30 నిమిషాల్లో ఎబోలా వైరస్ గుర్తింపు
టోక్యో: శరీరంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ జాడను కేవలం 30 నిమిషాల్లో గుర్తించే నూతన పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేసినట్లు జపాన్ పరిశోధకులు ఈరోజు తెలిపారు. ఈ వ్యాధి సోకి పశ్చిమ ఆఫ్రికాలో 15 వందల మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రోగులకు వైద్యులు సత్వర చికిత్స అందించడంలో తమ పరిశోధన ఉపయోగపడుతుందని నాగసాకి యూనివర్సిటీలోని పరిశోధక బృందం ప్రొఫెసర్ జిరో యసూడా చెప్పారు.
ప్రస్తుత విధానంలో వైరస్ను గుర్తించే పరీక్షలకు దాదాపు రెండు గంటల సమయం పడుతోందని తెలిపారు. తాము అభివృద్ధి చేసిన పరీక్షా విధానంలో ఈ ప్రక్రియ అరగంటలోగా ముగుస్తుందని వివరించారు. ప్రస్తుతం పరీక్షలకు ఖరీదైన పరికరాలను వాడవలసి ఉందని, తమ ప్రక్రియ చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చని యసూడా తెలిపారు.
**