Maruti Suzuki sales
-
మారుతి బంపర్ ఆఫర్, ఏ కారు ఎంత డిస్కౌంట్ లో వస్తుందో తెలుసా?
మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మారుతీ సుజుకీ ఇండియా కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. అరీనా, నెక్సా డీలర్ షిప్లలో మారుతి వాహనాలపై క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ తో పాటు కార్పొరేట్ బెన్ ఫిట్స్ ను ఈ నెల చివరి వరకు సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడమే కాదు భారీ ఆఫర్లు ప్రకటించి ఆటో మొబైల్ ఇండస్ట్రీలో తమకు సాటెవ్వరూ లేరని నిరూపిస్తుంది. తాజాగా మారుతీ తన కంపెనీ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం? మారుతి సుజుకి ఆల్టో 800 మారుతి సుజికీ ఆల్టో 800పై ప్రస్తుత ప్రారంభ ధర రూ.2.99లక్షలు ఉండగా.. ఆ ధరపై (డిస్కౌంట్ వర్త్) క్యాష్ డిస్కౌంట్ తో కలిపి రూ.43,000వరకు తగ్గించనుంది. మారుతి సుజుకి ఎస్ - ప్రెస్సో మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.78 లక్షలు ఉండగా రూ. 48,000 వరకు బెన్ఫిషియల్ ఆఫర్ను అందిస్తుంది మారుతి సుజికి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.5.81లక్షలు ఉండగా.. ఆ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్ను కలుపుకొని రూ.49,000 వరకు డిస్కౌంట్ను అందిస్తుంది మారుతి సుజికి ఎస్ క్రాస్ మారుతి సుజికీ ఎస్ క్రాస్ కారు ప్రారంభ ధర రూ.8.39లక్షలు ఉండగా ఆ కారుపై పర్చేస్ బెన్ఫిటిక్స్ కింద రూ.57,500వరకు డిస్కౌంట్ పొందవచ్చు. -
కేంద్రమే ఏదో ఒకటి చేయాలి, కార్ల ధరలపై మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: కార్ల కొనుగోలు వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ తగ్గుతున్నట్టు మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్లో కార్లపై గరిష్ట స్థాయిలోని జీఎస్టీ, తదితర కారణాలను ఆయన ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాలు ఈ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోతే పరిశ్రమ సరైన వృద్ధిని చూడలేదని అభిప్రాయపడ్డారు. మారుతి సుజుకీ వార్షిక నివేదికలో వాటాదారులకు ఆయన తన సందేశం ఇచ్చారు. ‘‘కార్లపై జీఎస్టీ అంతకుముందు ఎక్సైజ్ సుంకం ఆధారంగా ఉంది. ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే జీఎస్టీ ఎంతో ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు తగ్గించేందుకు ముందుకు రాకపోతే చక్కని వృద్ధి సాధ్యపడదు’’ అని ఆయన వివరించారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరోనా మహమ్మారి గణనీయమైన ప్రభావం చూపిందంటూ.. వచ్చే మూడు త్రైమాసికాల్లో పనితీరు అన్నది ప్రధానంగా ప్రజలు తీసుకునే వ్యాక్సిన్లు, రక్షణ చర్యలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ‘‘ఈ ఏడాది మార్చిలో 2021–22 ఆర్థిక సంవత్సరంపై ఎంతో ఆశావహంగా ఉన్నాం. కరోనా మహమ్మారి ఒక్కసారిగా తీవ్రంగా విరుచుకుపడడం అందరినీ ఆశ్చర్యపరించింది. ఇది దేశవ్యాప్తంగా లాక్డౌన్లు, ఆంక్షలకు దారితీసింది. దీంతో ఉత్పత్తి, విక్రయాలు పడిపోయాయి. అంతకుముందు త్రైమాసికంలో కోలుకున్న డిమాండ్ మళ్లీ పడిపోయింది. దీంతో క్యూ1లో విక్రయాలు 3,53,600 యూనిట్లకే పరిమితమయ్యాయి’’ అని భార్గవ పేర్కొన్నారు. వైరస్ ప్రభావంపైనే భవిష్యత్తు విక్రయాలు ఆధారపడి ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ విస్తృత ప్రాతిపదికన జరగాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ దిశలో తగిన చర్యలు అవసరమన్నారు. -
జూలైలో 17 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయ కార్ల విక్రయాలు గత నెలలో 17 శాతం పెరిగాయని, గత మూడు నెలల్లో ఇదే అధికమని సియాం వెల్లడించింది. మారుత సుజుకీ అమ్మకాలు 26 శాతం, హోండా అమ్మకాలు 43 శాతం వృద్ధి చెందడం ఈ జోరుకు ఒక కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) పేర్కొంది. అయితే గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటంతో మోటార్ సైకిళ్ల విక్రయాలు 6 శాతం, తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు4 శాతం చొప్పున క్షీణించాయని వివరించింది. వర్షాలు సరిగ్గా కురిస్తే గ్రామీణ మార్కెట్లు కోలుకుంటాయని, మోటార్ బైక్ల విక్రయాలు పుంజుకుంటాయని అంచనా వేస్తోంది. ఎగుమతులు 7 శాతం పెరిగాయని తెలిపింది.