Dubagunta rosamma
-
సారా వ్యతిరేక ఉద్యమకారిణి రోశమ్మ కన్నుమూత
ఒక పోరాటం ముగిసింది. రోశమ్మ చనిపోయింది. జనం వెతల నుంచి పుట్టుకొచ్చే ఉద్యమాలకు సిద్ధాంతాలతో పనిలేదని రుజువుచేసింది. కష్టపడి సాధించుకున్న మద్యరహిత సమాజం.. మళ్లీ 'మందు' బాట పట్టడమూ చూసింది. బాధపడిండి. ఇప్పుడు శాశ్వత నిద్రలోకి జారుకుంది. మందుబాబుల చేతిలో రమ్య లాంటి చిన్నారులు చనిపోతున్న తరుణంలో.. రోశమ్మ మళ్లీ పుట్టాలని కోరుకోవడం అవసరమేమో! ► కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఉద్యమనేత ► తీవ్ర అస్వస్థతతో ఆదివారం ఉదయం తుదిశ్వాస ► దూబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం ► ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించిన ఉద్యమం నెల్లూరు: సారా వ్యతిరేక ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మ ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంటలో కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో వైద్యానికి దూరమయ్యారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు దూబగుంటలో సోమవారం ఉదయం 10 గంటలకు జరుగుతాయి. మద్యనిషేధ ఉద్యమ రూపకర్త 1990ల్లో సారా వ్యతిరేక ఉద్యమం ఉప్పెనగా మారడానికి రోశమ్మే కారణం. నెల్లూరు జిల్లాలోని దూబగుంట నుంచి ఆమె 1992లో పూరించిన సారా వ్యతిరేక ఉద్యమ శంఖం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. ఈ క్రమంలో ఆమెకెన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. సారా మాఫియా ఆగడాలు, పోలీసు కేసులు, పెద్దల బెదిరింపులెన్నింటినో తట్టుకుని ఉద్యమంలో ముందుకుసాగారు. జిల్లాలోనేగాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు. 1994నాటి ఎన్నికల సందర్భంగా టీడీపీ అధికారంలోకొస్తే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని ఆనాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ ప్రకటించడానికి రోశమ్మ ఉద్యమమే ప్రధాన కారణం. ఇచ్చినమాట ప్రకారం 1995 జూన్ 1నుంచి సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఎన్టీఆర్ తొలి సంతకం చేశారు. ఈ నిషేధం 1997 మార్చి వరకు కొనసాగింది. చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టాక మద్యనిషేధాన్ని ఎత్తివేశారు. దీనిపై ఆమె పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అందని సాయం రోశమ్మది నిరుపేద కుటుంబం. ప్రభుత్వం నుంచి ఆమెకెలాంటి సాయమందలేదు. కావలి వెంగళరావునగర్‌లో రూ.లక్ష అప్పుచేసి కట్టుకున్న సొంత ఇంటినిసైతం అభివృద్ధి పేరుతో పాలకు లు కూల్చివేశారు. కనీసం ప్రత్యామ్నాయం చూపలేదు. ఈ నేపథ్యంలో ఇంటికోసం చేసిన అప్పు తీర్చుకోలేక ఆమె తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృద్ధాప్య పింఛన్నుసైతం కొన్నాళ్లపాటు ఆపేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు. ఇక అవసాన దశలో ఆమె పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఆమెకు బతుకుభారంగా మారింది. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు. కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న ఆమెకు అన్నివిధాలా సహాయ సహకారాలందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కంటితుడుపు చర్యగా కొద్దికాలం డయాలసిస్ చేయించి వదిలేసింది. సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆమె మృత్యువుకు దగ్గరైంది. మహిళాలోకం నడుంబిగిస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదని నిరూపించారు దూబగుంట రోశమ్మ మృతికి జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: సారా వ్యతిరేక ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మద్యం మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నవేళ మహిళాలోకం నడుం బిగిస్తే ప్రభుత్వాలు దిగిరాక తప్పదని రోశమ్మ పోరాటం నిరూపించిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యనిషేధాన్ని కోరుతూ నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ 1990 ప్రాంతంలో ప్రారంభించిన మహోద్యమం తెలుగుజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన అధ్యాయమన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టే మహోద్యమాలను గ్రామాల నుంచి నిర్మించవచ్చని ఆమె నిరూపించార న్నారు. రోశమ్మకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆదర్శప్రాయురాలు: వెంకయ్యనాయుడు సాక్షి, విజయవాడ/అమరావతి: రోశమ్మ మృతికి కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రోశమ్మ మహిళాలోకానికే ఆదర్శప్రాయురాలని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు. ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చారు. -
దూబగుంట రోశమ్మ మృతిపట్ల జగన్ సంతాపం
