటిక్. తేలికపాటి గొంతు, శ్వాసకోశ సమస్యలు, ఉదర ఇన్ఫెక్షన్లకు వా డతారు. కొందరికి నోట్లో అల్సర్లు ఏర్పడతాయి. ►ఓఫ్లాక్సిన్: విరేచనాలు తగ్గేందుకు వాడతారు. కొందరిలో శరీరమంతా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొందరిలో ప్రాణాంతకమైన రియాక్షన్లు రావొచ్చు. ►ట్రెమడాల్: నొప్పి తగ్గేందుకు వాడే మాత్ర. దీనివల్ల కొందరిలో వెక్కిళ్లు వస్తాయి. ఒక్కోసారి మూత్రం ఆగిపోవచ్చు. ►గ్లిబెంక్లమైడ్: షుగర్ తగ్గించేందుకు వాడతారు. దీన్ని వల్ల కొందరిలో గుండెదడ వస్తుంది. ►ప్యాంటొప్రజోల్: దీన్ని ఎసిడిటీకి వాడతారు. దీన్ని వాడటం వల్ల కొందరిలో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ►జింక్: బలానికి వాడే ఈ టాబ్లెట్ వల్ల కొందరిలో విరేచనాలు రావొచ్చు. ►పారాసిటమాల్: జ్వరానికి వాడతారు. దీనివల్ల కొందరిలో చర్మంపై చిన్నచిన్న కురుపులు వస్తాయి. ►లోసార్టాన్: బీపీని తగ్గించే ఈ మందు వాడకం వల్ల కొందరిలో కండరాలు పట్టుకుంటాయి. అతిగా పనిచేస్తే ఎలా నొప్పులు వస్తాయో దీనివల్ల అలాగే జరుగుతుంది. ►రెమిడిసివీర్: కరోనా, ఎబోలా వైరస్ కట్టడికి వాడతారు. దీనివల్ల కొందరిలో గుండె వేగం తగ్గుతుంది. ►ఎటినెలాల్: బీపీ తగ్గించే మందు. దీన్ని వాడటం వల్ల కొందరిలో చర్మానికి ఇన్ఫెక్షన్ వస్తుంది. ►యాంబ్రాక్సాల్: దగ్గు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో కన్నీళ్లు వస్తాయి. ►డెకడ్రాన్: ఆస్తమాలో, ఇన్ఫెక్షన్లకు వాడతారు. దీనివల్ల కొందరిలో వెక్కిళ్లు వస్తాయి. ►అమాక్సిలిన్: తేలికపాటి యాంటీబయోటిక్ ఇది. దీనివల్ల కొందరిలో కళ్లమంటలాంటిది వస్తుంది. ►ఎమిట్రిప్లిన్: తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌కు వాడతారు. దీర్ఘకాలిక నొప్పులకు ఉపయోగిస్తారు. దీనివల్ల కొందరిలో చిగుళ్ల రంగు మారుతుంది. ►సెఫ్ట్రాజోమ్: ఆసుపత్రుల్లో చేరినవారికి సర్జరీకి ముందు వాడే యాంటీబయోటిక్. దీనివల్ల కొందరిలో గుండెదడ వస్తుంది. ►టెల్మాసార్టాన్: బీపీకి వాడతారు. దీంతో కొందరిలో చర్మ సంబంధ రియాక్షన్లు వస్తాయి. కొందరిలో ముఖం నల్లబడుతుంది. ►అటర్వస్టాటిన్: దీన్ని చెడు కొవ్వు తగ్గించేందుకు వాడతారు. దీనివల్ల కొందరిలో విటమిన్–డి కొరత ఏర్పడుతుంది. -
పోలీసుల వద్దకే ఆరోగ్య భద్రత
సాక్షి, సిటీబ్యూరో: శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ల పరిధిలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించినా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించిన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రతి పోలీసు స్టేషన్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీపీ ఆదేశాల ప్రకారం సైబరాబాద్ పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ఆస్పత్రుల వైద్యులను సమన్వయం చేసి ప్రతి బుధవారం కొన్ని ఠాణాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలానగర్, మాదాపూర్, రాయదుర్గం, ఆర్సీపురం, శంషాబాద్ పోలీస్ స్టేషన్లలో యశోధ, కేర్ హైటెక్ సిటీ, మ్యాక్స్ క్యూర్, కాంటినెంటల్, సిటిజన్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ, 2డీ ఎకోటెస్టులు, కార్డియో, ఆర్థో, జనరల్ మెడిసిన్ డాక్టర్లతో కన్సల్టేషన్ నిర్వహించారు. దీంతో పాటు ఎఫ్ఎంస్ డెంటల్, డాక్టర్ ఐ అగర్వాల్, మెక్సివిజన్ వారిచే దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది పని చేసే స్థలంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేయించుకునేందుకు అవకాశం ఉంది. వచ్చే బుధవారం మిగతా పోలీస్ స్టేషన్లో కూడా వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రజల వద్దకే పాలనలా, సిబ్బంది పనిచేసే చోటే ఆరోగ్య పరీక్షలు ఏర్పాటు చేసి నూతన ఒరవడికి నాంధి పలికిన సైబరాబాద్ సీపీకి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శిబిరాల్లో సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, అడిషనల్ డీసీపీ సైబరాబాద్ పర్యవేక్షణలో పోలీస్ డాక్టర్లు సరిత, సుకుమార్ పాల్గొన్నారు. సీఏఆర్ అడిషనల్ డీసీపీ మణిక్ రాజ్, డాక్టర్లు సరిత, సుకుమార్, సంబంధిత ఇన్స్పెక్టర్లకు పోలీస్ అధికారుల సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు చార్మినార్: విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. బుధవారం పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా ఎంతో అవసరమన్నారు. పోలీసు విభాగంలో పని చేస్తున్న అన్ని స్థాయిల్లోని సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ మురళీకృష్ణతో పాటు అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ నారాయణ్ రావు, డాక్టర్ హరినాథ్, డాక్టర్ ప్రశాంత్ గుప్తా, డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లోని పెట్రోలింగ్ వాహనాల ఫిట్నెస్ తదితర అంశాలను పరిశీలించి వాహనాల పనితీరు పట్ల సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. -
