domestic growth rate
-
వృద్ధికి ఊతం.. ప్రైవేటు వినియోగం
ముంబై: దేశీయ వృద్ధికి ప్రైవేటు వినియోగం ఊతం ఇస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. ఆయా అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) గ్రామీణాభివృద్ధి, తయారీ రంగాల పునరుద్ధరణకు ఊతం ఇస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్బీఐ అభిప్రాయాలగా పరిగణించకూడని ఈ ఆర్టికల్ ‘‘ప్రస్తుత ఎకానమీ పరిస్థితి’’ పేరుతో సెంట్రల్ బ్యాంక్ బులిటెన్లో ప్రచురితమైంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. నివేదిక పేర్కొన్న మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! ► అంతర్జాతీయ మందగమనం, అధిక ద్రవ్యోల్బణం తీవ్రత తగ్గాయి. బ్యాంకింగ్ నియంత్రణ, పర్యవేక్షణల్లో మెరుగుదల నమోదయ్యింది. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి కొంత తగ్గింది. ► ఇక దేశీయంగా చూస్తే 2023 మే తొలి భాగంలో ఆర్థిక సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. రెవెన్యూ వసూళ్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం తగ్గుదల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ► ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్ 5 శాతం దిగువకు వచ్చింది. కార్పొరేట్ ఆదాయాలు ఆదాయాలకు మించి నమోదయ్యాయి. ► బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు కూడా ఆదాయాల విషయంలో మంచి పనితీరును కనబరిచాయి. రుణ వృద్ధి పెరిగింది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
జీడీపీ 8% పైనే: పనగారియా
న్యూఢిల్లీ: మంచి వర్షాలు, సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వం సమయానుకూల నిర్ణయాలు ఇవన్నీ కలసి దేశీయ వృద్ధి రేటును తదుపరి త్రైమాసికాల్లో 8 శాతం పైకి తీసుకెళుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన త్రైమాసికాల్లో జీడీపీ 8 శాతంపైనే ఉంటుందనే విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సంస్కరణల ప్రభావం ఇంకా మనం చూడలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో పాలనాపరమైన సీరియస్ అంశాలు ఎన్నో ఉండేవన్నారు. ప్రాజెక్టులు నిలిచిపోయాయని, కేంద్రంలో నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దేశీయ జీడీపీ రేటు ఆరు త్రైమాసికాల కనిష్ట రేటు అయిన 7.1 శాతానికి పడిపోవడం వెనుక మైనింగ్, నిర్మాణ రంగాల్లో స్తబ్దతే కారణంగా పనగరియా పేర్కొన్నారు. ఈ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 7.5 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. 7.1 శాతం నిరుత్సాహపరిచేదేనని, తన అంచనాల కంటే తక్కువగానే ఉందని పనగిరియా అన్నారు. అయితే, మొదటి త్రైమాసికంలో రేటుపై వర్షాల ప్రభావం లేదన్నారు. ఖరీఫ్ సీజన్లో వర్షాల జోరుతో దేశీయంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 9 శాతం పెరిగి ఆల్టైమ్ గరిష్ట స్థాయి అయిన 135 మిలియన్ టన్నులకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి 124 టన్నులుగానే ఉంది.