టీమిండియా కోచ్‌గా సచిన్
న్యూఢిల్లీ: ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఇప్పటి వరకు భారత టీం కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ స్థానంలో ఎవరు వస్తారోనన్న ఊహగానాలకు తెరబడింది. ఇన్నాళ్లు భారత క్రికెట్ చరిత్రను సువర్ణాక్షరాలతో ప్రపంచ శిలాఫలకంపై తొలి స్థానంలో లిఖించిన భారత క్రికెట్ లెజెండర్ సచిన్ టెండూల్కర్ ఇక టీం ఇండియాకు మార్గనిర్దేశకాలు చేయనున్నారు. ఆయన టీం ఇండియాను ముందుండి నడిపే బృహత్తర బాధ్యతను తీసుకోనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ సంఘం బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో నిర్ణయం వెలువరించింది.
సచిన్‌తో మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఈ విషయంపై ప్రత్యేకంగా సమావేశం అయిన బీసీసీఐ కార్యనిర్వాహక కమిటీ సచిన్‌పై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీమిండియా కొచ్‌గా సచిన్ సరైనవారని వారు నిర్ణయం తీసుకున్నారు. సచిన్‌ను కోచ్‌గా ఎంపిక చేయడంలో భారత క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారని, ఆయన పేరును తొలుత వారే ప్రతిపాదించారని కూడా తెలిసింది. బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్, టీం డైరెక్టర్ రవిశాస్ర్తిని కూడా సంప్రదించాకే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సచిన్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని, మూడేళ్లు ఈ బాధ్యతల్లో కొనసాగుతారని బీసీసీఐ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
'పలు ఆలోచనలు, సంప్రదింపులు జరిపాక నేను బీసీసీఐ సెక్రటరీ కలిసి వర్కింగ్ కమిటీ ముందు సచిన్ పేరును ఉంచాం. చివరకు ఆ కమిటీ ఆమోదించింది' అని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా తెలిపారు. ఫ్లెచర్‌కు ఎలాంటి కండిషన్లు, షరతులు, పరిమితులు ఉంటాయో అవన్నీ సచిన్‌కు ఉంటాయని తెలిపారు.
సచిన్ కోచింగ్ శైలి తిరిగి ఆయన కాలంనాటి రోజులు మనముందుకు తప్పకుండా తీసుకొస్తుందని ఈ సందర్భంగా ధోని తెలిపారు. కష్టపడేతత్వం, క్రమశిక్షణ, అంకితభావం, ఆటగమనం వీటన్నింటి విషయంలో సచిన్‌కు సచినే సాటి అని ధోని కొనియాడారు. సచిన్‌లాంటి జట్టే మళ్లీ సచిన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటుందని తెలిపాడు. సచిన్ 2015 ప్రపంచకప్ నేపథ్యంలో ఐసీసీకి బ్రాడ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.