doordarshan interview
-
మోడీ డీడీ ఇంటర్వ్యూపై దుమారం
* బీజేపీ నేత పచ్చి అబద్ధాలాడుతున్నారన్న అహ్మద్ పటేల్ * ఇంటర్వ్యూకు కోతపై విచారణకు బీజేపీ డిమాండ్ న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దూరదర్శన్కిచ్చిన ఇంటర్వ్యూపై వివాదం మరింత ముదిరింది. మోడీ వ్యాఖ్యలు ఆధార రహితం, పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ చీఫ్ సోనియూగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ శుక్రవారం నాడిక్కడ పేర్కొన్నారు.తమ మధ్య సాన్నిహిత్యం ఉంద న్న మోడీ వ్యాఖ్యలను పటేల్ ఖండించారు. ‘కాంగ్రెస్‌లో నాకున్న చాలా మంచి స్నేహితుల్లో అహ్మద్ భాయ్ ఒక రు. అరుుతే ఇప్పుడంతగా లేదు. ఆయనకేదో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. కనీసం నేను చేసే ఫోన్లకు కూడా స్పందించకుండా తప్పిం చుకుంటున్నారు..’ అని మోడీ దూరదర్శన్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పటేల్ మాత్రం ఇదంతా రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. ఎన్నికల నేపథ్యంలో అయోమయూన్ని, అనుమాన మేఘాలు సృష్టించేందుకు చేసిన వ్యాఖ్యలుగా పేర్కొన్నారు. గుజరాత్ సీఎం నుంచి తానేమైనా లబ్ధి పొందినట్టుగా ఏదైనా సాక్ష్యం ఉంటే ప్రజా జీవితం నుంచే తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను మోడీ కార్యాలయంలో కానీ, నివాసంలో కానీ ఎన్నడూ ఆయనతో భేటీ కాలేదని తేల్చిచెప్పారు. 80వ దశకంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మోడీ తన వద్దకు వస్తే తాను భోజనానికిఆహ్వానించేవాడినని తెలిపారు. మోడీ ఇంటర్వ్యూకు దూరదర్శన్ కత్తెర వేసిందనే ఆరోపణల నేపథ్యంలో అసలు వివా దం తలెత్తింది. ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఇలా జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రియూంక తన కుమార్తె లాంటిదని మోడీ ఇంటర్వ్యూలో అనలేదని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.ఎవరి జోక్యంతో ఇం టర్వ్యూకు కోత వేశారో విచారణ జరపాలన్నారు. ఈ ఆరోపణలను దూరదర్శన్, ప్రభుత్వం ఖండించాయి. -
'మోడీవన్నీ అబద్ధాలే.. ఆయన నా స్నేహితుడు కాదు'
బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన తనకెప్పుడూ స్నేహితుడు కాడని సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. తామిద్దరం తరచు కలిసేవారిమని, తామిద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉండేవని మోడీ చెప్పడం చాలా హాస్యాస్పదమని అన్నారు. మోడీ అలా చెప్పడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని, ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించడానికే ఆయనలా చేస్తున్నారని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి తాను ఏమైనా తీసుకున్నట్లు ఆయనవద్ద ఆధారాలుంటే నిర్భయంగా బయట పెట్టాలి తప్ప ఇలా చెప్పడం సరికాదని అన్నారు. తన సొంత పార్టీలోనే ఎవరితోనూ స్నేహంగా ఉండని మోడీ... తనతో స్నేహం చేయడం ఎలా సాధ్యమని అహ్మద్ పటేల్ ప్రశ్నించారు. మోడీని ఆయన ఇంట్లో గానీ, కార్యాలయంలో గానీ ఎప్పుడూ కలవలేదని, అలాగే ఆయన కూడా తనతో కలిసి ఎప్పుడూ భోజనం చేయలేదని స్పష్టం చేశారు. దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అహ్మద్ పటేల్, తాను మంచి స్నేహితులమని నరేంద్రమోడీ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనలా లేరని, బహుశా ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉండటంవల్లే తనను తప్పించుకుని తిరుగుతున్నారని మోడీ చెప్పారు. పటేల్‌ను తానెప్పుడూ అహ్మద్ భాయ్ అనలేదని, బాబూ భాయ్ అనేవాడినని అన్నారు. దాన్నే అహ్మద్ పటేల్ ఇప్పుడు నిర్ద్వంద్వంగా ఖండించారు.