Dukes
-
కోవిడ్ విపత్తువేళ డ్యూక్స్ ఔదార్యం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 విపత్తు వేళ బిస్కెట్స్, వేఫర్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ డ్యూక్స్ ఇండియా ఔదార్యం చూపింది. పీఎం కేర్స్ ఫండ్‌కు ఉద్యోగులు ఇప్పటికే ఒకరోజు వేతనం అందించారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బిస్కెట్లను సరఫరా చేశారు. వలస కార్మికులకు ఆహారం అందించడం, రక్తదానం వంటి కార్యక్రమాలను చేపట్టారు. (చదవండి: ఏజీఆర్ తీర్పు- ఎయిర్టెల్ జోరు) అలాగే విపత్తు నుంచి బయటపడతామన్న సందేశంతో విభిన్న భాషల మేళవింపుతో 14 మంది కళాకారులచే రూపొందిన ‘వాయిసెస్ యునైటెడ్’ పాటకు కంపెనీ స్పాన్సర్ చేసింది. ఈ పాట ద్వారా నిధులు సమీకరించి.. కోవిడ్–19 సంక్షోభానికి గురైన 2,00,000 కుటుంబాలకు సాయం చేస్తారు. తద్వారా 3,00,000 మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరం కాకుండా ఉంటారన్నది సంస్థ భావన అని డ్యూక్స్ ఇండియా ఎండీ రవీందర్ అగర్వాల్ తెలిపారు. (చదవండి: పీఎం కేర్స్ నిధుల మళ్లింపు అనవసరం) -
‘బంతులు బాగుంటే చాలు’
న్యూఢిల్లీ: బౌలర్లు స్వింగ్ రాబట్టేందుకు బంతి నాణ్యంగా ఉంటే సరిపోతుందని, ఉమ్మి (సలైవా) వాడాల్సిన అవసరమే లేదని డ్యూక్స్ క్రికెట్ బంతుల తయారీదారు, బ్రిటీష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ యజమాని దిలీప్ జజోడియా అన్నారు. బంతి మెరుపు కోసం సలైవాను వాడకుంటే బౌలర్లు తేలిపోతారనే వాదనల్లో నిజం లేదని చెప్పారు. ‘తొందరగా ఆకారం కోల్పోయే కూకా బుర్రా, ఎస్జీ బంతులు వాడే ఆస్ట్రేలియా, భారత్ లాంటి దేశాలే సలైవాకు ప్రత్యామ్నాయం కోరుతున్నాయి. స్వింగ్ రాబట్టాలంటే బంతికి మెరుపు మాత్రమే సరిపోదు. అది సరైన ఆకారంలో, తగిన సీమ్‌తో, గట్టిగా ఉండటంతో పాటు... బౌలర్‌కు నైపుణ్యం కూడా ఉండాలి. ఇలాంటి లక్షణాలు లేని బంతుల్ని వాడినప్పుడు మాత్రమే స్వింగ్ కోసం లాలాజలం, కృత్రిమ పదార్థాలపై ఆధారపడాల్సి ఉంటుంది’ అని దిలీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అత్యంత నాణ్యంగా ఉండే డ్యూక్స్ బంతులతో ఉమ్మి వాడకుండానే స్వింగ్ రాబట్టొచ్చని ఆయన తెలిపాడు. ‘మా బంతులకు వాటర్ ప్రూఫ్ లక్షణం కల్పించేందుకు వీలుగా తయారీలో లెదర్‌కు గ్రీజ్‌ను వాడతాం. దీంతో బౌలర్ బంతిని ప్యాంట్‌కు రుద్దినప్పుడు ఏర్పడే ఘర్షణ కారణంగా బంతికి మెరుపు వస్తుంది. ఉమ్మిని వాడటం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది తప్ప ఉమ్మి లేకుంటే బంతికి మెరుపు రాదనడం అబద్ధం’ అని ఆయన వివరించారు. ఐసీసీ పేర్కొన్నట్లు స్వింగ్ కోసం బౌలర్లు చెమట ఉపయోగిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విండీస్‌తో సిరీస్ కోసం ఇంగ్లండ్ బౌలర్లు ప్రస్తుతం డ్యూక్స్ బంతులతోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. -
డ్యూక్స్ ‘బటర్ ఫ్లేవర్డ్’ వాఫీ
హైదరాబాద్: రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ‘బటర్ ఫ్లేవర్డ్’ వాఫీ ని మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ క్రీమీ, క్రంచ్ వాఫీ వినియోగదారులకు కొత్త ఫ్లేవర్‌తో మంచి అనుభూతిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవిందర్ అగర్వాల్ ఆలోచనలకు అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త ఫ్లేవర్లను ఆవిష్కరించడానికి రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్యూక్స్ ముందుంటుందని పేర్కొంది. చాకొలెట్స్, వాఫీలు, కుకీస్, బిస్కెట్లసహా పలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా సంస్థ కీలకపాత్ర పోషిస్తోందని వివరించింది. ‘‘క్రీమీ వాఫర్ విభాగం మార్కెట్లో రవి ఫుడ్స్ వాటా దాదాపు రూ.45,000 కోట్లు. ఏడాదికి 10 శాతం నుంచి 12 శాతం వృద్ధి నమోదుచేసుకుంటోందని ఎండీ అగర్వాల్ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. -
పింక్ బంతుల కోసం బీసీసీఐ చర్చలు
న్యూఢిల్లీ: డే నైట్ టెస్టులకు వినియోగించే పింక్ బంతుల సరఫరా కోసం బీసీసీఐ... ప్రముఖ బ్రిటిష్ కంపెనీ ‘డ్యూక్’తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది చివర్లో భారత్.. న్యూజిలాండ్‌తో జరగనున్న డేనైట్ టెస్టుకు వీటిని ఉపయోగిస్తామని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. అయితే బంతి ఉపయోగం, మన్నిక వంటి చాలా అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు ఎక్కువగా ‘ఎస్జీ టెస్టు’ బంతులను వాడుతుండగా, ఇంగ్లండ్‌లో ‘డ్యూక్’, విండీస్‌తో పాటు ఇతర దేశాల్లో ‘కూకాబురా’ బాల్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే కూకాబురాతో పోలిస్తే డ్యూక్ బంతుల్లో సీమ్ కాస్త మందంగా ఉండటం భారత బౌలర్లకు బాగా లాభిస్తుందని బీసీసీఐ సాంకేతి కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ చెప్పడంతో బోర్డు దీనిపై దృష్టిపెట్టింది. మరోవైపు భారత్‌తో డేనైట్ టెస్టు ఆడేందుకు కివీస్ సుముఖంగా లేదని వస్తున్న వార్తలను షిర్కే తోసిపుచ్చారు. కోచ్ రేసులో 21 మంది.. భారత జట్టు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 57 మందిలో 21 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు షిర్కే తెలిపారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సలహా కమిటీకి వారి జాబితాను పంపుతామని, తుది నిర్ణయంపై కమిటీ సూచనలిస్తుందన్నారు. ఈనెల 22లోపు కమిటీ రిపోర్ట్‌ను అనురాగ్ ఠాకూర్ సమర్పిస్తుంది. కమిటీ మాజీ సెలక్టర్ సంజయ్ జగ్దలే సహకారాలు అందించనున్నారు.