Earnings money
-
Kanika Talukdar: జై కొట్టాల్సిందే!
అస్సాంకు చెందిన కనిక భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కనికకు భవిష్యత్ చీకటిగా కనిపించింది. తాను ఎలా బతకాలి? అనే ఆందోళన మొదలైంది. ధైర్యం ఉంటే అదే దారి చూపిస్తుంది అంటారు. డీలా పడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకుంది. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వర్మికంపోస్ట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టిన కనిక ఇప్పుడు లక్షాధికారి అయింది... పెళ్లయిన మూడు సంవత్సరాలకు అస్సాంలోని బోర్జాహర్ గ్రామానికి చెందిన కనికా తలుక్దార్కు బిడ్డ పుట్టింది. బిడ్డ మూడు నెలల వయసులో ఉన్నప్పుడు భర్త అనారోగ్యంతో చనిపోవడం కనికను విషాదసాగరంలోకి నెట్టింది. కళ్ల ముందు పసిపాపే కనిపిస్తుంది. భవిష్యత్ మాత్రం మసకబారిపోయింది. ఆ సమయంలో వర్మికంపోస్ట్ రూపంలో ఒక వెలుగు కిరణం కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే) నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో వర్మికంపోస్ట్, చేపల పెంపకం, కోళ్ల పెంపకం...మొదలైన వాటి గురించి తెలుసుకుంది కనిక. వర్క్‌షాప్ తాలూకు విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వర్మికంపోస్ట్ తయారీ సులభం అనిపించింది. ఎందుకంటే ఆవు పేడలాంటి ముడిసరుకులు సేకరించడానికి తాను పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా తన చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వనరులతోనే వర్మికంపోస్ట్ తయారుచేయవచ్చు. 2019లో నార్త్ ఈస్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ రెండు నెలల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం కనికకు ఎంతో ఉపకరించింది. శిక్షణలో భాగంగా వర్మివాష్ను తయారు చేయడం నేర్చుకుంది. ఇది వర్మికంపోస్ట్ నుంచి తయారుచేసే ద్రవసారం. సాధారణ వర్మికంపోస్ట్ కంటే ఎక్కువ నత్రజని, భాస్వరం..మొదలైనవి ఇందులో ఉంటాయి. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టింది కనిక. కృషి విజ్ఞాన కేంద్ర ఉచితంగా వానపాములను అందించింది. ‘జై వర్మికంపోస్ట్’ బ్రాండ్‌తో వర్మికంపోస్ట్, వర్మివాష్ అమ్మకానికి రెడీ అయింది. తయారీ సంగతి సరే, మరి కొనేవారు ఎవరు? రసాయన ఎరువులకు అలవాటు పడిన రైతులకు వర్మికంపోస్ట్ నచ్చుతుందా? అందుకే తన ఉత్పత్తికి తానే ప్రచారకర్తగా మారింది. వర్మికంపోస్ట్ వాడకం వల్ల నేలకు జరిగే మేలు ఏమిటో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసింది. ఆమె శ్రమ వృథా పోలేదు. వ్యాపారం అడుగుల స్థాయి నుంచి పరుగుల స్థాయికి చేరుకుంది. పేడ కోసం మొదట రెండు ఆవులను కొన్న కనిక ఆ తరువాత నాలుగు ఆవులను ఒకేసారి కొనగలిగే స్థాయికి చేరింది. ఒకప్పుడు ‘జై’ కంపెనీ ఒక సంవత్సరంలో 800 కిలోల వర్మికంపోస్ట్‌ను ఉత్పత్తి చేసేది. ప్రస్తుతం అది నెలకు 35 టన్నుల స్థాయికి చేరుకుంది. అస్సాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లో ఎన్నో నర్సరీలు జై ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుత విజయం సాధించిన కనిక ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విద్యార్థుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (అస్సాం) ప్రతి నెల కనికతో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. ‘ఇది కలలో కూడా ఊహించని విజయం. ఎలా బతకాలో అని భయపడిన నేను ఎంతోమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఎలా బతకాలో తెలియక ఒకప్పుడు ధైర్యం కోల్పోయిన నేను ఇప్పుడు ఎంతోమందికి ధైర్యం చెబుతున్నాను. ఈ విశాలమైన ప్రపంచంలో మన కోసం ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిలో ఒకటి అందిపుచ్చుకున్నా మన జీవితమే మారిపోతుంది’ అంటుంది నలభై అయిదు సంవత్సరాల కనికా తలుక్దార్. -
సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీలరద్దుతో 2022–23లో అదనంగా రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40% టికెట్ ధరలో రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి దీన్ని నిలిపేసిన రైల్వే శాఖ ఇప్పటిదాకా పునరుద్ధరించలేదు. -
ఆఫ్టర్ వన్ ఇయర్.. ఐ విల్ బీ ఏ కింగ్..
