Edhi Foundation
-
భారత్-పాక్ ఐక్యతకు చిహ్నానివి
‘భారత పుత్రిక’ గీతతో రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ: ‘భారత పుత్రిక’ గీత (23) మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వేర్వేరుగా కలుసుకుంది. ఈది ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న గీతను ప్రణబ్ ఆశీర్వదించారు. ఆమెను భారత్-పాక్ పుత్రికగా, ఇరు దేశాల ఐక్యతకు చిహ్నంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఈది ఫౌండేషన్ చేస్తున్న మంచిపనులను ఆయన అభినందించారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో గీత అంతకుముందు కలుసుకోగా అన్ని రకాలుగా ఆమెకు అవసరమైన సాయం చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. సంజ్ఞల భాష దుబాసీ సాయంతో కేజ్రీవాల్ గీతతో సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. మరోవైపు గీత తల్లిదండ్రులం తామేనంటూ యూపీలోని రాంపూర్‌కు చెందిన అనారాదేవి, రామ్‌రాజ్‌లు గీతను కలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని...డీఎన్ఏ పరీక్షకు సైతం తాము సిద్ధమని అనారాదేవి తెలిపింది. కాగా, గీతను అధికారులు మంగళవారం ఇండోర్‌లోని బధిరుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తన అసలైన తల్లిదండ్రులెవరో తేలేవరకు ఆమె అక్కడే ఉండనుంది. రూ. కోటి విరాళాన్ని తిరస్కరించిన ఈది ఫౌండేషన్: గీత బాగోగులు చూసుకున్నందుకు భారత ప్రధాని మోదీ ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని పాక్ స్వచ్ఛంద సంస్థ ఈది ఫౌండేషన్ మంగళవారం తిరస్కరించింది. మోదీ ప్రకటనపట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది కృతజ్ఞత తెలుపుతూనే ఆర్థికసాయాన్ని సున్నితంగా తిరస్కరించారని సంస్థ ప్రతినిధి అన్వర్ తెలిపారు. -
మోదీకి 'ఈదీ' షాక్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కోటి రూపాయల బహుమానాన్ని ఈదీ ఫౌండేషన్ తిరస్కరించింది. పాకిస్థాన్ కు చెందిన ఈ సంస్థే గీతకు ఆశ్రయం కల్పించింది. సోమవారం భారత్ కు చేరుకున్న గీత.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఉద్వేగభరితుడైన మోదీ.. కంటికిరెప్పలా గీతను చూసుకున్నందుకు ధన్యవాదాలంటూ ఈదీ ఫౌండేషన్ చైర్మన్ సతీమణి బిల్కిస్ బానో ను అభినందించారు. 'భారత పుత్రికకు మీరు అందించిన సాయం వెలకట్టలేనిదే అయినప్పటికీ మీ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా వంతు సాయంగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాం' అని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ఈదీ ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ సత్తార్ ఈదీ మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్వర్ ఖాజ్మీ.. ఈదీ నిర్ణయాన్ని మీడియాకు తెలిపారు. ' మోదీ ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ ఆయన ప్రకటించిన విరాళాన్ని స్వీకరించలేం' అని ప్రకటనలో పేర్కొన్నారు. 15 ఏళ్ల కిందట భారత్ నుంచి తప్పిపోయిన బాలిక గీతను కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఈదీ ఫౌండేషన్ అక్కున చేర్చుకుంది. హిందూ దేవుళ్లను పూజించుకునే అవకాశాన్ని కల్పించి మురిపెంగా పెంచుకుంది. బజరంగీ భాయిజాన్ సినిమా తర్వాత వెలుగులోకి వచ్చిన గీత కథ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గీత వెంట ఇండియాకు వచ్చిన వారిలో ఈదీ సతీమణి బిల్కిస్ బానోతోపాటు ఆమె మనవరాళ్లు సాబా, సాద్ ఈదీలు కూడా ఉన్నారు. వీరు ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖుల్ని కలుసుకున్నారు. డీఎన్ఏ ఫలితాల అనంతరం తల్లిదండ్రులు ఎవరో నిర్ధారణ అయ్యేంతవరకు గీత ఇండోర్ లోని ట్రైనింగ్ సెంటర్ లో ఉంటుంది. -
మోదీని కలిసిన గీత
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన గీత సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లో గీత బాగోగులు చూసుకున్న ఈధీ ఫౌండేషన్‌కు ప్రధాని మోదీ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. గీతను ఆత్మీయంగా హత్తుకున్న మోదీ మాట్లాడుతూ 'స్వాగతం గీత. నువ్వు తిరిగి ఇంటికి చేరుకోవడం నిజంగా ఒక అద్భుతం. ఈ రోజు నీతో కాసేపు మాట్లాడటం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. యావత్ భారతం నీ బాగోగులు చూసుకుంటుంది' అని భరోసా ఇచ్చారు. ఆమె కుటుంబసభ్యులను కనుగొనడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని హామీ ఇచ్చారు. గీత బాగోగులను చూసుకున్న ఈధీ ఫ్యామిలీ ఫౌండేషన్‌కు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. కరుణ, దయకు ఆ సంస్థ ప్రతీక అని అభివర్ణించారు. -
అచ్చం బజరంగీ భాయ్‌జాన్ కథే... మరి హీరో?
