‘విప్’ కీలకం
మున్సిపల్, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగి నందున, ఆయా పార్టీల గెలిచిన వారు, సారథుల ఎన్నికలో తమ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. దీన్నే విప్ అంటారు. పార్టీ ఆదేశాల్ని ధిక్కరిస్తే.. వారిపై కొరడా ఝళిపించే అవకాశం ఉంటుంది. స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు ఈ నిబంధన వర్తించదు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మాలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడిని కానీ, పార్టీ ఇతర నాయకుడిని కానీ విప్‌గా నియమించవచ్చు. స్థానిక సభ్యుడికి సమావేశం మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఇతర నాయకుడు, సభ్యుడైతే లోనికి ప్రవేశించేందుకు అనుమతించరు. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యు లు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటు వేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం ఒక గంట ముం దు, ఎన్నికల అధికారికి అందించాల్సి ఉం టుంది.
అయితే విప్ జారీ అయినా, ఒకవేళ ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకం చేయకపోతే.. విప్ వర్తించదు. ఏ పార్టీ స భ్యుడైనా విప్‌ను అందుకుని, ఇతరులకు ఓ టు వేస్తే.. ఓటు చెల్లుతుంది. విప్ ఉల్లంఘన పై పార్టీ విప్ మూడు రోజు ల్లోపు ఎన్నికల అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలి. ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో వివరించాలని నోటీస్ జారీ చేస్తారు. విప్ ధిక్కరించడం వల్ల అర్హతను కోల్పోవచ్చు.
ఎంపీలకు ఒకేచోట అవకాశం
మున్సిపల్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రకటనను మున్సిపల్ సభ్యులుగా ఎన్నికైన వారికి, ఆయా సంఘాల్లో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలకు, ఆప్షన్ ఇచ్చిన ఎంపీలకు అందజేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు, మున్సిపాలిటీ ఉన్న చోట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీలు ఓటు వేసేందుకు అర్హులు. ఎంపీలు తాము ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ పరిధిలో మున్సిపాలిటీలు ఒకటి కంటే అధికంగా ఉన్నప్పుడు ఏదో ఒక చోట మాత్రమే ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉండాలి.
వారు ప్రత్యేక సమావేశానికి హాజరై అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే నాటికి, మున్సిపల్ పరిధిలో ఓటరు అయి ఉంటే.. వారూ ఓటు వేయవచ్చు. జిల్లా, మండల పరిషత్తు సారథుల ఎన్నికల ప్రక్రియకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు(లోక్‌సభ, రాజ్యసభ) ఆహ్వానం ఉంది. కానీ వారికి ఓటు హక్కు లేకపోవడం గమనార్హం.
కో- ఆప్షన్ సభ్యుడి ఎన్నిక విధానం
మున్సిపల్, మండల, జిల్లా పరిషత్తు సారథుల ఎన్నిక తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. మండల పరిషత్తులకు ఒక ఆప్టెడ్ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్తుకు ఇద్దరిని ఎన్నుకోవాలి. కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ఆసక్తి ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన వయోజనులు నిర్దేశిత ప్రత్యేక సమావేశం రోజున ఉదయం 10 గంటలకి నామినేషన్లు సమర్పించాలి.
10 నుంచి 12 గంటల వరకు పరిశీలన, మధ్యాహ్నం ఒంటి గంటకు ఉపసంహరణ, ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే తెలుగు అక్షర క్రమంలో జాబితా తయారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. మండల పరిషత్తులలో ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీలు కో-ఆప్షన్ సభ్యులను చేతులెత్తే పద్ధతిలో ఓటు వేసి ఎన్నుకుంటారు. ఇక్కడ సరి సమానంగా ఓట్లు వస్తే.. డ్రా పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు విప్ వర్తించదు.
మున్సిపాలిటీలకు ముగ్గురు చొప్పు న సభ్యులను ఎన్నుకోవాలి. ఇద్దరు మైనార్టీ వర్గాల వారై ఉండాలి. ఈ ఇద్దరిలో ఒకరు మహిళ ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్‌వర్గాలో ఎవరైనా ఆ పురపాలక సంఘం పరిధిలో ఓటర్లుగా ఉన్న వారిని ఎన్నుకోవాలి. మరో సభ్యుడిగా రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగి, వివిధ రంగాలపై అవగాహన కలిగిన వారిని ఎన్నుకోవాలి.
స్థానిక సారథుల ఎన్నిక ఇలా..
Published Thu, Jul 3 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement