మేనిఫెస్టోలపై సీజేఐ వ్యాఖ్యలు హర్షణీయం
తెలంగాణ లోక్సత్తా పార్టీ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ చేసిన వ్యాఖ్యలపై లోక్సత్తా పార్టీ (తెలంగాణ) హర్షం వ్యక్తం చేసింది.
అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయకపోతే దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని, ఈమేరకు చట్టాలు చేయాలని గతంలోనే తమ పార్టీ స్పష్టం చేసిందని పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు డా.పాండురంగారావు అధ్యక్షతన సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో గతంలో లోక్సత్తా చేసిన సూచనలపై చర్చించారు. హామీల అమలుకు ఎంత డబ్బు అవసరం, దానిని ఎలా సమకూర్చుకుంటారనేది మేనిఫెస్టోలో స్పష్టచేయడం తప్పనిసరి చేయాలని సూచించారు.