సాక్షి, హైదరాబాద్: రేపు న్యూఢిల్లీలో భారత సంఘం పుల్‌బెంచ్( ముగ్గురు కమిషనర్లతో కూడిన బెంచ్)ని గురువారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కలవనుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి గారితో కూడిన బృందం కలసి ఈసీకి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలో యధేచ్ఛగా జరుగుతున్న ఎన్నికల ఉల్లంఘనలపై ఈసీని కలసి నివేదికనే అందిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment