Down to Earth
-
70 శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు
న్యూఢిల్లీ: భారత్‌లోని 718 జిల్లాలకుగాను 500కుపైగా జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని డౌన్ టు ఎర్త్ అనే సంస్థ అంచనావేసింది. భారత్‌లో పర్యావరణ సంబంధ రాజకీయాలు, అభివృద్ధిపై ఈ సంస్థ పరిశోధన చేస్తోంది. భారత్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై డౌన్ టు ఎర్త్ సంస్థ ఒక నివేదిక విడుదలచేసింది. నివేదిక ప్రకారం.. ► 718 జిల్లాలకుగాను 500 జిల్లాల్లో అంటే 70శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ► ఈశాన్య భారతం, తూర్పుభారతంలో కొన్ని ప్రాంతాలు, జమ్మూ కశీ్మర్తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం సహా దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో మధ్యస్థ/తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ► ‘ఈసారి రుతుపవనకాలంలో ఆగస్టులో ప్రతి రోజూ కురవాల్సిన వర్షాలు ఆగి ఆగి కొద్దిరోజులు విరామాలు ఇస్తూ పడ్డాయి. ఇలా ‘బ్రేక్’లు ఇస్తూ పడిన వర్షాలే భారత్‌లో కరువుకు 70 శాతం కారణం’ అని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ చెప్పారు. ► 53 శాతం జిల్లాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు ఉన్నాయి. ► ఈ ఏడాది ఆగస్టులో ఎక్కువ రోజులు వర్షాలు పడనేలేదు. ఏడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పొడి వాతావరణం నెలకొంది. ఈనెలలో ఇన్ని రోజులపాటు వర్షాలు లేకపోవడం అనేది 21వ శతాబ్దిలో మూడో అతిపెద్ద విరామంగా రికార్డులకెక్కింది. గత 123 సంవత్సరాల చరిత్రలో ఆగస్టులో ఇంతటి పొడివాతావరణం నెలకొనడమూ ఇదే తొలిసారి. ► ‘2022 ఏడాదిలో పోలిస్తే 2023లో సాగు విస్తీర్ణం 33 శాతం పెరిగినా.. తగ్గిన వర్షాల కారణంగా దిగుబడి పెరుగుతుందో, తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి’ అని క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ పేర్కొంది. ► ప్రతిఏటా ‘సాధారణ వర్షపాతం’ కేటగిరీ కింద ఉండే దాదాపు 20 రాష్ట్రాల్లో ఈసారి సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం. ► 1971–2020 సుదీర్ఘకాలం నుంచి చూస్తే ఈసారి వర్షపాతంలో లోటు ఐదు శాతం కనిపిస్తోంది. -
మూడొంతుల మందికి మంచి తిండి కలే
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు మూడొంతుల మందికి ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పటికీ కలే. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం తదితరాలతో కూడిన సమతులాహారం సగటు భారతీయులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. అంతేగాక ఏటా 17 లక్షల మందికి పైగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తద్వారా వచ్చే క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. సెంటర్‌పర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు అర్త్ మేగజీన్ విడుదల చేసిన ‘గణాంకాల్లో భారత పర్యావరణ స్థితిగతులు: 2022’ నివేదిక ఈ మేరకు పేర్కొంది. ఆహార వ్యయం వ్యక్తిగత ఆదాయంలో 63 శాతాన్ని మించితే సదరు వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేనట్టేనని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. 20 ఏళ్లు, అంతకు మించిన వాళ్ల రోజువారీ ఆహారంలో కనీసం 200 గ్రాముల పండ్లు తప్పనిసరి. కానీ భారత్‌లో మాత్రం సగటున 35 గ్రాములకు మించి తినడం లేదట. అలాగే రోజుకు 300 గ్రాముల దాకా కూరగాయలు తీసుకోవాల్సి ఉండగా 168 గ్రాములతో సరిపెడుతున్నారు. కొంతకాలంగా పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తున్నా మొత్తమ్మీద చూస్తే అంత సానుకూలంగా లేదని నివేదిక పేర్కొంది. ‘‘ఆహార ధరలు నానాటికీ కొండెక్కుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం ఏడాదిలోనే ఏకంగా 327 శాతం పెరిగిపోయింది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చింది. -
‘అసలు కోహ్లి గురించి మీకేం తెలుసు?’