‘ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బీ ఎ కింగ్’ అనే ఫేమస్ డైలాగ్ మీకు గుర్తుందా? ఎందుకంటే.. భారతీయుల్లో ఎక్కువ మంది దాదాపు ఈ తరహా సిద్ధాంతాన్నే నమ్ముతున్నారు మరి. ఇంతకీ విషయం ఏమిటంటే.. భవిష్యత్‌లో డబ్బున్నోళ్లం కాగలమన్న ధీమా ప్రపంచంలో భారతీయుల్లోనే ఎక్కువట. ఎప్పటికైనా డబ్బు సంపాదించుకోగలమనే విశ్వాసాన్ని ఎక్కువ మంది భారతీయులు వ్యక్తం చేసినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తాము ధనవంతులం అయ్యే అవకాశం అత్యంత ఎక్కువగా లేదా ఎక్కువగానే ఉందని పట్టణ ప్రాంతాలకు చెందిన భారతీయుల్లో 71 శాతం మంది తమ ఆన్లైన్ అధ్యయనంలో పేర్కొన్నట్లు స్టాటిస్టా గ్లోబల్ కన్జూమర్ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే సగటుకన్నా ఎక్కువ ధనాన్ని కూడబెట్టే అవకాశం తమకు ఉన్నట్లు 93 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డట్లు తెలిపింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. వ్యక్తిగత ఆర్థిక విజయాలు సాధించే విషయంలో ఇతర దేశాల ప్రజలు ఏమంత ఆశాజనకంగా లేరు. మెక్సికో, అమెరికా, జర్మనీకి చెందిన ప్రజల్లో కేవలం 24–25 శాతం మంది మాత్రమే ధనవంతులు కాగలగడంపై కొంత స్పష్టతతో ఉన్నారు. అలాగే సుమారు 50 శాతం మంది మాత్రం తాము ధనవంతులం కాగలమని విశ్వసించేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే, ఫ్రాన్స్‌లలో 40 శాతంకన్నా తక్కువ మంది ఈ ప్రశ్నకు సానుకూలంగా బదులివ్వగా వ్యక్తిగత ఆర్థిక విజయాలు సాధించడం తమకు అత్యంత కష్టమని 50%కన్నా ఎక్కువ మంది ఈ దేశాల ప్రజలు అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వివిధ దేశాల ప్రజల అభిప్రాయాలు (శాతాల్లో) చదవండి: పదేళ్ల క్రితం చేతిలో రూ.6,300.. ఇప్పుడేమో కోట్లు -
ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలి
మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దోమలగూడ : డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన దోమలగూడ రామకృష్ణమఠంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ‘శ్రద్ధ’ పేరుతో నిర్వహించనున్న మూడు రోజుల వాల్యూ ఓరియంటేషన్ రెసిడెన్షియల్ యూత్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో సత్ప్రవర్తన తేవడానికి హ్యూమన్ ఎక్స్‌లెన్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్వామి వివేకానంద స్పూర్తిగా యువత దేశాభివృద్ధికి తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. చైనా యువ శక్తిని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. యువత వ్యక్తిగత స్వార్ధం వీడి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరారు. అయితే కొందరు యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధించలేం అన్న నిస్పృహ తగదని, ప్రతి వ్యక్తి లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఓటమికి కృంగి పోకుండా, దానినినాంధిగా మలుచుకోవాలని సూచించారు. రూ.14,132 కోట్లతో అతి పెద్ద మెట్రో రైలు పనులు ప్రారంభించే ముందు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నామని, ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పనులు సాగిస్తున్నామన్నారు. హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత వేగంగా సాగుతున్న ప్రాజెక్టు అని, మూడేళ్లలోనే దాదాపు 50 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. అసెంబ్లీ, పాతబస్తీలో అలైన్మెంట్ మార్పుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద, హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డెరైక్టర్ స్వామి బోధమయానంద తదితరులు పాల్గొన్నారు.