Drashti dhami
-
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కమింగ్ : నటి మెటర్నిటీ ఫోటోలు
-
తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి!
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి ద్రష్టి ధామి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ నటులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వెల్లడించింది.కాగా.. ద్రష్టి ధామి 2015లో నీరజ్ ఖేమ్కాను వివాహం చేసుకున్నారు. కెరీర్ విషయానికొస్తే డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియేలో కూడా ఆమె పాల్గొన్నారు. ధామి 2007లో టీవీ సీరియల్ దిల్ మిల్ గయేతో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2010లో గుర్మీత్ చౌదరి సరసన గీత్ - హుయ్ సబ్సే పరాయి సీరియల్లోనూ కనిపించింది. ఆమెకు మధుబాల, ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ సీరియల్‌తనే ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో ఆమె వివియన్ దేనాకు జంటగా నటించింది. అంతే కాకుండా ఇటీవలే ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ది ఎంపైర్, దురంగ అనే వెబ్ సిరీస్‌లలో కనిపించింది. ప్రస్తుతం పెళ్లయిన దాదాపు తొమ్మిదేళ్లకు ద్రష్టి ధామి తల్లి కాబోతోంది. View this post on Instagram A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti) -
ప్రముఖ సీరియల్ నటికి కరోనా.. త్వరగా కోలుకోవాలని సందేశాలు
Television Actress Drashti Dhami Tested Positive For Covid 19: ఇండియాలో కొవిడ్ మహామ్మారి తన సత్తా చాటుతోంది. చాపకింద నీరులా రోజురోజుకీ తన ఉనికి పెంచుకుంటూ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తేడా లేకుండా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతూ బాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అర్జున్ కపూర్, కరీనా కపూర్, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్, మృణాల్ ఠాకూర్, ఏక్తా కపూర్, అలయ ఎఫ్, అర్జున్ బిజ్లానీ, డెల్నాజ్ ఇరానీ, ప్రేమ్ చోప్రా వంటి పలువురు బీటౌన్, టీవీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా పాపులర్ సీరియల్ నటి కొవిడ్‌కు గురయ్యింది. ప్రముఖ టెలివిజన్ సీరియల్ 'మధుబాల' నటి ద్రష్టి ధామికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ప్రకటించింది ద్రష్టి. తాను ఇటీవల నటించిన 'ది ఎంపైర్' వెబ్ సిరీస్‌ను వీక్షిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ 'నేను మూడో వేవ్‌తో పోరాడుతున్నప్పుడు కొన్ని మంచి విషయాలు మాత్రమే నాకు తోడుగా ఉన్నాయి. లక్కీగా నేను ఇప్పుడు లిల్లీ పూల వాసను పసిగట్టవచ్చు, ట్విక్స్ చాక్లెట్ రుచిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ అదృష్టాన్ని లెక్కపెడుతూ ప్రేమ, మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తాను.' అని ద్రష్టి తెలిపింది. ఈ పోస్ట్‌కు కరిష్మా తన్నా, కరణ్ వి గ్రోవర్, అర్జిత్ తనేజాతో పాటు పలువురు త్వరగా కోలుకోవాలని కామెంట్ పెట్టారు. View this post on Instagram A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti) ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ -
టీవీక్షణం: యాంకర్‌గా ఫెయిలైందా?!
చాలామంది యాంకర్లు నటీమణులుగా కూడా అదరగొడుతుంటారు. కొందరు నటీమణులు యాంకర్లుగా మారి అలరిస్తుంటారు. అయితే అందరూ అన్నింట్లో విజయం సాధిస్తారని చెప్పలేం. కొందరు ఫెయిలవుతారు... ద్రష్టి ధామిలాగా. టెలివిజన్ ప్రపంచంలో ద్రష్టికి ఓ స్థానం ఉంది. ఆమె చేసే సీరియల్‌కి ఆమె పోషించే పాత్ర పేరే ఉంటుంది. తనకిచ్చిన ఆ ప్రాధాన్యతను వృథా చేయదామె. అద్భుతంగా నటించి సీరియల్‌ని హిట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ‘గీత్’ చేసినప్పుడు అందరూ ఆ పేరుతోనే పిలిచారామెని. ఇప్పుడు ‘మధుబాల’ చేస్తుంటే మధుబాలా అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేస్తుంది. అందుకే మోస్ట్ వాంటెడ్ టెలివిజన్ యాక్ట్రెస్‌గా అవార్డులు అందుకుంది. అయితే నటిగా ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ద్రష్టి... యాంకర్‌గా మాత్రం అట్టర్ ఫ్లాపయ్యింది. కలర్స్‌లో ప్రసారమవుతోన్న ‘ఝలక్ దిఖ్లాజా’ 7వ సిరీస్‌కి హోస్ట్‌గా ఎంపికైంది ద్రష్టి. అయితే ప్రేక్షకుల్ని అల రించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ఆమెను షో నుంచి తొలగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో ప్రముఖ యాంకర్ మనీష్ పాల్ని తీసుకున్నారు. ద్రష్టిని తీసేయడం ఆమె అభిమానుల్ని బాధించింది. కానీ ద్రష్టి మాత్రం తన ఓటమిని నిజాయతీగా ఒప్పుకుంది. ‘నా స్థానంలో వేరొకరిని తీసుకుంటున్నామని ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు నేనేమీ బాధపడలేదు, అందరూ అన్నీ చేయలేరు, నేను దీన్ని సరిగ్గా చేసివుండకపోవచ్చు, ఆ నిర్ణయం తీసుకునే హక్కు వారికుంది’ అంటూ నవ్వుతూ చెప్పింది. యాంకర్‌గా ఫెయిలైతేనేం... ఈ ఒక్కమాటతో వ్యక్తిగా డిస్టింక్షన్లో పాసయ్యింది!