ఇంకెన్నాళ్లీ అవస్థలు ? | As the controversy over changing the side of the drain works | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లీ అవస్థలు ?

Published Thu, Jul 14 2016 12:40 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

As the controversy over changing the side of the drain works

వివాదంగా మారుతున్న సైడ్  డ్రెయిన్ పనులు
మురుగునీటితో ఇక్కట్లు పడుతున్న ప్రజలు
పట్టించుకోని పాలకవర్గం

 
అవి వర్షపు నీళ్లు కాదు..    ఇళ్ల నుంచి వచ్చే వృథా నీరు కాదు.. మలమూత్రాలతో కూడిన కంపు. డ్రెయినేజీల్లో కాకుండా ప్రధాన రోడ్డుపై పారుతుండడంతో స్థానికులు, బాటసారులు దుర్వాసన భరించలేక పోతున్నారు. పైగా వాహనాల రాకపోకలతో మీదపడుతుండడంతో తట్టుకోలేక పోతున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ డ్రెయినేజీ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు ‘ఈ కంపు ఇంకెన్నాళ్లు’ అని ఆవేదన చెందుతున్నారు.
 
 
పరకాల:  నగర పంచాయతి పరిధిలో 2013-14 సంవత్సరంలో ప్రధాన రోడ్డు వెంట సైడ్ డ్రైయి న్ పనులను చేపట్టారు. అయితే అందులో కొన్ని పనులు అసంపూర్తిగా మారడంతో ఏడాది క్రింద ట మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి రూ.31లక్షలతో రీటెండర్ నిర్వహించారు. ఇందు లో భాగంగా ఆంధ్రబ్యాంకు వద్ద రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైయిన్, హుజురాబాద్ రోడ్డులోని శ్రీజ మెడికల్ స్టోర్స్ నుంచి పోచమ్మగుడికి ఇరువైపులా పనులు చేపట్టాలని కోరారు. ఆంధ్రబ్యాం కు వద్ద మాత్రమే పనులను పూర్తి చేసి మిగిలిన చోట పనుల నిర్మాణం చేపట్టలేదు.

కంపు కొడుతున్న ప్రధాన రోడ్డు
సైడ్ డ్రైయిన్  నిర్మాణ పనులు చేపట్టడానికి శ్రీజ మెడికల్ స్టోర్స్ నుంచి డాక్టర్ రాజేందర్‌రెడ్డి పిల్ల ల ఆస్పత్రి వరకు కాల్వను తవ్వారు. ఈ దారిలో 20 మంది గృహాల వారు నిబంధనల ప్రకారం కాకుండా 50 ఫీట్లు ఎక్కువగా రోడ్డుపై ఉండడం తో వాటిని కూల్చివేసుకోవాలని అధికారులు నో టీసులు అందించారు. అందులో 16మంది సెట్‌బ్యాక్ అయ్యి పునఃనిర్మాణాలు చేసుకోగా మిగిలి న వారు మాత్రం తొలగించలేదు. దీంతో  మిగ తావారు  మమ్మల్ని బలవంతంగా ఇళ్లను తొల గించేలా చేసి ఇప్పుడు కొందరికి మినహాయింపు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫలితంగా ఈ పనులు తరుచూ వివాదస్పదమవుతున్నాయి. ఇదిలా ఉండగా కాల్వను తవ్వి వదిలి వేయడం తో కంపునీళ్లు రోడ్డుపైనే పారుతున్నాయి. ఈ నీటిలో నుంచే బాటసారులు నడిచిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అదేసమయంలో వాహనాలు వచ్చిపోతుండడంతో మురుగునీరు మీద పడుతుండ డం వల్ల ఇక్కట్లు పడాల్సి వస్తోంది.  
 
పట్టించుకోని పాలకవర్గం
 సైడ్ డ్రైయిన్ పనుల్లో జరుగుతున్న జాప్యం విష యంలో పాలకవర్గం పట్టించుకోవడం లేదనే ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులు పూర్తి చేయకున్నా కనీసం దుర్వాసన సమస్యను తీర్చిన చాలు అని స్థానికులు వేడుకుంటున్నారు.  షాపు ల ఎదుట కాల్వను తవ్వి వదిలివేయడంతో నడిచిపోయేందుకు ఇబ్బందిగా మారిందని వాపోతు న్నారు. కాలు అదుపుతప్పితే ప్రమాదానికి గురి కావాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాలని, అసంపూర్తిగా మిగి లిన పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికు లు కోరుతున్నారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement