Domestic gas price
-
ఇలా ఎంత వరకు పెంచుకుంటూ పోతారో ముందే చెపితే..
ఇలా ఎంత వరకు పెంచుకుంటూ పోతారో ముందే చెపితే గ్యాస్‌కు ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటారట సార్! -
దీపావళికి ముందు సామాన్యులకు భారీ షాక్!
ఇప్పటికే పెరిగి పోతున్న పెట్రోల్, డీజిల్, వంటనూనె, ఉల్లిపాయ ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడే అవకాశం కనిపిస్తుంది. వచ్చేవారం వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ సారి అంతా.. ఇంతా కాదు ఏకంగా రూ.100 వరకు పెరగొచ్చని కొన్ని వర్గాలు సామాన్య ప్రజానీకాన్ని భయపెడుతున్నాయి. నష్టాలను తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని.. కేంద్రం అనుమతిస్తే ధరల పెంపు ఉండే అవకాశం ఉంది అని సమాచారం. అదే జరిగితే అన్ని కేటగిరీల్లో వంట గ్యాస్ రేట్లు పెరగడం ఇది ఐదవ సారి. అక్టోబర్ 6న 14 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 15 రూపాయలు పెంచడంతో హైదరాబాద్ లో వంట గ్యాస్ ఎల్పీజీ ధర రూ.950కి చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 300 రూపాయలు పెరిగింది. కేవలం జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 14.2 కిలోల సిలిండర్‌పై రూ.90కి పెరిగింది. ఎల్పీజీపై గత ఏడాది నుంచి కేంద్రం రాయితీలను ఎత్తివేసింది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో, ధరలు పెరుగుదలకు అమ్మకాలకు మధ్య ఉన్న అంతరాన్ని భరించేందుకు కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. (చదవండి: మార్కెట్లోకి శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆటో.. ధర ఎంతో తెలుసా?) అంతర్జాతీయ ఇంధన ధరలు గరిష్టా స్థాయికి పెరగడంతో ఎల్పీజీ అమ్మకాలపై నష్టాలు సిలిండర్‌కు రూ.100కు పైగా పెరిగినట్లు వారు తెలిపారు. సౌదీ ఎల్పీజీ రేట్లు ఈ నెలలో టన్నుకు 60 శాతం పెరిగి 800 డాలర్లకు చేరుకోగా, అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు 85.42 అమెరికన్ డాలర్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాయితీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించకపోవడంతో చమరు కంపెనీలు ఆ భారాన్ని మేయలని పేర్కొంటున్నాయి. లేకపోతే, ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్దం అవుతున్నాయి. గతంలో సిలిండర్‌పై కేంద్రం మూడొందల వరకు రాయితీ ఇవ్వగా.. ఇప్పుడు నామమాత్రంగా ఇస్తూ సరిపెడుతోంది. దాంతో, ఇంట్లో గ్యాస్ ముట్టించాలంటేనే మహిళలకు ముచ్చెమటలు పడుతున్నాయి. -
మరో వడ్డన.. భారీగా పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధరలు
CNG Gas Price Increased : పెట్రోలు, డీజిల్, ఎల్పీజీల ధరలు పెంచుకుంటూ పోయిన కేంద్రం తాజాగా మరో షాక్ ఇచ్చింది. సీఎన్జీ గ్యాస్ ధరలను ఒకే సారి 62 శాతం పెంచింది. పెరిగిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. యూనిట్‌కి 2.90 డాలర్ల పెంపు దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. దీంతో అక్టోబర్ 1 నుంచీ ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు (ఎంఎంబీటీయూ) 2.90 డాలర్ల వరకు ధర పెరగనుంది. 10 శాతం వరకు దీనివల్ల సీఎన్సీ, పీఎన్జీ ధరలు ప్రత్యేకించి ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో 10 నుంచి 11 శాతం పెరగవచ్చన్నది పరిశ్రమ అంచనా. అలాగే కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యుత్, ఎరువుల రంగాలపై కూడా ధరల భారం పడనుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ ఆరు నెలలు ఈ ధర అమల్లో ఉంటుంది. గత రెండేళ్లలో ఈ ధర పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన భారం కేంద్రం నిర్ణయం వల్ల సీఎన్జీ (ఆటోమొబైల్‌లో వినియోగించే), పీఎన్జీ (పైప్ ద్వారా వంట గ్యాస్) ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓవైపు వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెబుతూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి తరుణంలో కాలుష్య రహిత వాహనాలుగా పేరొందిన సీఎన్జీ వాహనాలకు తాజా నిర్ణయం షాక్ ఇస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరల తరహాలోనే సీఎన్జీ ధరలు పెడగంతో ఢిల్లీ వంటి నగరాల్లో సీఎన్జీ వినియోగదారులపై అధిక భారం పడనుంది. వారికే లాభం కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్ వంటి ఉత్పత్తిదారులకు ఆదాయాలను పెంచనుండడం గమనార్హం. కాగా డీప్సీ వంటి క్లిష్ట క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన ధరను ఎంఎంబీటీయూకు ప్రస్తుత 3.62 డాలర్ల నుంచి 6.13 డాలర్లకు పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
సహజవాయువు ధర 18% కట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరలో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఒక్కో యూనిట్ రేటును 18 శాతం తగ్గించడం ద్వారా 3.82 డాలర్లకు చేర్చాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. దేశీ గ్యాస్ ధరల్లో ఇదే అతిపెద్ద కోత కావడం గమనార్హం. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ వంటి గ్యాస్ ఉత్పత్తిదారుల లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా రాయల్టీ, పన్నులు ఇతరత్రా రూపంలో లభించే ఆదాయంలో రూ.800 కోట్ల మేర నష్టం(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలానికి) వస్తుందని అంచనా. మరోపక్క, రాష్ట్రాలకు కూడా గ్యాస్ విక్రయాలపై వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయంలో దాదాపు రూ.250 కోట్లు తగ్గేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి. అయితే, విద్యుత్, ఎరువుల రంగానికి చెందిన గ్యాస్ వినియోగ కంపెనీలకు రేటు తగ్గింపు వల్ల భారీగా ప్రయోజనం లభించనుంది. ఆరు నెలల కాలానికి..: మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధర నిర్ణయానికి గతేడాది అక్టోబర్‌లో కొత్త విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం స్థూల కెలోరిఫిక్ విలువ(జీసీవీ) ఆధారంగా ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) రేటు ఇప్పుడున్న 4.66 డాలర్ల నుంచి 3.82 డాలర్లకు తగ్గనుంది. అదేవిధంగా నికర కెలోరిఫిక్ విలువ(ఎన్సీవీ) ప్రకారం యూనిట్ ధర ప్రస్తుత 5.18 డాలర్ల నుంచి 4.24 డాలర్లకు దిగొస్తుంది. ఈ కొత్త రేట్లు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ, అంటే ఆరు నెలలపాటు అమల్లో ఉంటాయి. కాగా తాజా నిర్ణయం వల్ల ఓఎన్జీసీ నికర లాభాల్లో రూ.1,059 కోట్ల మేర తగ్గుతాయని సమాచారం.