దూబగుంట రోశమ్మ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మద్యం మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న వేళ మహిళాలోకం నడుం బిగిస్తే ప్రభుత్వాలు దిగి రాక తప్పదని రోశమ్మ పోరాటం నిరూపించిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని కోరుతూ నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ 1990 ప్రాంతంలో ప్రారంభించిన మహోద్యమం తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన అధ్యాయం అని జగన్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే మహోద్యమాలను గ్రామాల నుంచి నిర్మించవచ్చని రోశయ్య నిరూపించారని ఆయన అన్నారు. రోశమ్మకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. -
సారా ఉద్యమనేత రోశమ్మ కన్నుమూత
-
దూబగుంట రోశమ్మకు పింఛన్ మంజూరు
-
దూబగుంట రోశమ్మకు పింఛన్ మంజూరు
నెల్లూరు: నాటి సారా వ్యతిరేకోద్యమం సారధి నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దూబగుంట గ్రామానికి చెందిన దూబగుంట రోశమ్మకు రాష్ట్రప్రభుత్వం పింఛన్‌ను పునరుద్ధరించింది. పింఛన్ జాబితా నుంచి రోశమ్మ పేరు తొలగించడంపై సాక్షిలో వచ్చిన ప్రత్యేక కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఆమెకు పింఛన్ మంజూరు చేసింది. వచ్చే నెల నుంచి రోశమ్మకు పింఛన్ అందజేస్తామని కలిగిరి ఎంపిడిఓ చెప్పారు. ప్రస్తుతం 80 ఏళ్లు నిండిన రోశమ్మకు ఎన్టీయార్ సీఎంగా ఉన్నప్పుడు పింఛను మంజూరైంది. ఇన్నాళ్లూ నిరాటంకంగా వచ్చింది. కానీ ఇపుడు నిలిచిపోయింది. కారణం ఆమెకు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉందట!! తనకు ఐదెకరాలు లేనేలేదని, ఉంటే అదెక్కడుందో చూపిస్తే చాలు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదని రోశమ్మ మొత్తుకుంటున్నా ఎవరూ వినలేదు. గతంలో తనకు వృద్ధాప్య పింఛన్ వచ్చేదని, ఇప్పుడు వితంతు పింఛన్‌కూ తాను అర్హురాలినేనని రోశమ్మ చెప్పారు. కిడ్నీలు పాడయి, నడవలేని స్థితిలో ఉన్న తనకు పెన్షన్ ఎపుడిస్తారో తెలియటం లేదని రోశమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.రోశమ్మ పరిస్థితిని వివరిస్తూ సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, వెబ్సైట్ ప్రత్యేక కథనాలు ఇచ్చాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆమెకు పింఛన్ మంజూరు చేసింది. ** -
ఆమెకు ఏ అర్హత లేదని ఫించన్ ఆపేసారు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఫించన్లపై టీడీపీ సర్కారు అన్యాయంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దూబగుంట రోశమ్మ ఏపీకే ఆదర్శమని, ఏ అర్హత లేదని ఆమె ఫించన్ ఆపేసారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇందుకు దివాన్‌చెరువు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక వార్డులో మాత్రమే నెగ్గింది. గ్రామంలోని 16 వార్డులలో 12 వార్డులలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు గెలుపొందారు. -
పించను జాబితా నుంచి దూబగుంట రోశమ్మ పేరు తొలగింపు!
నెల్లూరు: నాటి సారా వ్యతిరేకోద్యమం సారధి దూబగుంట రోశమ్మ పేరుని పించను జాబితా నుంచి ఏపి రాష్ట్రప్రభుత్వం తొలగించింది. పించనుకు అర్హురాలు అయినప్పటికీ తమ తల్లి పేరుని తొలగించారని ఆమె కుమారుడు చెప్పారు. తన తల్లి పేరు ఎందుకు తొలగించారని ఆమె కుమారుడు అధికారులను నిలదీశారు. తాము ఏమీ చేయలేమని, కమిటీ నివేదిక ప్రకారం తొలగించినట్లు వారు చెప్పారు. ఫిర్యాదు చేసుకోమని కూడా చెప్పారు. దూబగుంట రోశమ్మ పేరు వింటేనే ఉద్యమకారులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1993 ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున సాగిన సారా వ్యతిరేకోద్యమానికి నెల్లూరు జిల్లా కలికిరి మండలం దూబగుంట అనే కుగ్రామంలో శ్రీకారం చుట్టిన ధీరవనిత ఆమె. అప్పట్లో ఏ గ్రామంలోనైనా సరే సారా అమ్ముతున్నట్లు కనపడితే చాలు, మహిళలు అపర కాళికలుగా మారి దుకాణాలను ధ్వంసం చేసేవారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆమెను సన్మానించారు. గిన్నీస్ బుక్ రికార్డు కూడా దక్కింది. ఆమె ఉద్యమ ఫలితంగానే అప్పట్లో ఎన్టీఆర్ తాను గెలిచిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని విధించారు. అప్పట్లో ఆమెకు ఎంతో సాయం చేస్తామని పాలకులు హామీలిచ్చారు. కాలక్రమంలో వాటిని మరిచిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధం కాస్తా ఎత్తివేశారు. సారాపై ప్రజల్లో చైతన్యం నింపి, ఊరు పేరును ఇంటి పేరుగా మార్చుకున్న ఆమె వయసు 86 ఏళ్లు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో, ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి రోశమ్మకు పించను నిలిపివేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ** -
సారాపై ఉద్యమించిన వ్యక్తికి.. పెన్షన్ కట్!