1000 లీటర్ల సారా ధ్వంసం
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : ఎక్సైజ్, పోలీసు అధికారులు వెయ్యి లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని సుండుపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని ఉండ్రరాజుపల్లి, నాయినివారిపల్లి అటవీ ప్రాంతంలో ఎక్సైజ్, పోలీసు అధికారులు ఏక కాలంలో దాడులు చేసి 1000 లీటర్ల సారాను ధ్వంసం చేశారు.