dv subbarao
-
మాటలు చూపులు లేని ప్రేమ
జ్యోతిర్మయం ఓ రోజున మెహెర్‌బాబా తన శిష్యుల్ని అడిగారు, ‘కోపంతో ఉన్నప్పుడు మనుషులు ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకొంటూ ఎందుకు మాట్లాడతారు?’ అని. అందుకు శిష్యులు, ‘మనుషులు కోపంతో ఉన్నా రు కాబట్టి అట్లా అరుచుకొంటూ మాట్లాడతారు. కోపం వ్యక్తంచేసే పద్ధతి అది’ అని జవాబిచ్చారు. అది విని బాబా మళ్లీ అడిగారు, ‘అది సరే, మీరు అన్నట్లు వాళ్లు కోపాన్ని ఆ విధంగా అరుస్తూ వ్యక్తం చేయవచ్చు. కోపం వచ్చినప్పుడు పక్క పక్కనే కూర్చొ ని ఉన్న వ్యక్తులు కూడా ఒకరితో ఒకరు దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడినట్లు గట్టిగా గొంతు చించు కొని అరుస్తూ మాట్లాడతారు. మెల్లగా మాట్లాడినా వాళ్లకు వినపడుతుంది కదా? అలాంటప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడినట్లు అరుస్తూ మాట్లాడటం ఎందుకు?’ దానికి శిష్యు లు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. కానీ ఏదీ బాబాకు తృప్తి నివ్వలేదు. బాబాయే ఇలా చెప్పారు. ‘ఒక వ్యక్తికి ఇంకొక అతని మీద కోపం వచ్చినప్పుడు, కోపంతో ఉన్న వ్యక్తి హృదయం నుండి ఆ ఇంకొక అతను దూరంగా తొలగిపోతాడు. అప్పుడు ఇద్దరి మధ్య సన్నిహితత్వం పోయి మానసి కంగా దూరం అయిపోతారు. దానివల్ల ఇద్దరూ ఒకరి నుండి ఒకరు భౌతికంగా కూడా చాలా దూరంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఆ స్థితిలో వారు ఎంత దూరంగా ఉన్నట్లు అనుభూతి చెందితే అంత బిగ్గరగా గొంతు చించుకొని అరుస్తారు. ఎంత ఎక్కువ దూరం అయితే అంత ఎక్కువగా అరుస్తారు. ప్రేమ అదృశ్యమవుతుంది. ప్రేమ లోపించటంతో ఇవ తలి వాడు ఎంత పెద్దగా అరిస్తే అవతలివాడు తిరిగి అంత పెద్దగానూ అరుస్తాడు. కోపం తగ్గేటంత వరకు, అంటే హృదయాలు మళ్లీ దగ్గరయ్యేటంత వరకు, ప్రేమ మళ్లీ మొలకెత్తేటంత వరకు, ఆ అరుచుకోవటం అనేది అలా సాగుతూనే ఉంటుంది.’ ‘ఇప్పుడు మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని తీసుకోండి. పరస్పరం ప్రేమతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుకుంటారు?’ అని అడిగారు బాబా. ‘వారు నెమ్మదిగా, మృదువుగా మా ట్లాడుకుంటారు’ అని సమాధానం చెప్పారు శిష్యులు. బాబా ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంకా ఇలా అన్నారు. ‘పరస్పరం ప్రేమతో ఉన్నవారు చాలా నెమ్మ దిగా మృదువుగా మాట్లాడుకొంటారు. వారి ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే వారి కంఠస్వరం అంత శాంతంగా, అంత నెమ్మదిగా, అంత మృదు వుగా ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య అసలు మాటలే ఉండవు. మాటలాడే అవసరమే రాదు. అప్పుడు ఇద్దరూ ఒకరిని ఒకరు కేవలం చూసుకోవటంతోనే తృప్తిపడతారు. ప్రేమ ఇంకా పరాకాష్టకు చేరుకొన్నప్పుడు, ఆ చూసు కొనే అవసరం కూడా కలగదు.’ - దీవి సుబ్బారావు -
అధికార లాంఛనాలతో డీవీ అంత్యక్రియలు
విశాఖపట్నం: విశాఖపట్నం మాజీ మేయర్, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు డి.వి.సుబ్బారావు అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగోపాల్‌నాయక్ డీవీ ఇంటి వద్ద గౌరవ వందనం చేశారు. పోలీస్ బ్యాండ్ ఎస్కార్ట్‌తో పూలర థంపై డీవీ పార్థివ దేహాన్ని తరలించారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఆయన తనయుడు సోమయాజులు చితికి నిప్పంటించారు. అంత్యక్రియల సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా వందన సమర్పణ చేసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. పలువురు ప్రముఖులు డీవీ అంత్యక్రియలకు హాజరయ్యారు. -
విశాఖ మాజీ మేయర్ సుబ్బారావు కన్నుమూత
చికిత్స పొందుతూ కన్నుమూసిన విశాఖ మాజీ మేయర్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు డీవీ సుబ్బారావు విశాఖపట్నం: ప్రముఖ న్యాయవాది, విశాఖపట్నం నగర మాజీ మేయర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు దుర్వాసుల వెంకట సుబ్బారావు (డీవీ) (83) శనివారం ఇక్కడ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో రెండు రోజులుగా నగరంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. డీవీ భౌతికకాయాన్ని కిర్లంపూడి లే అవుట్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. సుబ్బారావుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అధికార లాంఛనాలతో కాన్వెంట్ జంక్షన్ వద్దనున్న హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డీవీ 1932 ఏప్రిల్ 24న పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురంలో జన్మించారు. 1956లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ న్యాయ కళాశాలలో లా డిగ్రీ పూర్తి చేశారు. 1957 అక్టోబర్ 21న న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ డీవీ నరసరాజు దగ్గర మెళకువలు నేర్చుకున్నారు. అకుంఠిత దీక్ష, వృత్తిపట్ల అంకితభావం అనతికాలంలోనే ఆయన్ని అత్యున్నత స్థాయికి చేర్చాయి. దేశంలోని ప్రముఖ కంపెనీలకు న్యాయ సలహాదారుగా పనిచేశారు. ప్రభుత్వ న్యాయవాదిగా మన్ననలు పొందారు. 2000 - 2004 మధ్య దేశంలో అత్యున్నతమైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా విశేష సేవలందించారు. న్యాయశాస్త్రంలో ఆయనకున్న పరిజ్ఞానం, వాదనా పటిమను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా అనేకమంది న్యాయ నిపుణులు ప్రశంసించారు. సుబ్బారావు 1985-87 మధ్య విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) అధ్యక్షునిగా, 1987-92 మధ్య నగర మేయర్‌గా పనిచేశారు. విశాఖలో లయన్స్ క్లబ్, లయన్స్ కేన్సర్ ఆస్పత్రి, శంకర్ నేత్రాలయం, కళాభారతి, పౌర గ్రంథాలయం, ఏవీఎన్ కళాశాల, విశాఖ వేలీ స్కూల్, గాయత్రీ విద్యా పరిషత్ వంటి ఎన్నో సంస్థలకు అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షునిగా ఉన్నారు. గతంలో భారత క్రికెట్ జట్టు మేనేజర్‌గా పనిచేశారు. కాగా, డీవీ సుబ్బారావు మృతి కి ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు సంతాపం ప్రకటించారు.