విజృంభిస్తున్న చికున్ గున్యా
తాడ్వాయి, న్యూస్‌లైన్: మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామంలో 20 మందికిపైగా చికున్ గున్యా సోకడంతో బాధితులు మం చం పట్టారు. వైద్యసిబ్బంది మాత్రం ఆ గ్రామంలోకి వెళ్లి రోగులను చూడకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థ ప డుతున్నారు. 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన కొం తమందికి చికున్ గున్యా సోకడంతో మోకాళ్లలో నొప్పు లు ప్రారంభమై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని పలు ప్రైవే టు ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడి వైద్యులు మందులను, ఇంజక్షన్లను ఇచ్చి పంపించారు. వైద్యులు మందులు ఇ చ్చినా ఫలితంలేదని, చికున్ గున్యాతో తీవ్ర ఇబ్బంది ప డుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో కొందరికి చికున్ గున్యా వచ్చిందని, వారికి నయం కాకపోగా మరో 20 మందికి చికున్ గున్యా బారిన పడ్డారని పేర్కొన్నారు. బాధితుల్లో గ్రామానికి చెందిన గాజె న ర్సింలు, గాజె మమత, నగేష్, కుర్రాల రాజవ్వ, కన్క వ్వ, కళావతి, బాల్లక్ష్మితోపాటు మరికొందరు ఉన్నా రు. గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద, డ్రైనేజీ ల వద్ద, మురుగు, చెత్త చెదారం చేరడంతోనే వ్యాధి సో కిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పంచాయతీ సి బ్బంది, పాలకవర్గం నిర్లక్ష్యంతోనే పారిశుధ్యం లోపించి వ్యాధులు ప్రబులుతున్నాయని వివరించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ చూపి బ్రహ్మాజీవాడి లో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందజేయాలని బాధితులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేతల దీక్షలు భగ్నం
మడకశిర, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులో చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా మడకశిరలో వైఎస్సార్సీపీ కన్వీనర్ చౌడారెడ్డి, నాయకులు వన్నూరక్కసోమనాథ్, హనుమంతరాయ నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను గురువారం స్థానిక పోలీసులు భగ్నంచేశారు. ఉదయం 11గంటలకు దీక్ష చేస్తున్న వారికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ సతీష్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, వారికి తక్షణ వైద్యసహాయం అవసరమని సూచించారు. దీంతో సీఐ హరినాథ్ సిబ్బందితో దీక్ష శిబిరానికి చేరుకుని ముగ్గురినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర విభజనపై చేసిన ప్రకటనను ఉపసంహరించుకునే వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఈ సందర్నంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధనరెడ్డి తెలిపారు. సందీప్ రెడ్డి ఆసుపత్రికి తరలింపు గుంతకల్లు,గుంతకల్లు పట్టణంలో ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎంవీ సందీప్‌రెడ్డిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం పోలీసులు ప్రభుత్వ వైద్యునితో ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. రక్తపోటు తక్కువగా ఉందని, డీహైడ్రేషన్‌తో పాటు జాండిస్ కూడా సోకిందని వైద్యుడు నిర్ధారించడంతో వన్‌టౌన్ ఎస్ఐ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పోలీసులు ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించి సెలైన్ ఎక్కించారు. ఈ సందర్భంగా అడ్డుకున్న కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గోరంట్లలో దీక్షలు భగ్నం గోరంట్ల, : గోరంట్ల వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, గంగంపల్లి వెంకటరమణారెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను గురువారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న నాయకులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ గంపల వెంకటరమణారెడ్డి, గోరంట్ల సర్పంచ్ మంజుల, నాయకులు రఘురామిరెడ్డి, గిరిధరగౌడ్, ధనుంజయరెడ్డి, రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగంగా నాయకుడు మేదర శంకర్ తదితరులు వారికి మద్దతుగా దీక్షల్లో పాల్గొన్నారు.