doravari satram
-
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కార్పియో: ఇద్దరు మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కలకుంట జాతీయ రహదారిపై ఆదివారం ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆకాశం నుంచి పడిన వింత పరికరం
దొరవారిసత్రం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పాళెంపాడు గ్రామంలో సోమవారం ఆకాశం నుంచి ఒక వింత పరికరం పడింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు బాంబు పడిందంటూ పరుగులు తీశారు. దానిని పరిశీలించగా ఒక ఎలక్ట్రానిక్ పరికరానికి బెలూన్ కట్టి ఉంది. శ్రీహరికోటలోని షార్ అధికారులు వాతావర ణాన్ని పరిశీలించేందుకు ఆకాశంలోకి వదిలి ఉండవచ్చని కొందరు ఊహిస్తుండగా, ప్రాజెక్ట్ వర్క్ చేసే విద్యార్థులు వాతావరణ పరిశీలనకు ఆకాశంలో ప్రవేశపెట్టి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. -
'అండమాన్'ని నిలిపివేసిన అధికారులు
నెల్లూరు : జమ్మూ నుంచి చెన్నై వెళ్తున్న అండమాన్ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నెల్లూరు జిల్లా దొరవారిసత్రం రైల్వే స్టేష్టన్లో అధికారులు నిలిపివేశారు. తమిళనాడులోని కొరుగుపేట - తొండయార్‌పేట మధ్య రైల్వే ట్రాక్‌పైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు నిలిపేశారు. అలాగే చెన్నై నుంచి నెల్లూరు వచ్చే రైలును కూడా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రైళ్లు ఎక్కడికక్కడ నిలచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. -
ఆటో బోల్తా: ఏడుగురికి తీవ్ర గాయాలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం అక్కరపాక సమీపంలో శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు - లారీ ఢీ: ఇద్దరు మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారి సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం కారు - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద ఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని ... పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.