Radhika Merchant: భారతదేశంలో అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కేవలం ధనికులని మాత్రమే కాదు.. అప్పుడప్పుడు లెక్కకు మించిన దానధర్మాలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. అయితే గత కొన్ని రోజులకు ముందు అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. కాగా ఇప్పుడు మరో సారి దుబాయ్‌లో కనిపించారు.
దుబాయ్‌లో కనిపించిన రాధికా మర్చంట్ ధరించిన బ్లూ కలర్ షేడ్ డ్రెస్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీని ధర 3500 యూరోలు కావడం గమనార్హం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3,13,542. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో కూడా ఈమె సుమారు రూ. 53 లక్షల ఖరీదైన హ్యాండ్ బ్యాగుతో కనిపించి అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
(ఇదీ చదవండి: మందు మీద మోజు.. వైన్ బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ)
Comments
Please login to add a commentAdd a comment