domestic sales
-
మరోసారి మారుతీ రికార్డు సృష్టించింది!
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి రికార్డు సృష్టించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విక్రయాల జోరును కొనసాగించింది. ఏప్రిల్ నెలలో కంపెనీ దేశీయ విక్రయాలు 23 శాతం కంటే పెరిగి, 1,44,081 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కారు దిగ్గజానికి ఇది మరో కొత్త రికార్డు. వ్యాన్స్ మినహా మిగతా అన్ని సెగ్మెంట్ వెహికిల్స్ లలో మారుతీకి రెండకెల వృద్ధి నమోదైంది. మినీ సెగ్మెంట్ (ఆల్టో, వాగన్ ఆర్) 22 శాతం పెరిగింది. కాంపాక్ట్ సెగ్మెంట్(సిఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్) వాహనాల్లో కూడా వాల్యుమ్ లో 39 శాతం పైగా మారుతీ ఎగిసింది. గత నెలలో యుటిలిటీ వాహనాల విక్రయాలు కూడా 28 శాతం కంటే పైగా పెరిగినట్టు కంపెనీ చెప్పింది. ఎగుమతులతో కలిపితే మొత్తంగా కంపెనీ వాల్యుమ్ ఏప్రిల్ లో 19.5 శాతం పెరిగి, 1,51,215 వాహనాలు విక్రమైనట్టు తెలిసింది. అయితే గత నెలలో కంపెనీ ఎగుమతులు వాల్యుమ్ 29 శాతం క్షీణించి కేవలం 6,723 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి. -
జూలైలో 17 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయ కార్ల విక్రయాలు గత నెలలో 17 శాతం పెరిగాయని, గత మూడు నెలల్లో ఇదే అధికమని సియాం వెల్లడించింది. మారుత సుజుకీ అమ్మకాలు 26 శాతం, హోండా అమ్మకాలు 43 శాతం వృద్ధి చెందడం ఈ జోరుకు ఒక కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) పేర్కొంది. అయితే గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటంతో మోటార్ సైకిళ్ల విక్రయాలు 6 శాతం, తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు4 శాతం చొప్పున క్షీణించాయని వివరించింది. వర్షాలు సరిగ్గా కురిస్తే గ్రామీణ మార్కెట్లు కోలుకుంటాయని, మోటార్ బైక్‌ల విక్రయాలు పుంజుకుంటాయని అంచనా వేస్తోంది. ఎగుమతులు 7 శాతం పెరిగాయని తెలిపింది. -
వాహన విక్రయాలకు ఎక్సైజ్ దెబ్బ
* జనవరి గణాంకాలు విడుదల... * బడ్జెట్‌పై కంపెనీల ఆశలు న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది జనవరిలో మిశ్రమంగా ఉన్నాయి. కంపెనీలు ధరలను పెంచడం, ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించడం వంటి అంశాలు మొత్తం విక్రయాల(దేశీయ విక్రయాలు, ఎగుమతులు)పై ప్రభావం చూపాయి. అయితే ధరలు పెరిగినప్పటికీ, ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించినప్పటికీ దేశీయ విక్రయాలు పుంజుకున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హోండా కార్స్, అశోక్ లేలాండ్, యమహా, టీవీఎస్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల అమ్మకాలు పెరిగాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, జనరల్ మోటార్స్, ఫోర్డ్, బజాజ్ ఆటో విక్రయాలు మాత్రం తగ్గాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఎక్సైజ్ సుంకం రాయితీల తొలగింపు డిమాండ్‌పై ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. అధికంగా ఉన్న వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా అమ్మకాలపై ప్రభావం చూపాయని ఆ వర్గాలు వెల్లడించాయి. వడ్డీరేట్లు మరింత తగ్గించాలని, పన్నులను హేతుబద్ధీకరించాలని, ఇలా చేస్తే మొదటిసారిగా కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని హ్యుందాయ్ రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. రానున్న బడ్జెట్లో వినియోగదారులకు ప్రయోజనకరమైన, పరిశ్రమకు అనుకూలమైన సంస్కరణలు ప్రభుత్వం తెస్తుందన్న ఆశాభావాన్ని ఫోర్డ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మెహరోత్ర చెప్పారు.