డీడీఏ గృహనిర్మాణ పథకం డ్రా వాయిదా
న్యూఢిల్లీ: సాంకేతిక అవరోధాల కారణంగా ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) సోమవారం నిర్వహించతలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన గృహనిర్మాణ పథకం -2014 వాయిదాపడింది. ప్రధాన కార్యాలయం వికాస్ సదన్‌లో సంబంధిత అధికారులు ఆదివారం ఉదయం ట్రయల్ డ్రా నిర్వహించారు. అయితే తాజా డ్రా తేదీని అధికారులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా 2014-గృహ పథకం కింద వివిధ కేటగిరీల్లో డీడీఏ మొత్తం 25 వేల ఫ్లాట్లను నిర్మిస్తోంది. వీటి ఖరీదు రూ. ఏడు లక్షలు మొదలుకుని రూ. 1.2 కోట్లవరకూ ఉంటుంది. ఇందుకోసం డీడీఏ అప్పట్లో మొత్తం 17 లక్షల బ్రోచర్లను ప్రచురించిన సంగతి విదితమే.