draft resolution
-
ఐరాసలో వీగిపోయిన తీర్మానం
ఐరాస: గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం బ్రెజిల్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం వీగిపోయింది. ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడం తమను అసంతృప్తికి గురి చేసిందని అమెరికా వెల్లడించింది. ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా 12 దేశాలు ఓటు వేశాయి. రష్యా, బ్రిటన్ గైర్హాజరయ్యాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. -
రష్యా ‘విలీన’ రెఫరండంను ఖండిస్తూ ఐరాస తీర్మానం
ఐక్యరాజ్య సమితి: ఉక్రెయిన్‌లో మాస్కో మూకల దమనకాండను తీవ్రంగా నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి ముసాయిదా తీర్మానం తెచ్చి ఆమోదించింది. ఉక్రెయిన్‌లోని డొనెట్సŠక్, ఖేర్సన్, లూహాన్సŠక్, జపోరిజియాలపై దురాక్రమణకు పాల్పడి వాటిని బూటకపు రెఫరెండం ద్వారా తమ ప్రధాన భూభాగంలో కలిపేందుకు రష్యా తీసుకున్న నిర్ణయాలను ఆ ముసాయిదా తీర్మానం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ ఉక్రెయిన్ ప్రాంత సమగ్రత: ఐరాస చార్టర్ నిబంధనల పరిరక్షణ’ పేరిట రూపొందించిన ఈ ముసాయిదా తీర్మానం ఆమోదం కోసం సర్వ ప్రతినిధి సభలో బుధవారం ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 143 దేశాలు ఓట్లు వేశాయి. రష్యా, బెలారస్, ఉత్తరకొరియా, సిరియా, నికరాగ్వాసహా 35 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి. ‘రెఫరండంకు చట్టబద్ధత లేదు. ఉక్రెయిన్ నాలుగు ప్రాంతాల యథాతథస్థితిని మార్చే హక్కు రష్యాకు లేదు’ అని తీర్మానం పేర్కొంది. మాది తటస్థ వైఖరి: భారత్ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ‘దీనిపై తటస్థ వైఖరి కొనసాగిస్తున్నా.ం ఉక్రెయిన్, రష్యా చర్చల బాటలో నడవాలి’ అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంభోజ్ అన్నారు. -
ఐరాసలో రష్యాకు భారత్ షాక్!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో భారత్ తన మిత్రదేశం రష్యాకు షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ భూభాగంలోని నాలుగు ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై.. రష్యా రహస్య బ్యాలెట్ కోసం డిమాండ్ చేసింది. అయితే.. రష్యా చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేసింది. ఆల్బేనియా తీసుకొచ్చిన ఈ డ్రాఫ్ట్ రెజల్యూషన్‌పై ఓటింగ్ విషయంలో పునరాలోచించాలని రష్యా.. ఐరాస సాధారణ అసెంబ్లీని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో తీర్మానంపై ఓటింగ్ రహస్య బ్యాలెట్‌తో జరగాలా? బహిరంగంగా జరగాలా? అనే విషయంపై సోమవారం ఓటింగ్ నిర్వహించింది జనరల్ అసెంబ్లీ. రహస్య ఓటింగ్‌కు రష్యా పట్టుబట్టగా.. ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. మొత్తం 107 మంది సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో.. పదమూడు దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా ఓటేశాయి. మరో 39 దేశాలు (రష్యా, చైనా సహా) ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. రష్యా విజ్ఞప్తి మేరకు.. ఈ ఓటింగ్ నమోదు చేయబడింది. ఇందులో.. మాస్కో చేసిన సవాలుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వంద దేశాలలో భారతదేశం ఒకటి అని యూఎన్జీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓటింగ్ అనంతరం రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. UN సభ్యత్వం ఒక దారుణమైన మోసానికి సాక్ష్యంగా మారిందని, ఈ మోసంలో దురదృష్టవశాత్తు జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించారు అని ఆరోపించారు. UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ముసాయిదా ప్రకారం.. రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి, యుద్ధంలో దెబ్బతిన్న దేశం అంతర్జాతీయ సరిహద్దుల నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్‌పై తన ప్రకోపరహిత దూకుడు యుద్ధాన్ని నిలిపివేయాలి. అలాగే.. రష్యా చర్యను గుర్తించవద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ఘాటిస్తుందని తెలిపింది. బుధవారంగానీ, గురువారంగానీ ఈ తీర్మానంపై బహిరంగ ఓటింగ్ జరగనుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా తీరును ఖండించాయి. రష్యా రిఫరెండం చట్టవిరుద్ధంగా పేర్కొంటూ అమెరికా-ఆల్బేనియాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా.. భారత్ ఆ ఓటింగ్‌కు దూరంగా ఉంది. పైగా రష్యా వీటో జారీ చేయడంతో.. ఆ తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలోనే ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది ఆల్బేనియా. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ/రష్యా మిలిటరీ చర్య విషయంలో మొదటి నుంచి తటస్థ స్థితిని అవలంభిస్తోంది భారత్. శాంతి చర్చల ద్వారానే సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని చెబుతూ వస్తోంది. అయితే తాజాగా ఉక్రెయిన్‌పై క్షిపణుల దాడులు పెరిగిపోతుండడంతో ఆందోళన సైతం వ్యక్తం చేసింది భారత్. పరిస్థితి మామూలు స్థితికి చేరేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో రెండురోజుల్లో జరగబోయే కీలక ఓటింగ్‌లో తటస్థ వైఖరినే అవలంభిస్తుందా? లేదంటే ఇప్పుడు బహిరంగ ఓటింగ్‌కు మొగ్గుచూపినట్లే కీలక ఓటింగ్ రష్యాకు ఝలక్ ఇస్తుందా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!. -
కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం నో!