కరాచీ: బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న 'బజరంగీ భాయ్‌జాన్' చిత్రంలో చిన్నారి షాహిద్ అలియాస్ మున్నీ గుర్తుందా....అచ్చం ఈ సినిమాలోని చిన్నారి లాగానే పాకిస్తాన్లో ఓ యువతి భారత్‌లో ఉన్న తన కన్నవాళ్లను కలుసుకునేందుకు తపించిపోతోంది. గత 15 ఏళ్లుగా పాకిస్తాన్‌లోని ఒక అనాధ శరణాలయంలో ఉంటున్న ఆమె నిత్యం తన కుటుంబాన్ని తలచుకుంటూ కుమిలిపోతోంది. తనను.. తన కుటుంబసభ్యులతో కలిపేవారి కోసం ఎదురు చూస్తోంది. సినిమాలోని చిన్నారి షాహిద్ లాగానే ఆ యువతి కూడా పుట్టు చెముడు, మూగ. ఇదంతా...పాకిస్తాన్ హక్కుల కార్యకర్త అన్సర్ బర్నే సోషల్ మీడియాలో పంచుకోడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ యువతి కుటుంబసభ్యుల వివరాలు ఎవరికైనా తెలిస్తే సాయం చేయమంటూ విజ్ఞప్తి చేశారు. తన సైగల ద్వారా తనకు 12మంది తోబుట్టువు ఉన్నారని, వారిలో ఏడుగురు సోదరులు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు వున్నారని తెలిసిందన్నారు. ఆ యువతి వయసు 22, 24 సంవత్సరాల మధ్య ఉంటుందని అయితే పొట్టిగా ఉండటం వల్ల చిన్నదానిలా కనిపిస్తుందని తెలిపారు. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమెగా భావిస్తున్నామని తెలిపారు. మూడేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులను వెతికేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని, సల్మాన్ ఖాన్ సినిమా చూసిన తరువాత మళ్లీ తనలో ఆశలు చిగురించాయని అన్సర్ బర్నే తెలిపారు. తాను సెప్టెంబర్‌లో భారత్‌కు వస్తున్నానని, అపుడు ఆమెను ఆమె కుటుంసభ్యుల వద్దకు చేర్చాలనేది తన కోరిక అని ఆయన వెల్లడించారు. అందుకు భారత ప్రభుత్వం సహకరిస్తే బావుంటుందని బర్నే ఆశిస్తున్నారు. కాగా సుమారు ఏడేళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన గీత.. అలా.. అలా. పాకిస్తాన్ చేరింది. పలు అనాధ శరణాలయాల్లో ఆశ్రయం పొందింది. చివరకు పాకిస్తాన్లో పేరుపొందిన ఈధీ ఫౌండేషన్ లో తలదాచుకుంటోంది. ఫౌండేషన్ వాళ్లే అమ్మాయికి గీత అని పేరుపెట్టారు. 'పుట్టు మూగ చెవిటి అయిన గీత తరచూ బిగ్గరగా ఏడూస్తూ ఉంటుంది. ఆమెకు హిందీ రాయడం తెలుసట. హిందూ యువతిలాగా నెత్తిన కొంగు వేసుకుంటుంది, తరచూ గుడికి వెడుతుంద'ని ఈధి ప్రతినిధి తెలిపారు. దీంతో గీత హిందూ సాంప్రదాయ కుటుంబానికి చెందినదిగా భావిస్తున్నామని, అయితే ఇక్కడున్న ముస్లింలతో పాటు రంజాన్ సందర్భంగా ఆమెకూడా రోజాను పాటించిందన్నారు. కానీ ఆమె హిందూ అమ్మాయిలా ఉండడంతో తమ దగ్గర ఆమెకోసం ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలో పుట్టు మూగ అయిన షాహిదా పొరపాటున పాకిస్తాన్ వెళ్లడానికి బదులు.. ఢిల్లీ ట్రైన్ ఎక్కి.. ఇండియా వచ్చేస్తుంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, తనను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చే నాధుడు ఎవరా? అని దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పాపను అష్టకష్టాలు పడి చివరికి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు హీరో సల్మాన్ ఖాన్. ఈ క్రమంలో భజరంగీకి పాకిస్తాన్ రిపోర్టర్ నవాజుద్దీన్ ఖాన్ సహాయపడతాడు. మరి ఈ గీతకు శుభం కార్డు వేసే హీరో ఎవరో?