'టీడీపీ నేతల అక్రమ ఇసుక రవాణా వల్లే విషాధం'
విజయవాడ : వీరులపాడు మండలం కొణతాలపల్లిలోని వైరా నదిలోపడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై వైఎస్ఆర్ సీపీ నేత డాక్టర్ జగన్మోహన్రావు స్పందించారు. టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు... ఆ క్రమంలో ఏర్పడిన ఇసుక గుంతల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలన్నారు. వైరా నదిలో పడి ఆదివారం ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులు శ్రీనివాసరావు, నాగేంద్రబాబు, అరుణ్కుమార్గా గుర్తించారు. వీరి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.