న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సమయంలో ఓటింగ్ సరళిని వెల్లడించేలా ఉన్న ప్రస్తుత పద్ధతిని మార్చాలని, రహస్య ఓటింగ్ ప్రక్రియను కాపాడేలా కొత్త పరికరాన్ని వినియోగించేలా ఎన్నికల నియమావళికి సవరణలు చేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం కోరింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. పోలింగ్ స్టేషన్లవారీగా ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారని, దీని వల్ల వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి అందరికీ తెలిసిపోతోందని, దీనివల్ల ఓటర్లు బెదిరింపులు, దాడులు, వివక్ష కు గురవుతున్నారని పేర్కొంది.
అందువల్ల ఒక్కో ఈవీఎంను విడివిడిగా కాకుండా 14 ఈవీఎంల్లోని ఓట్లను ఒకేసారి లెక్కించే ‘టోటలైజర్’ పరికరాన్ని వారడాలంది. ఎన్నికల్లో పార్టీల వార్తలను ఆమోదించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఈసీ ప్రసార భారతిని కోరింది. బిహార్ ఎన్నికల సమయంలో వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఈ విధంగా స్పందించింది.
ఎలక్టోరల్ రూల్స్ సవరించండి: ఈసీ
Published Fri, Jan 22 2016 2:25 PM | Last Updated on Tue, Aug 14 2018 5:15 PM
Advertisement
Advertisement