
Television Actress Drashti Dhami Tested Positive For Covid 19: ఇండియాలో కొవిడ్ మహామ్మారి తన సత్తా చాటుతోంది. చాపకింద నీరులా రోజురోజుకీ తన ఉనికి పెంచుకుంటూ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తేడా లేకుండా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతూ బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అర్జున్ కపూర్, కరీనా కపూర్, నోరా ఫతేహీ, జాన్ అబ్రహం, ఆయన భార్య ప్రియా రుంచల్, మృణాల్ ఠాకూర్, ఏక్తా కపూర్, అలయ ఎఫ్, అర్జున్ బిజ్లానీ, డెల్నాజ్ ఇరానీ, ప్రేమ్ చోప్రా వంటి పలువురు బీటౌన్, టీవీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా పాపులర్ సీరియల్ నటి కొవిడ్‌కు గురయ్యింది.
ప్రముఖ టెలివిజన్ సీరియల్ 'మధుబాల' నటి ద్రష్టి ధామికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ప్రకటించింది ద్రష్టి. తాను ఇటీవల నటించిన 'ది ఎంపైర్' వెబ్ సిరీస్‌ను వీక్షిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ 'నేను మూడో వేవ్‌తో పోరాడుతున్నప్పుడు కొన్ని మంచి విషయాలు మాత్రమే నాకు తోడుగా ఉన్నాయి. లక్కీగా నేను ఇప్పుడు లిల్లీ పూల వాసను పసిగట్టవచ్చు, ట్విక్స్ చాక్లెట్ రుచిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ అదృష్టాన్ని లెక్కపెడుతూ ప్రేమ, మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తాను.' అని ద్రష్టి తెలిపింది. ఈ పోస్ట్‌కు కరిష్మా తన్నా, కరణ్ వి గ్రోవర్, అర్జిత్ తనేజాతో పాటు పలువురు త్వరగా కోలుకోవాలని కామెంట్ పెట్టారు.
ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉన్నప్పటికీ