దూబగుంట రోశమ్మకు పింఛన్ మంజూరు | AP Government sanction Pension to Rosamma | Sakshi
Sakshi News home page

దూబగుంట రోశమ్మకు పింఛన్ మంజూరు

Published Thu, Oct 9 2014 8:26 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

దూబగుంట రోశమ్మ

దూబగుంట రోశమ్మ

నెల్లూరు: నాటి సారా వ్యతిరేకోద్యమం సారధి నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దూబగుంట గ్రామానికి చెందిన  దూబగుంట రోశమ్మకు రాష్ట్రప్రభుత్వం  పింఛన్ను పునరుద్ధరించింది. పింఛన్ జాబితా నుంచి రోశమ్మ పేరు తొలగించడంపై సాక్షిలో వచ్చిన ప్రత్యేక కథనానికి ప్రభుత్వం స్పందించింది.  ఆమెకు పింఛన్ మంజూరు చేసింది. వచ్చే నెల నుంచి రోశమ్మకు  పింఛన్ అందజేస్తామని  కలిగిరి ఎంపిడిఓ చెప్పారు.

ప్రస్తుతం 80 ఏళ్లు నిండిన రోశమ్మకు ఎన్టీయార్ సీఎంగా ఉన్నప్పుడు పింఛను మంజూరైంది. ఇన్నాళ్లూ నిరాటంకంగా వచ్చింది. కానీ ఇపుడు నిలిచిపోయింది. కారణం ఆమెకు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉందట!! తనకు ఐదెకరాలు లేనేలేదని, ఉంటే అదెక్కడుందో చూపిస్తే చాలు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదని రోశమ్మ మొత్తుకుంటున్నా ఎవరూ వినలేదు.  

గతంలో తనకు వృద్ధాప్య పింఛన్ వచ్చేదని, ఇప్పుడు వితంతు పింఛన్‌కూ తాను అర్హురాలినేనని రోశమ్మ చెప్పారు.  కిడ్నీలు పాడయి, నడవలేని స్థితిలో ఉన్న తనకు పెన్షన్ ఎపుడిస్తారో తెలియటం లేదని రోశమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.రోశమ్మ పరిస్థితిని  వివరిస్తూ సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, వెబ్సైట్  ప్రత్యేక కథనాలు ఇచ్చాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆమెకు పింఛన్ మంజూరు చేసింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement