శనివారం ఉదయం డ్రెయినేజీలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన మున్సిపల్ సిబ్బంది (ఇన్‌సెట్) బాలుడు జమీర్ మృతదేహం
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): శుక్రవారం రాత్రి కురిసిన జోరువాన ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వర్షం నీటికి నిజామాబాద్ నగరంలోని పలు వీధులు జలమయమయ్యాయి. మురికి కాలువలు ఉప్పొంగి పొర్లాయి. తల్లి చేతిలో నుంచి జారిపోయిన ఓ బాలుడు డ్రెయినేజీలో కొట్టుకుపోయాడు. జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రియాజ్ దగ్గరి బంధువు ఒక రు మృతి చెందటంతో అంత్యక్రియల కో సం మూడు రోజుల క్రితం భార్య పిల్లల తో కలిసి ఇక్కడికి వచ్చాడు. భారీ వర్షం కురియటంతో వారున్న ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో రియాజ్ భార్య తన కొడుకు జమీర్ (7)ను తీసుకుని సమీపంలోని మరో ఇంట్లో పడు కునేందుకు బయలు దేరింది. పొంగి ప్రవహిస్తున్న డ్రైనేజీని ఇద్దరూ దాటుతుండగా జమీర్ ఆమె చేతిలో నుంచి జారిపోయి డ్రైనేజీలో కొట్టుకుపోయాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న బంధువులు వెం టనే డ్రెయినేజీలో దిగి గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. చీకటిగా ఉండ టంతో ఫలితం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్, రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. సమారు పది గంటల పాటు వెదికారు. భారీ వర్షం నీటితో వరద ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలకు అ టంకాలు కలిగాయి. వరద తగ్గటంతో అధికారులు బాలుడు పడిన చోటు నుంచి మరోమారు గాలింపు చేపట్టారు. చివరకు బాలుడు పడిన చోటుకు అర కిలోమీటరు దూరంలో చెట్టుకు తట్టుకుని బాలుడి శవం కనిపించింది. మున్సిపల్ సిబ్బంది బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. రియాజ్ దంపతులకు జమీర్‌తో పాటు మరో కొడుకు, కూతురు ఉన్నారు. జమీర్ నాందేడ్‌లో ఉర్డూ మీడియం మూడో తరగతి చదువుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. బాలుడి అంత్యక్రియలు నిజామాబాద్‌లోనే నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందే అవకాశం లేక పోవటంతో రూ. 25 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఎమ్మెల్యే నాందేడ్ అధికారులతో ఫోన్‌లో సంప్రదించి బాలుడి కుటుంబానికి కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment