Dreyineji
-
గల్లంతైన బాలుడు మృతి
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): శుక్రవారం రాత్రి కురిసిన జోరువాన ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వర్షం నీటికి నిజామాబాద్ నగరంలోని పలు వీధులు జలమయమయ్యాయి. మురికి కాలువలు ఉప్పొంగి పొర్లాయి. తల్లి చేతిలో నుంచి జారిపోయిన ఓ బాలుడు డ్రెయినేజీలో కొట్టుకుపోయాడు. జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రియాజ్ దగ్గరి బంధువు ఒక రు మృతి చెందటంతో అంత్యక్రియల కో సం మూడు రోజుల క్రితం భార్య పిల్లల తో కలిసి ఇక్కడికి వచ్చాడు. భారీ వర్షం కురియటంతో వారున్న ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో రియాజ్ భార్య తన కొడుకు జమీర్ (7)ను తీసుకుని సమీపంలోని మరో ఇంట్లో పడు కునేందుకు బయలు దేరింది. పొంగి ప్రవహిస్తున్న డ్రైనేజీని ఇద్దరూ దాటుతుండగా జమీర్ ఆమె చేతిలో నుంచి జారిపోయి డ్రైనేజీలో కొట్టుకుపోయాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న బంధువులు వెం టనే డ్రెయినేజీలో దిగి గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. చీకటిగా ఉండ టంతో ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్, రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. సమారు పది గంటల పాటు వెదికారు. భారీ వర్షం నీటితో వరద ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలకు అ టంకాలు కలిగాయి. వరద తగ్గటంతో అధికారులు బాలుడు పడిన చోటు నుంచి మరోమారు గాలింపు చేపట్టారు. చివరకు బాలుడు పడిన చోటుకు అర కిలోమీటరు దూరంలో చెట్టుకు తట్టుకుని బాలుడి శవం కనిపించింది. మున్సిపల్ సిబ్బంది బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. రియాజ్ దంపతులకు జమీర్‌తో పాటు మరో కొడుకు, కూతురు ఉన్నారు. జమీర్ నాందేడ్‌లో ఉర్డూ మీడియం మూడో తరగతి చదువుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. బాలుడి అంత్యక్రియలు నిజామాబాద్‌లోనే నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందే అవకాశం లేక పోవటంతో రూ. 25 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఎమ్మెల్యే నాందేడ్ అధికారులతో ఫోన్లో సంప్రదించి బాలుడి కుటుంబానికి కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం అందించాలని కోరారు. -
డ్రెయినేజీ అస్తవ్యస్తం
కట్టంగూర్ : మండలంలోని కురుమర్తి గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు నివాసాల మధ్య నిల్వ ఉండడంతో ప్రజలు రోడ్డు వెంట వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని బస్‌స్టాప్ నుంచి ప్రాథమిక పాఠశాలకు వెళ్లే రహదారి వెంబడి నిర్మించిన డ్రెయినేజీ పూర్తిగా మట్టితో నిండిపోయింది. ఎస్సీ కాలనీలో డ్రెయినేజీ లేకపోవటంతో రోడ్డుపై మురుగు నిలిచి నెలరోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దుర్వాసన వెదజల్లుతూ ఈగలు, దోమలకు ఆవాసంగా మారింది. ప్రజలకు రోగాల బారిన పడుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్ల వెంబడి డ్రెయినేజీలు నిర్మించకపోవటంతో ఇళ్లలోని మురుగు రోడ్డుపై నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిత్యం కురుమర్తి నుంచి మునుకుంట్ల గ్రామానికి, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్రెయినేజీలు నిర్మించాలి గ్రామంలో డ్రెయినేజీలు నిర్మించకపోవటంతో మురుగు నివాసాల మధ్య నిల్వఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కురుమర్తి నుంచి మునుకుంట్లకు వెళ్లే దారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. డ్రెయినేజీలు నిర్మించి సమస్యను పరిష్కరించాలి. -
సమస్యల లోగిలి
• పక్కా ఇళ్లు కరువు..డ్రెయినేజీలు తెలియవు • రోడ్డుపైనే పారుతున్న మురుగునీరు • రెచ్చిపోతున్న పందులు • బుడిగజంగాల కాలనీ సమస్యలమయం కొత్తపల్లి : పూరిగుడిసెలు..కనిపించని డ్రెయినేజీలు..కంపుకొడుతున్న పరిసరాలు..ఇవన్నీ ఏదో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపాటే. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం రేకుర్తి పంచాయతీ పరిధిలోని బుడిగజంగాలకాలనీ దుస్థితి. పక్కా ఇళ్లు లేక వ్యక్తిగత మరుగుదొడ్లకు నోచుకోలేక కాలనీవాసులతో సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు జీవిస్తున్న ఈ కాలనీలో కనీసం డ్రెయినేజీలు లేవు. బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంతోపాటు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు విన్నవిస్తున్నారు. కరీంనగర్‌లోని గిద్దె పెరుమాండ్ల స్వామి దేవస్థాన భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసిస్తున్న బుడిగ జంగాలను రేకుర్తికి తరలించారు. 128 సర్వేనంబర్‌లో మొదటి విడతగా 148 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 250 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు రద్దు కాగా డబుల్ బెడ్ రూమ్ పథకం కింద బుడిగ జంగాల కాలనీ ఎంపికవకపోవడంతో గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్నా వాటికి కనీస వసతుల్లేవు. 148 గృహాల్లో కేవలం 30 గృహాలకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. మిగతా వారు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి. దీనికితోడు పాలిథిన్ కవర్లతో స్నానాల గదులను ఏర్పాటు చేసుకున్నారు. వీటినుంచి వచ్చే వ్యర్థ నీరు డ్రైనేజీలు లేక రోడ్లపైనే ప్రవహిస్తున్నాయి. అధ్వానంగా అంతర్గత రోడ్లుŠ, రోడ్లపై పారుతున్న మురికినీటితో కాలనీ కంపుకొడుతోంది. పక్కా ఇళ్లు లేకపోవడంతో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లకు అర్హత పొందలేకపోయారు. స్తంభాలు లేకపోవడంతో కర్రల మద్దతుతో సర్వీస్ వైర్ల ద్వారా విద్యుత్ పొందుతున్నారు. తాగునీటి ట్యాంకు ఉన్నా ఇంటింటికి పైప్‌లైన్ లేకపోవడంతో ప్లాస్టిక్ పైప్‌లను ఏర్పాటు చేసుకొని నీటిని వాడుకుంటున్నారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు ?
