మరోసారి మారుతీ రికార్డు సృష్టించింది!
మరోసారి మారుతీ రికార్డు సృష్టించింది!
Published Mon, May 1 2017 3:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి రికార్డు సృష్టించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విక్రయాల జోరును కొనసాగించింది. ఏప్రిల్ నెలలో కంపెనీ దేశీయ విక్రయాలు 23 శాతం కంటే పెరిగి, 1,44,081 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కారు దిగ్గజానికి ఇది మరో కొత్త రికార్డు. వ్యాన్స్ మినహా మిగతా అన్ని సెగ్మెంట్ వెహికిల్స్ లలో మారుతీకి రెండకెల వృద్ధి నమోదైంది. మినీ సెగ్మెంట్ (ఆల్టో, వాగన్ ఆర్) 22 శాతం పెరిగింది.
కాంపాక్ట్ సెగ్మెంట్(సిఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్) వాహనాల్లో కూడా వాల్యుమ్ లో 39 శాతం పైగా మారుతీ ఎగిసింది. గత నెలలో యుటిలిటీ వాహనాల విక్రయాలు కూడా 28 శాతం కంటే పైగా పెరిగినట్టు కంపెనీ చెప్పింది. ఎగుమతులతో కలిపితే మొత్తంగా కంపెనీ వాల్యుమ్ ఏప్రిల్ లో 19.5 శాతం పెరిగి, 1,51,215 వాహనాలు విక్రమైనట్టు తెలిసింది. అయితే గత నెలలో కంపెనీ ఎగుమతులు వాల్యుమ్ 29 శాతం క్షీణించి కేవలం 6,723 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి.
Advertisement
Advertisement