EC india
-
రేపు ఈసీని కలవనున్న వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, హైదరాబాద్: రేపు న్యూఢిల్లీలో భారత సంఘం పుల్‌బెంచ్( ముగ్గురు కమిషనర్లతో కూడిన బెంచ్)ని గురువారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కలవనుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి గారితో కూడిన బృందం కలసి ఈసీకి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలో యధేచ్ఛగా జరుగుతున్న ఎన్నికల ఉల్లంఘనలపై ఈసీని కలసి నివేదికనే అందిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. -
ఎలక్టోరల్ రూల్స్ సవరించండి: ఈసీ
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సమయంలో ఓటింగ్ సరళిని వెల్లడించేలా ఉన్న ప్రస్తుత పద్ధతిని మార్చాలని, రహస్య ఓటింగ్ ప్రక్రియను కాపాడేలా కొత్త పరికరాన్ని వినియోగించేలా ఎన్నికల నియమావళికి సవరణలు చేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం కోరింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. పోలింగ్ స్టేషన్లవారీగా ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారని, దీని వల్ల వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి అందరికీ తెలిసిపోతోందని, దీనివల్ల ఓటర్లు బెదిరింపులు, దాడులు, వివక్ష కు గురవుతున్నారని పేర్కొంది. అందువల్ల ఒక్కో ఈవీఎంను విడివిడిగా కాకుండా 14 ఈవీఎంల్లోని ఓట్లను ఒకేసారి లెక్కించే ‘టోటలైజర్’ పరికరాన్ని వారడాలంది. ఎన్నికల్లో పార్టీల వార్తలను ఆమోదించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఈసీ ప్రసార భారతిని కోరింది. బిహార్ ఎన్నికల సమయంలో వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఈ విధంగా స్పందించింది.