draw method
-
స్థానిక సారథుల ఎన్నిక ఇలా..
‘విప్’ కీలకం మున్సిపల్, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగి నందున, ఆయా పార్టీల గెలిచిన వారు, సారథుల ఎన్నికలో తమ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. దీన్నే విప్ అంటారు. పార్టీ ఆదేశాల్ని ధిక్కరిస్తే.. వారిపై కొరడా ఝళిపించే అవకాశం ఉంటుంది. స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు ఈ నిబంధన వర్తించదు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మాలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడిని కానీ, పార్టీ ఇతర నాయకుడిని కానీ విప్‌గా నియమించవచ్చు. స్థానిక సభ్యుడికి సమావేశం మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఇతర నాయకుడు, సభ్యుడైతే లోనికి ప్రవేశించేందుకు అనుమతించరు. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యు లు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటు వేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం ఒక గంట ముం దు, ఎన్నికల అధికారికి అందించాల్సి ఉం టుంది. అయితే విప్ జారీ అయినా, ఒకవేళ ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకం చేయకపోతే.. విప్ వర్తించదు. ఏ పార్టీ స భ్యుడైనా విప్‌ను అందుకుని, ఇతరులకు ఓ టు వేస్తే.. ఓటు చెల్లుతుంది. విప్ ఉల్లంఘన పై పార్టీ విప్ మూడు రోజు ల్లోపు ఎన్నికల అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలి. ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో వివరించాలని నోటీస్ జారీ చేస్తారు. విప్ ధిక్కరించడం వల్ల అర్హతను కోల్పోవచ్చు. ఎంపీలకు ఒకేచోట అవకాశం మున్సిపల్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రకటనను మున్సిపల్ సభ్యులుగా ఎన్నికైన వారికి, ఆయా సంఘాల్లో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలకు, ఆప్షన్ ఇచ్చిన ఎంపీలకు అందజేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు, మున్సిపాలిటీ ఉన్న చోట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీలు ఓటు వేసేందుకు అర్హులు. ఎంపీలు తాము ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ పరిధిలో మున్సిపాలిటీలు ఒకటి కంటే అధికంగా ఉన్నప్పుడు ఏదో ఒక చోట మాత్రమే ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉండాలి. వారు ప్రత్యేక సమావేశానికి హాజరై అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే నాటికి, మున్సిపల్ పరిధిలో ఓటరు అయి ఉంటే.. వారూ ఓటు వేయవచ్చు. జిల్లా, మండల పరిషత్తు సారథుల ఎన్నికల ప్రక్రియకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు(లోక్‌సభ, రాజ్యసభ) ఆహ్వానం ఉంది. కానీ వారికి ఓటు హక్కు లేకపోవడం గమనార్హం. కో- ఆప్షన్ సభ్యుడి ఎన్నిక విధానం మున్సిపల్, మండల, జిల్లా పరిషత్తు సారథుల ఎన్నిక తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. మండల పరిషత్తులకు ఒక ఆప్టెడ్ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్తుకు ఇద్దరిని ఎన్నుకోవాలి. కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ఆసక్తి ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన వయోజనులు నిర్దేశిత ప్రత్యేక సమావేశం రోజున ఉదయం 10 గంటలకి నామినేషన్లు సమర్పించాలి. 10 నుంచి 12 గంటల వరకు పరిశీలన, మధ్యాహ్నం ఒంటి గంటకు ఉపసంహరణ, ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే తెలుగు అక్షర క్రమంలో జాబితా తయారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. మండల పరిషత్తులలో ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీలు కో-ఆప్షన్ సభ్యులను చేతులెత్తే పద్ధతిలో ఓటు వేసి ఎన్నుకుంటారు. ఇక్కడ సరి సమానంగా ఓట్లు వస్తే.. డ్రా పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు విప్ వర్తించదు. మున్సిపాలిటీలకు ముగ్గురు చొప్పు న సభ్యులను ఎన్నుకోవాలి. ఇద్దరు మైనార్టీ వర్గాల వారై ఉండాలి. ఈ ఇద్దరిలో ఒకరు మహిళ ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్వర్గాలో ఎవరైనా ఆ పురపాలక సంఘం పరిధిలో ఓటర్లుగా ఉన్న వారిని ఎన్నుకోవాలి. మరో సభ్యుడిగా రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగి, వివిధ రంగాలపై అవగాహన కలిగిన వారిని ఎన్నుకోవాలి. -
ఓట్లు సమానంగా వస్తే డ్రా పద్ధతిలో విజేత ఎంపిక
