dress as women
-
సింపుల్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధర లక్షల్లోనే.. అంబానీ కోడలు మరి!
Radhika Merchant: భారతదేశంలో అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కేవలం ధనికులని మాత్రమే కాదు.. అప్పుడప్పుడు లెక్కకు మించిన దానధర్మాలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. అయితే గత కొన్ని రోజులకు ముందు అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. కాగా ఇప్పుడు మరో సారి దుబాయ్‌లో కనిపించారు. దుబాయ్‌లో కనిపించిన రాధికా మర్చంట్ ధరించిన బ్లూ కలర్ షేడ్ డ్రెస్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీని ధర 3500 యూరోలు కావడం గమనార్హం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3,13,542. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో కూడా ఈమె సుమారు రూ. 53 లక్షల ఖరీదైన హ్యాండ్ బ్యాగుతో కనిపించి అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: మందు మీద మోజు.. వైన్ బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) View this post on Instagram A post shared by Mukesh Ambani (@mukeshambani.offical) -
చీరలు కట్టుకుని నిరసన తెలిపారు..
ఢిల్లీ: కరువు సాయం కోరుతూ నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు శుక్రవారం మళ్లీ వినూత్నంగా ఆందోళనకు దిగారు. చీరలు కట్టుకుని రహదారులపై నడుస్తూ ‘కరువు సాయం మంజూరు చేయండి’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు ఇవేనంటూ వాటిని పట్టుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తామంతా కావేరి నదీమాత బిడ్డలమని, అందుకే చీరలు కట్టుకున్నామని వారు తెలిపారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న నిరసన 32వ రోజుకు చేరింది. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.