ఐక్యరాజ్య సమితి: ఉక్రెయిన్‌లో మాస్కో మూకల దమనకాండను తీవ్రంగా నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి ముసాయిదా తీర్మానం తెచ్చి ఆమోదించింది. ఉక్రెయిన్‌లోని డొనెట్సŠక్, ఖేర్సన్, లూహాన్సŠక్, జపోరిజియాలపై దురాక్రమణకు పాల్పడి వాటిని బూటకపు రెఫరెండం ద్వారా తమ ప్రధాన భూభాగంలో కలిపేందుకు రష్యా తీసుకున్న నిర్ణయాలను ఆ ముసాయిదా తీర్మానం తీవ్రంగా తప్పుబట్టింది.
‘ ఉక్రెయిన్ ప్రాంత సమగ్రత: ఐరాస చార్టర్ నిబంధనల పరిరక్షణ’ పేరిట రూపొందించిన ఈ ముసాయిదా తీర్మానం ఆమోదం కోసం సర్వ ప్రతినిధి సభలో బుధవారం ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 143 దేశాలు ఓట్లు వేశాయి. రష్యా, బెలారస్, ఉత్తరకొరియా, సిరియా, నికరాగ్వాసహా 35 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి. ‘రెఫరండంకు చట్టబద్ధత లేదు. ఉక్రెయిన్ నాలుగు ప్రాంతాల యథాతథస్థితిని మార్చే హక్కు రష్యాకు లేదు’ అని తీర్మానం పేర్కొంది.
మాది తటస్థ వైఖరి: భారత్
ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ‘దీనిపై తటస్థ వైఖరి కొనసాగిస్తున్నా.ం ఉక్రెయిన్, రష్యా చర్చల బాటలో నడవాలి’ అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంభోజ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment