Dull Arrears
-
బ్యాంక్‌లపై కరోనా పిడుగు
ముంబై: కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం కావడం.... మన దేశపు బ్యాంక్‌లపై ఈ ఏడాది తీవ్రమైన ప్రభావమే చూపనున్నది. మొండి బకాయిలు 2 శాతం, వడ్డీ వ్యయాలు 1.3 శాతం మేర పెరుగుతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తాజా నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుందని, మరింత కాలమే ఈ వైరస్ కల్లోలం కొనసాగుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయని ఈ సంస్థకు చెందిన క్రెడిట్ ఎనలిస్ట్ గావిన్ గన్నింగ్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ► ఈ ఏడాది ఆర్థిక రంగ కష్టాలు అంచనాలను మించి ఉంటాయి. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. దీంతో ఆర్థిక స్థితిగతులు మరింత అస్తవ్యస్తమవుతాయి. ఇది బ్యాంక్ రుణాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. ► ప్రపంచ వ్యాప్తంగా బ్యాంక్‌ల వడ్డీ వ్యయాలు అదనంగా 30,000 కోట్ల డాలర్లు, మొండి బకాయిలు 60,000 కోట్ల డాలర్ల మేర పెరుగుతాయి. ► కరోనా కల్లోలం కారణంగా మొదటి దశలో కార్పొరేట్ రంగమే అధికంగా కుదేలైంది. బ్యాంకింగ్ రంగానికి సెగ పెద్దగా తగల్లేదు. ఈ వైరస్ ఉధృతి నానాటికీ తీవ్రమవుతుండటంతో బ్యాంకింగ్ రంగంపై ప్రభావం తీవ్రంగానే ఉండనున్నది. ► ఈ ఏడాది చైనా బ్యాంక్‌ల మొండి బకాయిలు కూడా 2 శాతం మేర పెరుగుతాయి. వడ్డీ వ్యయాలు మాత్రం 1 శాతం మేర మాత్రమే పెరుగుతాయి. -
ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.2,410 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.3,801 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా, వాటికి కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు కూడా పెరిగాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,403 కోట్ల నుంచి రూ.5,924 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,639 కోట్ల నుంచి రూ.1,458 కోట్లకు తగ్గిందని తెలిపింది. తగ్గిన మొండి బకాయిలు.... మొండి బకాయిలు తగ్గాయని బ్యాంక్ వెల్లడించింది. గత క్యూ1లో 30.78%గా ఉన్న మొండి బకీలు ఈ క్యూ1లో 29.12%కి తగ్గాయి. విలువ పరంగా, స్థూల మొండి బకాయిలు రూ.57,807 కోట్ల నుంచి రూ.51,658 కోట్లకు తగ్గాయని తెలిపింది. నికర మొండి బకాయిలు 18.76% నుంచి 8.02%కి చేరినట్లు పేర్కొంది. పెరిగిన కేటాయింపులు..... గత క్యూ1లో రూ.4,603 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ1లో రూ.7,009 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు, ఇతరాలకు కూడా కలుపుకొని మొత్తం కేటాయింపులు రూ.5,236 కోట్ల నుంచి రూ.6,332 కోట్లకు చేరాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఈ బ్యాంక్‌లో 51% వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆర్తిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 1.3 శాతం లాభంతో రూ. 27.15 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐకి మొండి బకాయిల సెగ
క్యూ3లో రూ. 3,265 కోట్లు; 14 % అప్ ⇒ 3.4 శాతానికి ఎగబాకిన మొండి బకాయిలు... ⇒ భారీగా క్షీణించిన షేరు ధర... ముంబై: ప్రైవేటు రంగ బ్యాకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలతోపాటు మొండిబకాయిలు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి(2014-15, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,265 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,872 కోట్లతో పోలిస్తే లాభం 13.7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా బీమా, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్ తదితర అనుంబంధ సంస్థల మెరుగైన పనితీరుతో లాభాలు పుంజుకున్నాయి. ఇక మొత్తం ఆదాయం కూడా క్యూ3లో రూ.20,543 కోట్ల నుంచి రూ.23,054 కోట్లకు వృద్ధి చెందింది. 12.2 శాతం పెరిగింది. స్టాండెలోన్‌గానూ 14 శాతం అప్... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి(సాండెలోన్) ఐసీఐసీఐ నికర లాభం క్యూ3లో 14.1 శాతం వృద్ధితో రూ.2,889 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,532 కోట్లు. మొత్తం ఆదాయం రూ.14,226 కోట్ల నుంచి రూ.15,526 కోట్లకు పెరిగింది. 8.8 శాతం వృద్ధి నమోదైంది. మొండిబకాయిల సెగ... ఈ డిసెంబర్ క్వార్టర్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు(ఎన్పీఏ) వెంటాడాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 3.4 శాతానికి ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఈ పరిమాణం 3.05 శాతమే. మరోపక్క, నికర ఎన్పీఏలు కూడా 1.76 శాతం నుంచి 1.9 శాతానికి పెరిగాయి. ఇక మొండిబకాయిలు, కంటింజెన్సీల కోసం ప్రొవిజనింగ్ కేటాయింపులు రూ.695 కోట్ల నుంచి రూ.980 కోట్లకు ఎగిశాయి. కాగా, ఈ క్యూ3లో కొత్తగా రూ.2,279 కోట్ల విలువైన రుణాలు మొండిబకాయిలుగా మారినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇందులో రూ.776 కోట్లు గతంలో పునర్వ్యవస్థీకరించిన రుణాలేనని కూడా తెలిపింది. కాగా, అక్టోబర్-డిసెంబర్ వ్యవధిలో రూ.1,755 కోట్ల రుణాలను బ్యాంక్ పునర్వ్యవస్థీకరిచింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం రూ.2,300 కోట్లుగా ఉంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ క్యూ3లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 13 శాతం పెరిగి రూ.4,812 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) కూడా స్వల్ప పెరుగుదలతో 3.46 శాతంగా నమోదైంది. ⇒ రిటైల్ రుణాల్లో 26 శాతం వృద్ధి దీనికి దోహదం చేసింది. ⇒ సబ్సిడరీల నుంచి అధిక డివిడెండ్ల కారణంగా ఇతర ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.357 కోట్ల నుంచి రూ.538 కోట్లకు పెరిగింది. ఫీజుల రూపంలో ఆదాయం 6 శాతం పెరిగి రూ.443 కోట్లకు చేరింది. ⇒ సబ్సిడరీల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాభం డిసెంబర్ త్రైమాసికంలో రూ.428 కోట్ల నుంచి రూ.462 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ.76 కోట్ల నుంచి రూ.176 కోట్లకు వృద్ధి చెందింది. ⇒ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్(మ్యూచువల్ ఫండ్) సంస్థ లాభం 43 శాతం పెరగగా.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం రెట్టింపై రూ.76 కోట్లకు చేరింది. ⇒ క్యూ3లో కార్పొరేట్ రంగానికి రుణాల్లో 4 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం రుణాల్లో ఈ రంగానికి రుణాల వాటా 29 శాతానికి తగ్గింది. రిటైల్ రుణాల వాటా 41 శాతానికి ఎగబాకింది. కాగా, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నేపథ్యంలో కార్పొరేట్ల నుంచి రుణ డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. ఆర్థిక వ్యవస్థలో చాన్నాళ్లుగా కొనసాగుతూవస్తున్న మందగమన పరిస్థితులవల్లే మొండి బకాయిలు పెరిగేందుకు దారితీస్తోంది. ఫలితంగా పునర్వ్యవస్థీకరించిన రుణాలు కూడా మళ్లీ ఎన్పీఏలుగా మారుతున్నాయి. ఇదేవిధమైన దోరణి మరో 2-3 త్రైమాసికాలపాటు కొనసాగవచ్చు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడితే.. కంపెనీల పనితీరు మెరుగుపడటమేకాకుండా.. మొండి బకాయిల సమస్యకు కూడా అడ్డుకట్టపడుతుంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం పరిశ్రమకు పోత్సాహకరమైన చర్య. మా బీమా సబ్సిడరీలో పెట్టుబడులకు సంబంధించి ఐపీఓ సహా ఇతరత్రా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. వడ్డీరేట్లు దిగొస్తాయని రుణగ్రహీతలు భావిస్తున్నారు. అయితే, మా బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు ఎప్పుడనేది వెల్లడించలేను. అసెట్స్ లయబిలిటీ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ షేరు ధర క్రాష్... మొండి బకాయిల పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర భారీగా క్షీణించింది. శుక్రవారం బీఎస్ఈలో ఒకానొకదశలో 6.5 శాతం మేర దిగజారి రూ.355కు పడిపోయింది. చివరకు 4.95 శాతం నష్టంతో రూ.361 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క రోజులోనే బ్యాంక్ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్)రూ.10,839 కోట్లు ఆవిరై.. రూ.2,09,208 కోట్లకు తగ్గిపోయింది. -
బిల్లు కట్టకపోతే.. కరెంటు కట్
* మేజర్ పంచాయతీల్లో పెరుగుతున్న మొండి బకాయిలు * సర్పంచ్‌లకు నోటీసులు ఇస్తున్న ఈపీడీసీఎల్ అధికారులు * తక్షణం చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక సాక్షి, రాజమండ్రి : జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో రూ.కోట్లలో పేరుకుపోతున్న మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఈపీడీసీఎల్ సన్నద్ధమవుతోంది. నాలుగు రోజులుగా వివిధ మేజర్ పంచాయతీలకు నోటీసులు జారీ చేస్తూ, బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లాలోని పంచాయతీల్లో రోజుకు సుమారు 10 లక్షల యూనిట్ల వరకూ చెల్లింపులు లేకుండా వినియోగిస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించిన ఈపీడీసీఎల్‌కు ఈ బకాయిలు గుదిబండలుగా మారుతున్నాయి. దీంతో ఎలాగైనా వీటిని రాబట్టేందుకు ఆ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. బకాయిల తీరిలా.. జిల్లాలో 1100 పైగా పంచాయతీలుండగా, వాటిల్లో సుమారు 1200 సర్వీసులున్నాయి. వీటిలో 120 వరకూ మేజర్ పంచాయతీల్లోనే ఉన్నాయి. మొత్తం జిల్లాలోని పంచాయతీల్లో వీధిదీపాలు, మంచి నీటి పథకాలకు వినియోగించే విద్యుత్తు బిల్లు నెలకు సుమారు రూ.2 కోట్లు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా మైనర్ పంచాయతీలు బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి. 2009 నుంచి మొత్తం పంచాయతీల నుంచి వీధిలైట్లు, మంచి నీటి పథకాలకు కలిపి ఇప్పటివరకూ సుమారు రూ.70 కోట్లు పైగా విద్యుత్తు శాఖకు రావాల్సి ఉంది. వీటిలో మేజర్ పంచాయతీల వాటా రూ.12 కోట్లు పైమాటేనని అధికారులు చెబుతున్నారు. ఒక్క అమలాపురం డివిజన్‌లోనే మేజర్ పంచాయతీల విద్యుత్ బకాయిలు సుమారు రూ.6 కోట్లు ఉండడంతో, వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కోనసీమలోని పంచాయతీల సర్పంచ్‌లకు ఆయా ప్రాంతాల రెవిన్యూ విభాగం అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామని అందులో స్పష్టం చేస్తున్నారు.