![ఆకాశం నుంచి పడిన వింత పరికరం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51463496922_625x300.jpg.webp?itok=imfWSE_7)
ఆకాశం నుంచి పడిన వింత పరికరం
దొరవారిసత్రం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పాళెంపాడు గ్రామంలో సోమవారం ఆకాశం నుంచి ఒక వింత పరికరం పడింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు బాంబు పడిందంటూ పరుగులు తీశారు. దానిని పరిశీలించగా ఒక ఎలక్ట్రానిక్ పరికరానికి బెలూన్ కట్టి ఉంది.
శ్రీహరికోటలోని షార్ అధికారులు వాతావర ణాన్ని పరిశీలించేందుకు ఆకాశంలోకి వదిలి ఉండవచ్చని కొందరు ఊహిస్తుండగా, ప్రాజెక్ట్ వర్క్ చేసే విద్యార్థులు వాతావరణ పరిశీలనకు ఆకాశంలో ప్రవేశపెట్టి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.