ముంబై: ఫీల్డ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని చూసిన వారంతా.. అతడికి చాలా కోపం అని.. ఎవరి మాట వినని వ్యక్తిగా అంచనా వేస్తుంటారు. ఫీల్డ్‌లో కోహ్లి బిహేవియర్ కూడా ఇలానే ఉంటుంది. దీని గురించి సోషల్ మీడియాలో నెటిజనులు రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. ఆఫ్‌ఫీల్డ్‌లో కూడా కోహ్లి ఇలానే ఉంటాడా.. ఇంత దూకుడుగా వ్యవహరిస్తాడా అంటే కాదు అంటారు అతడి గురించి బాగా తెలిసిన కొందరు ఆటగాళ్లు. ఫీల్డ్ బయట కోహ్లి ఎంతో ప్రశాంతంగా ఉంటాడట.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం తనది అంటారు. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్, సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి బయట ఎంతో వినయంగా ఉంటాడని తెలిపాడు. ఈ సందర్భంగా శరణ్‌దీప్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లిని చూస్తే.. ఎంతో దూకుడుగా కనిపిస్తాడు. కానీ ఆఫ్‌ఫీల్డ్‌లో కోహ్లి ఎంతో వినయంగా ఉంటాడు. తను మంచి శ్రోత. సెలక్షన్ మీటింగ్స్‌లో చాలా శ్రద్ధగా అందరూ చెప్పేది వింటాడు. గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో కోహ్లి అందరూ చెప్పేది శ్రద్ధగా విని.. ఆ తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు’’ అన్నాడు ‘‘ఇక ఇంట్లో కోహ్లి ప్రవర్తనని చూసిన వారు అస్సలు నమ్మలేరు. అతడి ఇంట్లో పని వాళ్లు ఉండరు. కోహ్లి ఇంటికి భోజనానికి వెళ్తే అతడు, అతని భార్య దగ్గరుండి అతిథులకు భోజనం వడ్డిస్తారు. మనతో పాటే కూర్చుని మాట్లాడతాడు. మనతో కలిసి డిన్నర్‌కి బయటకు వస్తాడు. మిగతా ఆటగాళ్లు అందరూ కోహ్లిని ఎంతో గౌరవిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కోహ్లిది’’ అని చెప్పుకొచ్చాడు. "కెప్టెన్ అయినందున మైదానంలో అతను అలానే ఉండాలి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో కోహ్లి ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటాడు.. చాలా సార్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో అతడు దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తాడు" అన్నాడు. కోహ్లి అధ్వర్యంలో భారత జట్టు బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే డే-నైట్ టెస్టులో పాల్గొంటుంది. చదవండి: ఆ సమయంలో ఎవరూ లేరు: కోహ్లి కోహ్లి.. నీ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి -
ఆమె... డౌన్ టు ఎర్త్
‘సన్నిలియోన్ చాలా మర్యాదస్తురాలు. చాలా ఒదిగి ఉండే మనస్తత్వం. డౌన్ టు ఎర్త్’ అంటున్నారు ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్. ఇండియన్ రేడియో ఫోరం అవార్డులు అందుకున్న బిగ్ ఎఫ్ఎమ్ రేడియో జాకీలు శేఖర్‌భాషా, జో..ల అభినందన కార్యక్రమంలో మనోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించారు. ‘ కరెంటు తీగ సినిమాలో సన్నిలియోన్‌తో కలిసి పనిచేయడం చాలా బాగుంది. చూడగానే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించింది.. అని పొగడ్తలు కురిపించారు. కరెంటు తీగలో సన్నిలియోన్ పాత్ర గురించి తెలుసుకోవాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనన్నారు. ‘టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలు పెరగాలి. సరైన కథ ఉంటే మరిన్ని మల్టీస్టారర్స్ చేసేందుకు అభ్యంతరం లేదు’ అన్నారు మనోజ్. - సాక్షి, సిటీ ప్లస్