downsizing
-
3 నెలల్లో 350 ఏటీఎంలు మూత
సాక్షి,న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు సాగిస్తోంది. డిజిటల్ లావాదేవీలకు ప్రజలను ప్రేరేపించేందుకు క్రమంగా ఏటీఎంల సంఖ్యనూ కుదించేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి.నోట్ల రద్దు అనంతరం ఏటీఎంలు మూతపడుతుండటంతో క్యాష్‌లెస్ దిశగా ప్రభుత్వం, బ్యాంకులు విస్పష్ట సంకేతాలు పంపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య మూడు నెలల కాలంలో ఏకంగా 350 ఏటీఎంలు మూతపడ్డాయి. గత ఏడాది నవంబర్‌లో నోట్ల రద్దు అనంతరం ప్రజలు పేటీఎం వంటి ఇతర నగదు రహిత ఫ్లాట్ఫ్లాంలపైకి మళ్లడంతో ఏటీఎంల సంఖ్య తగ్గిందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా తక్కువ కియోస్క్‌లతో పనినడిపించాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఏటీఎంల సంఖ్య తగ్గడం కేవలం 0.16 శాతమే అయినా, గత నాలుగేళ్లుగా ఏటీఎంల సంఖ్య ఏటా 16.4 శాతం పెరుగుతున్న క్రమంలో వీటి సంఖ్య తొలిసారిగా పడిపోవడం గమనార్హం. మెట్రో నగరాల్లో ఏటీఎంల నిర్వహణ బ్యాంకులకు భారంగా మారడం కూడా వీటిని కుదించేందుకు బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. ఎస్బీఐ తన అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న అనంతరం పలు ఏటీఎంలను మూసివేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా ఏటీఎంలను కుదించాయి. -
చల్లటి మాట చెప్పిన టీసీఎస్
ముంబై: ఐటి కంపెనీల భారీ ఉద్యోగాలకోతతో ఆందోళనలో ఉన్న టెకీలకు ప్రపంచ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) శుభవార్త అందించింది. ఒకవైపు దిగ్గజ టెక్ కంపెనీలు వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంటే టీసీఎస్ సమీప భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా మరింతమంది ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామంటూ తీపికబురు అందించింది. ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కొత్త బీపీవో కేంద్రాన్ని గురువారం లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల కోతపై ప్రశ్నించినపుడు ఖచ్చితంగా అలాంటి ప్రణాలికలేవీ లేవని టీసీఎస్ సీఈవో, ఎండీ, రాజేష్ గోపీనాథన్ వెల్లడించారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా మరింత మందిని టెక్ నిపుణులు నియమించుకోనున్నట్టు తెలిపారు. టిసిఎస్ అధికార ప్రతినిధి ప్రదీప్ బాజీ మాట్లాడుతూ డిటిటల్ ఇండియా ఇనీషియేషన్ తో భవిష్యత్తులో దేశీయ ఐటి రంగంలో మరింత ప్రకాశవంతంగా ఉండనుందన్నారు. ఈనేపథ్యంలో ఎక్కువ మంది వ్యక్తులతో కనెక్ట్ కావడానికి తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. దేశీయ ఐటీ కంపెనీలు కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ఉద్యోగులను తగ్గించుకుంటోంటే టీసీఎస్ ప్రకటన ఆహ్వానించతగినదని మార్కెట్నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా టిసిఎస్ 45 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, ప్రపంచంలోని ఉత్తమ శిక్షణ పొందిన కన్సల్టెంట్లు 387,000 మంది ఉన్నారు. మార్చి 31, 2017 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 17.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమీకరించింది. -
పథకాల కుదింపే ఎజెండా!
నేటి నుంచి సీఎస్ ఆధ్వర్యంలో సమీక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీ కసరత్తు ఊపందుకుంది. ఇందులో భాగంగా పెద్దగా అవస రం లేని పథకాలను కుదించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. శని, సోమవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి, పురపాలక, విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం-అనుబంధ శాఖలు, పౌర సరఫరాలు, అటవీ-పర్యావరణం, ఇంధ నం, న్యాయ, ప్రణాళికా శాఖల అధికారులతో శనివారం.. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజ న, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, ఆర్ అండ్ బీ, రవాణా, రెవెన్యూ, పరిశ్రమలు, పెట్టుబడులు, గృహ నిర్మాణం, కార్మిక శాఖ, పర్యాటక, సాంస్కృతిక, ఐటీ, జీఏడీ, హోం శాఖల ఉన్నతాధికారులతో సోమవారం భేటీకానున్నారు. అయితే ప్రధానంగా పథకాలను కుదించే అంశంపైనే ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్లో వందలాది పథకాలకు నిధులు కేటాయించే ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రస్తుతం వాటిలో అవసరం లేనివి, కాలం చెల్లిన వాటిని తొలగించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. పలు చిన్న చిన్న పథకాలను ఇతర పథకాల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పద్దుల సంఖ్య తగ్గి బడ్జెట్ కేటాయింపులు మరింత స్పష్టంగా ఉంటాయని భావిస్తోంది. ప్రాధాన్యతాక్రమంలో ఏయే పథకాలను కొనసాగించాలి, వేటిని రద్దు చేయాలి, వేటిని విలీనం చేసే అవకాశముందనే దానిపై పూర్తి సమాచారంతో ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచిం చింది. వాటన్నింటినీ పరిశీలించి చివరకు మిగిలే పథకాల తుది జాబితాను సిద్ధం చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎస్ సారథ్యంలో అధికారుల భేటీలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ముఖ్య కార్యదర్శులతో రెండు, మూడు దఫాలు బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన కేబినెట్ భేటీలోనూ బడ్జెట్‌పైనే సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేయాలని మంత్రులు, కలెక్టర్లను ఆదేశించారు. దీంతో పథకాల కుదింపు ఒకవైపు.. ప్రణాళికల తయారీ మరోవైపు వేగం పుంజుకున్నాయి.