వివాదంగా మారుతున్న సైడ్ డ్రెయిన్ పనులు మురుగునీటితో ఇక్కట్లు పడుతున్న ప్రజలు పట్టించుకోని పాలకవర్గం అవి వర్షపు నీళ్లు కాదు.. ఇళ్ల నుంచి వచ్చే వృథా నీరు కాదు.. మలమూత్రాలతో కూడిన కంపు. డ్రెయినేజీల్లో కాకుండా ప్రధాన రోడ్డుపై పారుతుండడంతో స్థానికులు, బాటసారులు దుర్వాసన భరించలేక పోతున్నారు. పైగా వాహనాల రాకపోకలతో మీదపడుతుండడంతో తట్టుకోలేక పోతున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ డ్రెయినేజీ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు ‘ఈ కంపు ఇంకెన్నాళ్లు’ అని ఆవేదన చెందుతున్నారు. పరకాల: నగర పంచాయతి పరిధిలో 2013-14 సంవత్సరంలో ప్రధాన రోడ్డు వెంట సైడ్ డ్రైయి న్ పనులను చేపట్టారు. అయితే అందులో కొన్ని పనులు అసంపూర్తిగా మారడంతో ఏడాది క్రింద ట మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి రూ.31లక్షలతో రీటెండర్ నిర్వహించారు. ఇందు లో భాగంగా ఆంధ్రబ్యాంకు వద్ద రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైయిన్, హుజురాబాద్ రోడ్డులోని శ్రీజ మెడికల్ స్టోర్స్ నుంచి పోచమ్మగుడికి ఇరువైపులా పనులు చేపట్టాలని కోరారు. ఆంధ్రబ్యాం కు వద్ద మాత్రమే పనులను పూర్తి చేసి మిగిలిన చోట పనుల నిర్మాణం చేపట్టలేదు. కంపు కొడుతున్న ప్రధాన రోడ్డు సైడ్ డ్రైయిన్ నిర్మాణ పనులు చేపట్టడానికి శ్రీజ మెడికల్ స్టోర్స్ నుంచి డాక్టర్ రాజేందర్‌రెడ్డి పిల్ల ల ఆస్పత్రి వరకు కాల్వను తవ్వారు. ఈ దారిలో 20 మంది గృహాల వారు నిబంధనల ప్రకారం కాకుండా 50 ఫీట్లు ఎక్కువగా రోడ్డుపై ఉండడం తో వాటిని కూల్చివేసుకోవాలని అధికారులు నో టీసులు అందించారు. అందులో 16మంది సెట్‌బ్యాక్ అయ్యి పునఃనిర్మాణాలు చేసుకోగా మిగిలి న వారు మాత్రం తొలగించలేదు. దీంతో మిగ తావారు మమ్మల్ని బలవంతంగా ఇళ్లను తొల గించేలా చేసి ఇప్పుడు కొందరికి మినహాయింపు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫలితంగా ఈ పనులు తరుచూ వివాదస్పదమవుతున్నాయి. ఇదిలా ఉండగా కాల్వను తవ్వి వదిలి వేయడం తో కంపునీళ్లు రోడ్డుపైనే పారుతున్నాయి. ఈ నీటిలో నుంచే బాటసారులు నడిచిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అదేసమయంలో వాహనాలు వచ్చిపోతుండడంతో మురుగునీరు మీద పడుతుండ డం వల్ల ఇక్కట్లు పడాల్సి వస్తోంది. పట్టించుకోని పాలకవర్గం సైడ్ డ్రైయిన్ పనుల్లో జరుగుతున్న జాప్యం విష యంలో పాలకవర్గం పట్టించుకోవడం లేదనే ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు పూర్తి చేయకున్నా కనీసం దుర్వాసన సమస్యను తీర్చిన చాలు అని స్థానికులు వేడుకుంటున్నారు. షాపు ల ఎదుట కాల్వను తవ్వి వదిలివేయడంతో నడిచిపోయేందుకు ఇబ్బందిగా మారిందని వాపోతు న్నారు. కాలు అదుపుతప్పితే ప్రమాదానికి గురి కావాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాలని, అసంపూర్తిగా మిగి లిన పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికు లు కోరుతున్నారు.