పొలంలో ఉరేసుకున్న అన్నదాత...
కళ్లముందే పంట ఎండిపోవడంతో కలత చెందిన ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా గోపాలపేటలో జరిగింది. గ్రామానికి చెందిన పానుగంటి పెంటయ్య(62) తనకున్న పొలంలో అప్పులు చేసి వరి, మొక్క జొన్న పంటవేశాడు. వర్షభావంతో పంట ఎండిపోయింది. ఎండిన పంట చూసి.. కలత చెందిన రైతు బుధవారం ఉదయం తన పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.