కోల్‌కతా: కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్గం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. ఈ మేరకు ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓటింగ్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ నేతృత్వంలోని కేరళ బృందం ఏచూరి తీర్మానాన్ని ఓడించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 31 ఓట్లు, వ్యతిరేకంగా 55 మంది ప్రతినిధులు ఓటేశారు. కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పొత్తు ఉండొద్దని ప్రకాశ్ కారత్ బృందం తేల్చిచెప్పింది. కేంద్రంలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవడమే మేలని ఏచూరి ప్రతిపాదించారు. మూడు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిసిన తరువాత ఏచూరి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. సవరణలు చేసిన తరువాత ఆమోదం పొందిన తీర్మానంలో కాంగ్రెస్‌తో ఎలాంటి ఎన్నికల పొత్తు, అవగాహన కుదుర్చుకోవద్దని నిర్ణయించినట్లు వెల్లడించారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు అనుకూలంగానే ఉన్నా కేరళ సభ్యులు వ్యతిరేకించిననట్లు తెలిపారు. రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి! కారత్ బృందం తీర్మానాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో పార్టీ సమావేశాలు జరగబోయే ముందు దీనిపై అభిప్రాయాలు సేకరిస్తారు. తన తీర్మానం ఆమోదం పొందకుంటే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తప్పుకోవాలని ఏచూరి అనుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఓటమిని పసిగట్టిన ఏచూరి అసలు ఓటింగ్ జరగకుండా ఉండేలా ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇందుకోసం అత్యవసరంగా పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటుచేసినా ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్రకమిటీసభ్యుడి హఠాన్మరణం ఈ సమావేశాలకు హాజరైన కేంద్ర కమిటీ సభ్యుడు, త్రిపుర అధికార లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మన్ ఖగేన్‌దాస్(79) హఠాన్మరణం చెందారు. శనివారం వేకువజామున ఆయన తీవ్ర గుండెపోటుతో మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. దాస్ 1978, 1983 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా, 1998–2002 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా, 2002 నుంచి 2014 వరకు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. -
‘అణ్వస్త్ర రహిత’ తీర్మానానికి భారత్ నో
ఐక్యరాజ్యసమితి: ఏవిధమైన నిబంధనలూ లేకుండా అణ్వస్త్ర రహిత దేశంగా ఉండటానికి వెంటనే అంగీకరించడంపై ఐక్యరాజ్యసమితి సాధారణసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ మేరకు ఐరాసలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్‌తో పాటు పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలు ఓటు వేశాయి. తమ అణు సదుపాయాలను ఐఏఈఏ భద్రతా ప్రమాణాలకు లోబడి ఉంచడాన్ని కూడా వ్యతిరేకించాయి. అణ్వస్త్ర నిరాయుధీకరణను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా మంగళవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని 169 దేశాలు వ్యతిరేకించగా, 7 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. చైనా, భూటాన్‌తో పాటు ఐదు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ ముసాయిదా తీర్మానంలోని పలు అంశాలకు విడివిడిగా ఓటింగ్ నిర్వహించారు. 9వ పేరాలోని అణ్వస్త్ర నిరాయుధీకరణలో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని, అలాగే ఐఏఈఏకు లోబడి ఉండటాన్ని అంగీకరించాల్సిందిగా భారత్, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాలకు విజ్ఞప్తి చేసే తీర్మానానికి వ్యతిరేకంగా రికార్డు సంఖ్యలో 165 ఓట్లు వచ్చాయి. 2015 నాటికి విజయవంతంగా నిర్వహించాల్సిన ఎన్పీటీ సమీక్ష సదస్సుకు సంబంధించి పీఠికలోని 24వ పేరాను కూడా భారత్, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకించాయి. అయితే దీనికి 166 ఓట్లు అనుకూలంగా రావడంతో ఈ నిబంధన కొనసాగనుంది. ప్రాంతీయ, ఉపప్రాంతీయ స్థాయిలో సంప్రదాయ ఆయుధ నియంత్రణ నిబంధనపై భారత్ ఒక్కటి మాత్రమే వ్యతిరేకంగా ఓటేసింది. ఇక ఎన్పీటీ విశ్వజనీనతపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అణ్వస్త్ర రహిత దేశంగా ఎన్పీటీలో చేరడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాగా, భారత్‌తో వివాదాస్పద అణు జవాబుదారీ అంశాన్ని పరిష్కరించుకుంటామని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.