జూలైలో 17 శాతం పెరిగిన కార్ల విక్రయాలు | In July, car sales increased by 17 per cent | Sakshi
Sakshi News home page

జూలైలో 17 శాతం పెరిగిన కార్ల విక్రయాలు

Published Tue, Aug 11 2015 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

In July, car sales increased by 17 per cent

న్యూఢిల్లీ: దేశీయ కార్ల విక్రయాలు గత నెలలో 17 శాతం పెరిగాయని, గత మూడు నెలల్లో ఇదే అధికమని సియాం వెల్లడించింది. మారుత సుజుకీ అమ్మకాలు 26 శాతం, హోండా అమ్మకాలు 43 శాతం వృద్ధి చెందడం ఈ జోరుకు ఒక కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) పేర్కొంది. అయితే గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటంతో మోటార్  సైకిళ్ల విక్రయాలు 6 శాతం,  తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు4 శాతం చొప్పున క్షీణించాయని వివరించింది. వర్షాలు సరిగ్గా కురిస్తే గ్రామీణ మార్కెట్లు కోలుకుంటాయని, మోటార్ బైక్‌ల విక్రయాలు పుంజుకుంటాయని  అంచనా వేస్తోంది. ఎగుమతులు 7 శాతం పెరిగాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement