గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన
పాన్గల్ : మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం సమీపంలో మార్కెట్ గోదాం నిర్మాణం చేపట్టేందుకు శనివారం మార్కెంటింగ్ శాఖ ఈఈ రామారావు, ఏఈ శ్రీనివాసులు స్థలాన్ని పరిశీలించారు. రూ.3కోట్లతో గోదాం నిర్మాణం చేపట్టనున్నామని, ఇందుకుగాను స్థలాన్ని ఎంపిక చేస్తున్నట్లు వారు తెలిపారు. గుట్ట మాదిరిగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మట్టిని తొలగించి చదును చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వారి వెంట కాంట్రాక్టర్ తిరుపతయ్యసాగర్ ఉన్నారు.