తాండూరు, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే డ్రా పద్ధతిలో విజేతను ఎంపిక చేస్తామని తాండూరు మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లకు నమూనా కంట్రోల్ యూనిట్ ద్వారా ఈనెల 12న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి విలేకరులతో మాట్లాడారు. ఏదైన వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చినప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం డ్రా తీసి విజేతను ఎంపిక చేస్తామని వివరించారు. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారి నమోదు చేసిన ఓట్ల వివరాలకు ఓట్ల లెక్కింపు రోజు ఓట్ల వివరాలకు తేడా ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థికి ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేస్తారని తెలిపారు. మొత్తం 31 వార్డుల ఓట్ల లెక్కింపును మూడు రౌండ్లలో పూర్తి చేస్తామన్నారు. మొదటి, రెండో రౌండ్‌కు పది వార్డుల చొప్పున, మూడో రౌండ్లో 11వార్డుల ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి పోటీ చేసిన అభ్యర్థి లేదా అతని తరపున ఎన్నికల/కౌంటింగ్ ఏజెంట్లలో ఒక్కరికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. ఓట్ల లెక్కింపునకు వ్యవసాయ,విద్యాశాఖ, గనులు, ఇరిగేషన్, ఆర్అండ్బీ తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులు మొత్తం 43మందిని నియమించామన్నారు. పది మంది కౌంటింగ్ సూపర్వైజర్లు మరో పది మంది అసిస్టెంట్లు, ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపునకు ఇద్దరు ఇన్చార్జిలు ఉంటారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా ఇద్దరు ఇన్చార్జిలతోపాటు నలుగురు అసిస్టెంట్లను నియమించనున్నట్టు చెప్పారు. ఓట్ల లెక్కింపు వివరాలను రౌండ్ల వారీగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయనున్న మీడియా పాయింట్లో విలేకరులకు అందజేస్తామని వివరించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల అధికారి గోపయ్య, ఇంజనీర్ సత్యనారాయణ, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
‘డ్రా’ ద్వారా టెండర్ల కేటాయింపు
కార్పొరేషన్,న్యూస్‌లైన్ : నగరపాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు టెండర్లను డ్రా పద్ధతిన కేటాయించారు. టెండర్లో పాల్గొన్న 21 మంది కాంట్రాక్టర్లు జీరో శాతానికి టెండర్లు వేశారు. దీంతో ఎవరికి టెండర్లు ఇవ్వాలో అర్థంకాక దీనిపై తుది నిర్ణయం కోసం వారం రోజుల క్రితం ఫైల్‌ను ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు, మున్సిపల్ ప్రత్యేకాధికారి,జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ముందుంచారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ డ్రా పద్ధతిన టెండర్లు కేటాయించాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ చాంబర్లో డ్రా ద్వారా టెండర్లను కేటాయిం చేందుకు ఏర్పాట్లు చేశారు. టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల అందరికీ సమాచారం ఇచ్చారు. ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు,ఎంహెచ్ఓ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రా తీయించారు. ఇందులో ఒకటో జోన్లో పారిశుధ్య కార్మికుల టెండర్ నవచైతన్య కార్మిక సంఘానికి, రెండవ,నాలుగో జోన్ల టెండర్లు ఝాన్సీ మహిళా సంఘానికి,మూడవ,అయిదవ జోన్ల టెండర్లు ప్రగతి కార్మిక సంఘానికి వచ్చాయి. ‘ఝాన్సీ’కి అభ్యంతరం తెలిపిన కార్మికులు పారిశుధ్య కార్మికుల టెండర్లు కార్మికులకే ఇవ్వాలని గతంలో పలు యూనియన్లు ధర్నాలు,సమ్మెలు చేశాయి. వచ్చే టెండర్లలో కార్మికులకే టెండర్లు ఇస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మెను విరమించుకున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొనడంపై సీఐటీయూ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ మహిళా సం ఘం కార్మికుల జీతం డబ్బులు సక్రమంగా ఇవ్వడంలేదని ఆరోపించారు. దీనికి సంఘం కాంట్రాక్టర్ విజయ తాను ఎవరికి ఇబ్బందులు పెట్టలేదని,కార్మికులకు సంబంధించి బ్యాంకు ఖాతానంబరు సక్రమంగా లేకనే వారి ఖాతాలో డబ్బులు జమకాలేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సీఐటీయూ నాయకులు ఝాన్సీ సంఘానికి టెండర్లు దక్కడంపై తాము నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు యూనియన్ నాయకుడు దండివెంకట్ తెలిపారు. కార్మికుల కేటాయింపు ఇలా.. జోన్నం. మగ కార్మికులు మహిళా కార్మికులు డ్రైవర్లు మొత్తం 1 14 - 9 23 2 26 1 6 33 3 26 - 8 34 4 30 1 13 44 5 26 - 8 34 మొత్తం 122 2 44 168